Publish Date:Jun 18, 2025
ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఉద్రిక్తలు చోటు చేసుకున్నా, ముఖ్యంగా ఇరుగు పొరుగు దేశాల మధ్య యుద్ధ వాతావరణం, నెలకొన్న సమయంలో, ఆయా దేశాల్లో చదువుకుంటున్న భారతీయ విద్యార్ధులను, ఇతరత్రా, ఉద్యోగ, ఉపాధి వ్యాపకాల్లో ఆయా దేశాల్లో ఉన్న భారతీయులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారుతున్నది. గతంలో రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో ఉక్రెయిన్ లో చిక్కుకు పోయిన వందలాది మంది భారత విద్యార్ధులను మన విదేశాంగ శాఖ ఆ దేశంతో దౌత్య పరమైన చర్చలు జరిపి సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చింది.
ఇప్పడుమళ్ళీ మరో మారు అలంటి పరిస్థితే ఎదురైంది.ఇజ్రాయెల్-ఇరాన్ దేశాల మధ్య యుద్ద వాతావరణం వేడెక్కుతున్న నేపథ్యంలో ఇరు దేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా ఇరాన్ లో పెద్ద సంఖ్యలో ఉన్న భారతీయ విద్యార్ధులను సురక్షితంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు విదేశాంగ శాఖ నడుం బిగించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మూడు దేశాల విదేశీ పర్యటనలో ఉన్న విదేశాంగ మంత్రి ఎస్. జయశంకర్ భారతీయ విద్యార్ధులు సురక్షితంగా సరిహద్దులు దాటేలా అనుమతించాలని చేసిన విజ్ఞప్తిని ఇరాన్ ప్రభుత్వం వెంటనే ఆమోదించింది. అయితే.. ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ తమ గగనతలాన్ని ఇప్పటికే మూసేసిన నేపథ్యంలో, భూసరిహద్దుల్ని తెరిచి భారతీయ విద్యార్ధులను, సరిహద్దులు దాటించేందుకు ఇరాన్ అంగీకరించింది.
ఇరాన్లో భారత్ కు చెందిన 1500 మందికి పైగా విద్యార్దులున్నారు. వారిని తరలించడానికి సహకరించాల్సిందిగా భారత్ చేసిన అభ్యర్థనల దృష్ట్యా వారు సురక్షితంగా సరిహద్దులు దాటి వెళ్లడానికి అన్ని భూ సరిహద్దులు దాటడానికి తెరిచి ఉన్నాయని ఇరాన్ విదేశాంగమంత్రి అబ్బాస్ అరాగ్చీ ప్రకటించారు. దీంతో ఇరాన్ లో చిక్కుకుపోయిన భారత విద్యార్ధులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటారనీ, ఆందోళన చెంద వలసిన అవసరం లేదని విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/students-return-home-safely-from-iran-39-200242.html
రాజస్థాన్‌లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ జాగ్వర్ ఫైటర్ ఎయిర్ క్రాప్ట్ కుప్పకూలింది. చురు జిల్లాలోని రతన్‌గఢ్ ప్రాంతంలో క్రాష్ అయింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అంటే ఏంటని ఇండియాలో గల్లీలో చిన్న పిల్లాడిని అడిగినా చెబుతారు. అదీ ఐపీఎల్ కు ఉన్న వాల్యూ. అదీ ఐపీఎల్‌కున్న క్రేజ్, ఫేమ్. ప్రతి ఏటా కోట్లాది మంది క్రికెట్ అభిమానులను అలరిస్తూ.. అంతకంతకు ఆదరణను పెంచుకుంటోంది
నీటిఎద్దడి ప్రమాదఘంటికలు మ్రోగిస్తోంది. నీటి వినియోగం రోజురోజుకూ పెరిగిపోవడం, వృధాగా నీరు మురికి కాలువలో కలిసిపోవడం.తో నీటి ఎద్దడి రోజురోజుకూ తీవ్రమౌతోంది. పట్టణాలు,నగరాలు విస్తరణ కారణంగా ఏటికేడు నీటి వినియోగంవిపరీతంగా పెరిగిపోతోంది.
ప్రతిష్ఠాత్మక సింహాద్రి అప్పన్న ఆలయంలో నేడురేపు జరిగే గిరి ప్రదక్షిణకు దేశం నలుమూలల నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు. ఏటా ఆషాఢమాసంలో జరిగే ఈ గిరి ప్రదక్షిణకు ఈ ఏడు పదిలక్షల మంది వరకూ హాజరౌతారన్న అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు.
గ్రేటర్‌లో హైడ్రా కూల్చివేతల పర్వం మొదలైనప్పటి నుంచి పాతబస్తీలోని ఒవైసీ విద్యాసంస్థలపై పెద్ద దుమారమే రేగుతోంది. పాతబస్తీలోని సూరం చెరువులోని ఎఫ్‌టీఎల్‌లో ఫాతిమా కాలేజీని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ నిర్మించారు. అయితే ఈ కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రతిపక్షాలు హైడ్రా అధికారులని ప్రశ్నిస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటన సందర్భంగా వైసీపీ శ్రేణులు రెచ్చిపోయాయి. జగన్ పర్యటన సందర్భంగా చిత్తూరు జిల్లా పోలీసులు పలు ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఎన్నికల హామీల అమలులో స్పీడ్ పెంచారు. సూపర్ సిక్స్ హామీలలో ఒకటైన మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకాన్ని ఈ ఏడాది ఆగస్టు 15 నుంచీ అమలు చేయనున్నారు.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. జూరాల, సుంకేసుల నుంచి భారీగా వరద నీరు శ్రీశైలం డ్యామ్‌కు చేరుతుండటంతో శ్రీశైలం జలాశయం నిండుకుండలా మారింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళకు పైగానే సమయం వుంది. జమిలి ఎన్నికలు వస్తేనో, ఇంకేదైనా జరిగితేనో ఏమో కానీ, లేదంటే.. 2028 సెకండ్ హాఫ్ లో కానీ తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం లేదు. నిజానికి.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇంకా నిండా రెండేళ్ళు అయినా కాలేదు.
ఒక్కో వంశానికి ఒక్కో మూల పురుషుడు ఉంటారు. రాజమౌళి వంశానికి శివశక్తిదత్త అలాగ. ఎందుకంటే ఆయనేగానీ తాను సినిమాల్లోకి రావాలని అనుకోకుండా ఉండి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. అసలా కుటుంబానికి సినిమా పిచ్చి పట్టి ఉండేదే కాదు.
ఎవరో వస్తారని,ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అన్న ఓ కవి మాటను ఆదర్శంగా తీసుకున్న ఆ గ్రామాల ప్రజలు తమ సొంత వ్యయంతో సమస్యలను పరిష్కరించుకుంటున్నారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బుధవారం (జులై 9) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు 21 కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు.
ఏపీ బ్రాండ్‌ను దెబ్బతీసేందుకై మాజీ సీఎం జగన్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి కుట్రలు చేస్తూ రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నదంటూ గగ్గోలు పెడుతున్నారని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు.