భేటీల వెనక బలమైన వ్యూహం ?
Publish Date:Aug 27, 2022
Advertisement
కొద్ది రోజుల క్రితం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్’ వచ్చారు. మునుగోడు మాజీ శాసనసభ్యుడు, కోమటి రెడ్డి వెంకటరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని, ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. వెంకట రెడ్డికి కాషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాసని ఓడించి ముఖ్యమంత్రి కేసీఆర్, అరాచక, కుటుంబ పాలనకు చరమ గీతం పాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. అయితే, వచ్చిన పని చూసుకుని ఇంచక్కా విమానం ఎక్కరా అంటే లేదు. పనిలో పనిగా, రామోజీ ఫిలిం సిటీకి వెళ్లి, ఈనాడు, ఈటీవీ సంస్థల అధినేత రామోజీ రావుతో భేటి అయ్యారు. అంతే కాదు, అక్కడి నుంచి నోవాటెల్’ హోటల్’కు వచ్చి జూనియర్ ఎన్టీఆర్’ తో సంవేసంయ్యారు. ముందు 15 నిముషాలు అనుకున్న ఈభేటీ సుమారు 40 నిముషాలకు పైగా సాగింది. డిన్నర్ తో ముగిసింది. రామోజీ రావును అమిత్ షా ఎందుకు కలిశారు? జూనియర్ ఎన్టీఆర్’తో అంతసేపు ఏమి ముచ్చటించారు? ఈ ప్రశ్నల చుట్టూ రాజకీయ చర్చ ఇంకా అలా సాగుతూనే వుంది. ఊహాగానాలు. రాజకీయ విశ్లేషణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇంతలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్రానికి వచ్చారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మూడవ విడత ప్రజా సంగ్రామ పాద యాత్ర ముగింపు సందర్భంగా వరంగల్’ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఆరాచక పాలన, నియత్రుత్వ పోకడలను ఎండగట్టారు. ఎన్నికల ఎప్పుడొచ్చినా అధికారం తమదేనని రొటీన్ స్పీచ్ ఇచ్చారు. ఈ సమావేశాలు ఒకెత్తు అయితే, టీవీ 9 అధిపతి, రియల్ ఎస్టేట్ వ్యాపారి మైహోం రామేశ్వరరావుతోనూ జేపీ నడ్డాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. రామేశ్వర రావు ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్య నిన్న మొన్నటి వరకు మంచి సాన్నిహిత్యముంది. ఆర్థిక బంధాలు, బంధనాలు ఉన్నాయి. కేసేఆర్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో రామేశ్వర రావు ఆర్థిక సహాయం చేస్తే, అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి కేసీఆర్ అణా పైసలతో సహా తిరిగి చేల్లిచండమే కాకుండా, ఆయన వ్యాపార అభివృద్ధికి అన్ని విధాలా సహకరించారు. బినామీ వ్యవహారాలు నడిచాయని అంటారు. అయితే, ఈ మధ్య కాలంలో, రామానుజుల వారి విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా ఇద్దరికీ పెద్ద దిక్కుగా ఉన్న చిన్న జీయర్ స్వామితో ముఖ్యమంత్రి కీసీఆర్’ కు చెడింది. ఆ ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కాణంగా రామేశ్వరరావు, కేసీఆర్ మధ్య కూడా దూరం పెరిగిందని, పుంఖాను పుంఖాలుగా కథనాలు, కథలు వస్తూనే ఉన్నాయి. ఇక ఆతర్వాత ఏమి జరిగిందో ఏమో కానీ, రామేశ్వరరావు ఇప్పుడు బీజేపీ పెద్దలతో సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన పలుమార్లు రహస్యంగా ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారన్న ప్రచారం ఉంది. అలాగే, బీజేపీ ఆయనకు యూపీ లేదా మరో రాష్ట్రం నుంచి రాజ్య సభ టికెట్ ఆఫర్ చేసిందనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో మైహోం రామేశ్వరరావు, జేపీ నడ్డాతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. నిజం రాజకీయ నాయకులు, ముఖ్యంగా బీజేపీ అగ్ర త్రయం రాజకీయ ఉద్దేశ, దురుద్దేశాలు లేకుండా ఎవరినీ కలవరు. కలసినా,, ఇలా గంటల గంటలు సమయం వృధా చేసుకోరు.. సో ఈ వరస భేటీల వెనక బీజేపీ పెద్దల, ‘పేద్ద’ వ్యూహమే ఉంటుందని పరిశీలకులు అంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో పార్టీని బలోపేతం చేసేందుకు , ఓ వంక ఇతర పార్టీల నుంచి సీనియర్ నాయకులను తెచ్చుకోవడంతో పాటుగా, ఇతర రంగాల్లో ముఖ్యంగా సినిమా, క్రీడా రంగాల్లో ఇప్పటికే మంచి గుర్తింపు ఉన్న వారిని ఆకర్షించేందుకే, మోడీ, అమిత్ షా, నడ్డా ఎక్కడికి వెళ్ళినా అక్కడి లోకల్ టాలెంట్’ను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే రాష్ట్రానికి వచ్చిన నాయకులు వివిద రంగాల ప్రముఖలతో సంవేసమవుతున్నారని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు. అలగే, ఇది ఏదో ఒక్క తెలంగాణకు సంబందించిన వ్యూహం కాదని, దేశం అంతటా ఉన్నదనే అని కూడా అంటున్నారు.
అయితే, అమిత్ షా తమ పర్యటనలో ఈనాడు, ఈ టీవీల అధినేత రామోజీ రావును, ఫిల్మ్ స్టార్’ జూనియర్ ఎన్టీఆర్’ ను కలిస్తే, నడ్డా టాలీవుడ్ హీరో నితిన్‌తో భేటీ అయ్యారు. అలాగే, మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ కూడా నడ్డాతో సమావేసమయ్యారు.
http://www.teluguone.com/news/content/strong-strategy-behind-meets-25-142783.html





