జూబ్లీ ఉప పోరుకు వ్యూహాలు రెడీ !

Publish Date:Jun 13, 2025

Advertisement

జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో తెలంగాణలో మరో ఉప ఎన్నిక అనివార్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది.గతంలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంలో..  దివంగత ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయాన్ని అన్ని పార్టీలు పాటించేవి. అయితే రాష్ట్ర విభజన తర్వాత, బీఆర్ఎస్ ఆ సంప్రదాయాన్ని పక్కన పెట్టింది. ఇటీవల కంటోన్మెంట్‌ సిట్టింగ్ ఎమ్మెల్యే లాస్య నందిత ఆకస్మిక మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ అన్ని ప్రధాన పార్టీలు పోటీ చేశాయి. 

సో.. సిట్టింగ్ ఎమ్మెల్యే గోపీనాథ్ అకాల మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్‌ నియోజక వర్గంలోనూ త్వరలోనే ఉప ఎన్నిక జరగడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి.. ఇప్పటికే మూడు ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్  సీటును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.   ముఖ్యంగా  కంటోన్మెంట్ లో బీఆర్ఎస్ సిట్టింగ్ సీటును గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ, జూబ్లీ హిల్స్  సీటును కైవసం చేసుకోవాలనే గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. మరో వంక బీఆర్ఎస్  సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉందని అంటున్నారు. ముఖ్యంగా.. వరసగా మూడుసార్లు అదే నియోజకవర్గం నుంచి గెలిచిన మాగంటితో పార్టీకి, పార్టీ కంటే మిన్నగా,పార్టీ అధినేత కేసీఆర్ కు ఉన్నఅనుబంధం దృష్ట్యా..  నియోజకవర్గంలో మాగంటి పేరు నిలిచేలా గెలిచి తీరాలని గులాబీ బాస్ వ్యూహ రచన చేస్తున్నట్లు చెపుతున్నారు. మాగంటి సతీమణి సునీతను బరిలో దించి గెలిపించుకోవాలని, ఇప్పటికే కేసీఆర్ ముఖ్య నాయకులను ఆదేశించినట్లు చెపుతున్నారు. అయితే..  ఆమె పోటీకి సుముఖంగా ఉన్నారా, లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదని పార్టీ వర్గాల సమాచారం.  ఒక వేళ ఆమె పోటీకి సుముఖంగా లేకుంటే..   కేసీఆర్ కుటుంబం నుంచే మరో మహిళను పోటికి దించే ఆలోచన ఉందంటున్నారు.  అయితే.. కేసీఆర్ అందుకు అంగీకరించక పోవచ్చని కూడా చెబుతున్నారు.  

మరోవంక.. కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కంటోన్మెంట్  స్ట్రాటజీ నే జూబ్లీ హిల్స్  లో రీప్లే  చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. నిజానికి  2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి హైదరాబాద్‌ జిల్లాలో ఒక్క సీటు కూడా దక్కలేదు.  ఖైరతాబాద్‌లో బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన దానం నాగేందర్‌.. ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ తరపున సికింద్రాబాద్‌ నుంచి పోటీ చేసి  ఓటమిపాలయ్యారు. అయితే..  నాగేందర్  ఎమ్మెల్యే పదవి ఉంటుందా, ఉడుతుందా అనేది తేలకుండా వుంది. అది వేరే సంగతి. 

కంటోన్మెంట్ కు అదనంగాజూబ్లీహిల్స్‌ సీటునూ గెలుచుకుని హైదరాబాద్‌లో పార్టీ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఈ నేపధ్యంలో, జూబ్లీ హిల్స్ నియోజక వర్గంలో గణనీయంగా ఉన్న ముస్లిం ఓటు బ్యాంకు అండతో గెలిచే వ్యూహానికి కాంగ్రెస్ పదును పెడుతునట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా గతంలో ఇక్కడి నుంచి  పోటీ  చేసి ఓడిపోయినా మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లేదా గతంలో ఎంఐఎం టికెట్ పై పోటీచేసిననవీన్ యాదవ్ కు టికెట్ ఇచ్చి, ఎంఐఎం మద్దతుతో ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ నాయకత్వం లెక్కలు వేస్తునట్లు చెపుతున్నారు. 

ఇక బీజేపీ విషయానికి వస్తే..  ఏపీలో విజయవంతమైన టీడీపీ, బీజేపీ, జనసేన    కూటమి ప్రయోగాన్ని  తెలంగాణాలో పరీక్షించుకునేందుకు ఇదొక అవకాశంగా  భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి..  మాగంటి గోపీనాథ్   టీడీపీ ప్రోడక్ట్. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన టీడీపీ టికెట్ పైనే గెలిచారు. ఆతర్వాత.. మారిన పరిస్థితుల కారణంగా  2016లో బీఆర్ఎస్ లో చేరి వరసగా 2018, 2023 ఎన్నికల్లో విజయ సాధించారు. అయినా..  తెలుగు దేశం పార్టీతో, ముఖ్యంగా చంద్రబాబు నాయు డుతో ఆయనకు చివరి వరకు మంచి సంబంధాలున్నాయి.

అందుకే..  మాగంటి చనిపోయినప్పుడు లోకేష్ దంపతులు మాగంటి భౌతికకాయానికి నివాళులు అర్పించారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో  తెలంగాణలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున అభ్యర్థిని నిలబెట్టాలన్న యోజనలో రాష్ట్ర బీజేపీ నాయకులు ఉన్నారని తెలుస్తోంది. అయితే   ఇంతవరకు ఈ విషయం పై పార్టీ కేంద్ర నాయకత్వంతో  చర్చించలేదని, ఏదైనా తెలంగాణలో కూటమి ఎంట్రీ గురించి, పై స్థాయిలో నిర్ణయం జరగ వలసి ఉంటుదని అంటున్నారు.  ఏది ఏమైనా బీజేపీ గట్టి అభ్యర్ధిని బరిలో దించి  గట్టి పోటీ ఇస్తుందని,ఆ పార్టీ నాయకులు విశ్వాసంతో ఉన్నారు. 

By
en-us Political News

  
పరకాల ప్రభాకర్ మద్దతు కేంద్రానికి ఎందుకు షాక్ గా మారిందంటే.. ఆయన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ భర్త కావడం వల్లనే. . ఈ ఉద్యమానికి ఒక అనూహ్య వ్యక్తి మద్దతు తెలపడంతో దీనికి మరింత బలం చేకూరింది.కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భర్త  పరకాల ప్రభాకర్, అక్టోబర్ 23న జరగనున్న ఈ నిరసనలో పాల్గొంటాననీ, బొద్దింకల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, సంఘీభావం తెలుపుతాననీ ప్రకటించారు.   
దేశవ్యాప్తంగా లేదా ప్రధాన నగరాల్లో తాము నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి  దీపావళి పండుగ తరువాత నుంచీ ఆందోళనలను పున: ప్రారంభించనున్నట్లు తెలిపారు.
2021లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జగన్ అధికారంలో ఉన్నారు. అప్పట్లో ప్రతిపక్ష అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నా వైసీపీయులు అడ్డుకున్నారు. ఆ విషయాన్ని విస్మరించి.. ఇప్పుడు జగన్ అధికార కూటమి తమను నామినేషన్లు వేయనీయకుండా అడ్డుకుంటోందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు
భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రస్తుతం అత్యంత కీలకమైన, ఆందోళనకరమైన మలుపు తిరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో సరికొత్త సమీకరణాలకు తెరలేచింది. రాజ్యసభ మాజీ సభ్యుడు, సీనియర్ రాజకీయ నాయకుడు విజయసాయిరెడ్డి త్వరలో సరికొత్త రాజకీయ పార్టీని స్థాపించేందుకు సర్వం సిద్ధం చేశారు
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ జోరుగా సాగుతున్న తరుణంలో అధికార తెలుగుదేశం పార్టీలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
 గత ఏప్రిల్ లో లోక్‌సభలో ఎదురైన సాంకేతిక రాజ్యాంగ సవరణ లోపాలను పూర్తిగా సరిదిద్ది, ఈసారి ఎటువంటి అవాంతరాలు లేకుండా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని కేంద్ర హోం, న్యాయ మంత్రిత్వ శాఖలు నిర్ణయిచాయి.
ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 తిరుపతి, ఏలూరు, శ్రీకాకుళం, సాలూరు,  పిఠాపురం ఇలా రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల సీట్ల సర్దుపాట్లు కూటమి శ్రేణుల మధ్య అగాధాన్ని పెంచుతూ ఐక్యతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత గడ్డ అయిన ఉమ్మడి కడప జిల్లాలో ఆ పార్టీకి తీవ్ర రాజకీయ ప్రతికూలత ఎదురౌతోందని చెప్పడానికి స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియే నిలువెత్తు నిదర్శనంగా చెబుతున్నారు.
కమ్మ నాయకుడు ఏబీవీకి స్వతంత్ర అభ్యర్థిగా మద్దతు ఇస్తూ, కాపు నాయకుడు  వంగవీటి రాధను జనసేనలోకి పంపారన్నది విజయసాయి రెడ్డి ఆరోపణ.  కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు ఏబీవీకి మద్దతు ఇవ్వడాన్ని కూడా ఆయన చంద్రబాబు వ్యూహంగానే అభివర్ణిస్తున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలకు  అవకాశం ఇవ్వకూడదని వైసీపీ అధినేత జగన్ పలు మార్లు విస్పష్టంగా చెప్పినా, ఆయనకు అత్యంత బలమైన పట్టు ఉన్న కడప జిల్లాలోనే కీలకమైన రెండు మునిసిపాలిటీలు ఏకగ్రీవం కావడం పార్టీపై జగన్ పట్టు సడలిందా అన్న అనుమానాలను తావిస్తోంది.
పుంగనూరుతో పాటు రాయచోటి, ధర్మవరం తదితర ప్రాంతాల్లో నామినేషన్ల దాఖలు సమయంలో ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ పరిణామాలను ప్రస్తావిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి సరిగా లేదన్న వాదనతో కేంద్ర బలగాలను రంగంలోకి దించాలని వైసీపీ   ప్రయత్నించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.