భేటీల వెనక బలమైన వ్యూహం ?

Publish Date:Aug 27, 2022

Advertisement

కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్’ వచ్చారు. మునుగోడు మాజీ శాసనసభ్యుడు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి  భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వెంకట రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసని ఓడించి  ముఖ్యమంత్రి కేసీఆర్, అరాచక, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 

అయితే, వచ్చిన పని చూసుకుని  ఇంచక్కా విమానం ఎక్కరా అంటే లేదు.  పనిలో పనిగా, రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి, ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత రామోజీ రావుతో భేటి అయ్యారు. అంతే కాదు, అక్కడి నుంచి నోవాటెల్’ హోటల్’కు వచ్చి జూనియర్ ఎన్టీఆర్’ తో సంవేసంయ్యారు. ముందు 15 నిముషాలు అనుకున్న ఈభేటీ సుమారు 40 నిముషాలకు పైగా సాగింది. డిన్నర్ తో ముగిసింది. రామోజీ రావును అమిత్ షా ఎందుకు కలిశారు? జూనియర్ ఎన్టీఆర్’తో అంతసేపు ఏమి ముచ్చటించారు? ఈ ప్రశ్నల చుట్టూ రాజకీయ చర్చ ఇంకా అలా సాగుతూనే వుంది. ఊహాగానాలు. రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూనే ఉన్నాయి.  

ఇంతలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మూడవ విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్’ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆరాచక పాలన, నియత్రుత్వ పోకడలను ఎండగట్టారు. ఎన్నికల ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని రొటీన్ స్పీచ్ ఇచ్చారు. 
అయితే, అమిత్ షా తమ పర్యటనలో ఈనాడు, ఈ టీవీల అధినేత రామోజీ రావును, ఫిల్మ్ స్టార్’ జూనియర్ ఎన్టీఆర్’ ను కలిస్తే, నడ్డా  టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. అలాగే, మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ కూడా నడ్డాతో సమావేసమయ్యారు. 

ఈ సమావేశాలు ఒకెత్తు అయితే, టీవీ 9 అధిపతి, రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావుతోనూ జేపీ నడ్డాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రామేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య నిన్న మొన్నటి వరకు మంచి సాన్నిహిత్యముంది. ఆర్థిక బంధాలు, బంధనాలు ఉన్నాయి. కేసేఆర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రామేశ్వర రావు ఆర్థిక సహాయం చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ అణా పైసలతో సహా తిరిగి చేల్లిచండమే కాకుండా,  ఆయన వ్యాపార అభివృద్ధికి అన్ని విధాలా సహకరించారు. బినామీ వ్యవహారాలు నడిచాయని అంటారు.  అయితే, ఈ మధ్య కాలంలో, రామానుజుల వారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇద్దరికీ పెద్ద దిక్కుగా ఉన్న చిన్న జీయర్ స్వామితో  ముఖ్యమంత్రి  కీసీఆర్’ కు చెడింది. ఆ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కాణంగా  రామేశ్వరరావు, కేసీఆర్ మధ్య కూడా దూరం పెరిగిందని, పుంఖాను పుంఖాలుగా కథనాలు, కథలు వస్తూనే ఉన్నాయి. 

ఇక ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, రామేశ్వరరావు ఇప్పుడు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన పలుమార్లు రహస్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం ఉంది. అలాగే, బీజేపీ ఆయనకు యూపీ లేదా మరో రాష్ట్రం నుంచి  రాజ్య సభ టికెట్ ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో  మైహోం రామేశ్వరరావు, జేపీ నడ్డాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. 

నిజం రాజకీయ నాయకులు, ముఖ్యంగా  బీజేపీ అగ్ర త్రయం రాజకీయ ఉద్దేశ, దురుద్దేశాలు  లేకుండా ఎవరినీ కలవరు. కలసినా,, ఇలా గంటల గంటలు సమయం వృధా  చేసుకోరు.. సో ఈ వరస భేటీల వెనక బీజేపీ పెద్దల, ‘పేద్ద’ వ్యూహమే ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు , ఓ వంక ఇతర పార్టీల  నుంచి సీనియర్ నాయకులను తెచ్చుకోవడంతో పాటుగా, ఇతర రంగాల్లో ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాల్లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న వారిని ఆకర్షించేందుకే, మోడీ, అమిత్ షా, నడ్డా ఎక్కడికి వెళ్ళినా అక్కడి లోకల్ టాలెంట్’ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే  రాష్ట్రానికి వచ్చిన నాయకులు వివిద రంగాల ప్రముఖలతో సంవేసమవుతున్నారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అలగే, ఇది ఏదో ఒక్క తెలంగాణకు సంబందించిన వ్యూహం కాదని, దేశం అంతటా ఉన్నదనే అని కూడా  అంటున్నారు.

By
en-us Political News

  
టీవీకే అధినేత విజయ్‌తో భేటీ అనంతరం రాజ్ భవన్ ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేసింది. అసెంబ్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఉండాల్సిన సంఖ్యాబలంపై గవర్నర్.. విజయ్‌కు మార్గనిర్దేశం చేశారు. కేవలం అతిపెద్ద పార్టీగా ఉండటమే కాకుండా, సభలో తగినంత మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు ఆధారాలు చూపాలని సూచించారు.
పిఠాపురంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో చంద్ర‌బాబు ఫొటోలేద‌ని ఆరోపిస్తూ.. మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ అధికారుల‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేన నేత‌, మాజీ ఎమ్మెల్యే దొర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో వాగ్వాదం చోటు చేసుకుంది. వ‌ర్మ దురుసు వ్యాఖ్య‌ల‌పై పార్టీలో అంత‌ర్గ‌తంగా చ‌ర్చించిన అధిష్టానం.. వ‌ర్మ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుబ‌ట్టింది. ఇంతలోనే వర్మను ఇంచార్జ్ పదవి నుంచి తొలగించడం చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే ఏ విధంగానూ అడ్డుపడబోదన్నారు. రాష్ట్రంలో మరోసారి ఎన్నికలు రావాలని గానీ, రాజ్యాంగ సంక్షోభం తలెత్తాలనీ కానీ తాము కోరుకోవడం లేదన్నఆయన.. ప్రజాతీర్పునకు అనుగుణంగానే డీఎంకే నడుచుకుంటున్నదన్నారు.
గతంలో విజయ్‌కు ఉన్న ప్రాణహాని హెచ్చరికలు.. ఆయన పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సాయుధ పోలీసులతో కూడిన భద్రతను ఏర్పాటు చేసింది. అయితే.. తాజాగా నిర్వహించిన భద్రతా సమీక్షలో భాగంగా ఆయనకు ఇకపై అదనపు సెక్యూరిటీ అవసరం లేదని అధికారులు భావించినట్లు తెలుస్తోంది.
తాజా ఎన్నికల ఫలితాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) 108 స్థానాలతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే.. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఆ పార్టీకి ఇంకా లభించలేదు. కాంగ్రెస్‌తో కలిపి విజయ్ బలం ప్రస్తుతం 112కు చేరినప్పటికీ.. మేజిక్ ఫిగర్‌కు ఇంకా ఆరు అడుగుల దూరంలో ఉంది.
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.