కొండా సురేఖ చూపు బీఆర్ఎస్ వైపు.. కేసీఆర్ పై పొగడ్తల వర్షం అందుకేనా?

Publish Date:Sep 4, 2026

Advertisement

రేవంత్ రెడ్డి తన కేబినెట్ నుంచి కొండా సురేఖను  బర్త్ రఫ్ తరువాత ఆమె రాజకీయ అడుగులు ఎటువైపు అన్న ఉత్కంఠ తెలంగాణ రాజకీయవర్గాలలో నెలకొంది. బీజేపీవైపు ఆమె అడుగులు పడే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషణలకు కూడా చేశారు. అయితే తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని, నాయకత్వ శైలిని ఆమె కొనియాడతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారాయి. 

గతంలో బీఆర్ఎస్ పార్టీ  కొనసాగిన కాలంలో   కేసీఆర్‌తో  తమ కుటుంబానికి ఉన్న సంబంధాల గురించి తాజాగా వివరించిన  కొండా సురేఖ.. కేసీఆర్ చాలా మంచి వ్యక్తి అని కితాబిచ్చారు. తాను ఆయనతో ఎప్పుడు భేటీ అయినా ఎంతో ఆప్యాయంగా, హుందాగా రిసీవ్ చేసుకునేవారని  గుర్తుచేసుకున్నారు. పార్టీలో సుదీర్ఘకాలం పాటు కలిసి పనిచేసినప్పటికీ, కేసీఆర్ వ్యవహారశైలి తమకు ఎప్పుడూ ఎలాంటి అసంతృప్తి కలిగించలేదన్న కొండా సురేఖ.. బీఆర్ఎస్ అధినాయత్వంతో  తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పడమే కాకుండా.. కేసీఆర్ నాయకత్వంలో తనకు ఎటువంటి ఇబ్బందులూ ఎన్నడూ ఎదురు కాలేదన్నారు. 

ఈ సందర్భంగా కొండా సురేఖ తన భర్త కొండా మురళికి గతంలో దక్కిన ఎమ్మెల్సీ పదవికి  కేసీఆర్ హయాంలోనే  దక్కిందని గుర్తు చేశారు. బీఆర్ఎస్‌లో ఉన్న సమయంలో కొండా మురళికి శాసనమండలికి వెళ్లే అవకాశం వచ్చినప్పుడు..  పార్టీలోని కొందరు సీనియర్ నేతలు  అడ్డుకునేందుకు  ప్రయత్నించారనీ, ముఖ్యంగా  కడియం శ్రీహరి వంటి సీనియర్ నాయకులు మురళికి ఆ పదవిని దక్కకుండా చేసేందుకు తెరవెనుక పావులు కదిపారని తాజాగా ఆరోపించారు. అయితే  కేసీఆర్ మాత్రం వాటన్నిటినీ తోసి రాజని,  కొండా మురళి ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకారం అందించారని కొండా సురేఖ గుర్తు చేసారు.  

ప్రస్తుత పరిస్థితుల్లో కొండా సురేఖ కేసీఆర్ ను పొగడ్తలతో ముంచెత్తడం రాజకీయంగా ఆమె అడుగులు ఎటుపడుతున్నాయన్నదానిపై ఒక స్పష్టత ఇచ్చేయడమేనన్నారు. గతంలో  బీఆర్ఎస్ పై తీవ్ర విమర్శలు గుప్పించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన కొండా సురేఖ.. ఇప్పుడు అదే పార్టీ అధినేతపై ప్రశంసల వర్షం గుప్పించడం వెనుక ఆమె గులాబీ గూటికి చేరే వ్యూహం ఉందని పరిశీలకులు అంటున్నారు.   

[Strategy Behind Konda Surekha Praises KCR, Konda, Brs, Konda Murali, MLC, Telangana Politics, Telugu One]

By
en-us Political News

  
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
బీసీలపై కపట ప్రేమ ఎందుకు? కేసీఆర్‌ను నిలదీసిన పీసీసీ చీఫ్..!
మాజీ మంత్రి కొండా సురేఖకు మద్దతుగా అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వరంగల్‌కు తరలివచ్చారు.
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా సురేఖ ఉదంతంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఎర్రవల్లి ఘటన నుండి ఫ్లాష్ సర్వే వరకు..బయటపడ్డ అసలు నిజాలు..?
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద,  పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని  కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.