Publish Date:Jan 20, 2025
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలంటూ పార్టీ నేతలూ, కార్యకర్తల నుంచి డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రచారానికి తెలుగుదేశం అధిష్ఠానం చెక్ పెట్టింది. ఇకపై ఎవరూ నారా లోకేష్ కు డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ అంటూ వ్యాఖ్యలు, డిమాండ్లూ చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అనవసర అంశాలను మీడియా ముందు లేవనెత్తవద్దని పేర్కొంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం అన్న అంశంపై పార్టీ నాయకులు ఎవరూ బహిరంగంగా, లేదా మీడియా ముందు మాట్లాడవద్దని ఆదేశించింది. ఏ విషయమైనా కూటమి అధినేతలు చర్చించుకుని ఒక నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది.
ఇటీవల కొంత కాలంగా తెలుగుదేశం కీలక నేతలు బహిరంగంగానే లోకేశ్ ను డిప్యూటీ సీఎం చేయాలంటూ బహిరంగంగానే మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. తెలుగుదేశం అధికార ప్రతినిధి మహాసేన రాజేశ్, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డితోపాటు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న రఘురామ కృష్ణరాజు, ఫిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎన్ వర్మ, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇలా పలువురు నేతలు ఒక్కొక్కరుగా నారా లోకేశ్ ను డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని కోరుతున్నారు. ఇటీవల మైదుకూరు సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీనులైన సభావేదికపైనే శ్రీనివాస్ రెడ్డి లోకేశ్ ను డిప్యూటీ సీఎంను చేయాలంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. దీనిపైనే తెలుగుదేశం హైకమాండ్ సీరియస్ గా స్పందించింది. అనవసర విషయాలు మీడియా ముందు లేవనెత్తవద్దనీ, లోకేష్ డిప్యూటీ సీఎం అన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టాలనీ విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/stop-that-campaign-39-191583.html
పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రికార్డు మెజారిటీతో విజయం సాధించడం వెనుక ఆ నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ చార్జ్ ఎస్పీఎస్ఎన్ వర్మ త్యాగం, కృషి, పట్టుదల ఉన్నాయనడంలో ఇసుమంతైనా సందేహించాల్సిన అవసరం లేదు. పైగా పిఠాపురంలో తన విజయానికి సర్వశక్తులూ ఒడ్డి శ్రమించిన వర్మను విజయం తరువాత స్వయంగా పవన్ కల్యాణ్ ప్రశంసించారు.
సూర్యాపేట జిల్లా, హుజూర్‌నగర్ మండలం, మటంపల్లిలో ఇనుపయుగపు ఆనవాళ్లున్నాయని పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్, సీఈవో, డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి తెలిపారు.
సీతయ్య అనే సినిమాకు ఓ ట్యాగ్ లైన్ ఉంది. అదేమిటంటే ఎవరి మాటా వినడు అని. ఆ సినిమాకు ఆ ట్యాగ్ లైన్ ఎంత వరకూ యాప్ట్ అన్నది పక్కన పెడితే.. ఎవడి మాటా వినడు అన్న ట్యాగ్ లైన్ వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అతికి నట్లు సరిపోతుంది. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ లో అధికారం చెలాయించిన జగన్ తన అరాచక పాలన ద్వారా ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలిసి వచ్చేలా చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై సిట్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అధికారంలో కొనసాగిన ఐదేళ్లూ ప్రజలకు నరకం చూపించిన వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి గత ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా గట్టి షాకిచ్చారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ నివాసం వద్ద రోడ్డుకు ఆవలి పక్క స్వల్ప అగ్ని ప్రమాదం జరిగింది. అయితే దీనిని వైసీపీ గోరంతలు కొండంతలుగా చేసి తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీకి బుధవారం (ఫిబ్రవరి 5) ఎన్నికలు జరిగాయి. ఓటరు తన తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన వెంటనే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ లో మెజారిటీ పోల్స్ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి ఖాయమనే అంచనా వేశాయి.
తెలుగుదేశంలో వున్నప్పుడు చంద్రబాబు కీర్తన చేసిన సైబరాబాద్ మొక్క విడదల రజిని, ఆ తర్వాత వైసీపీలో చేరి జగన్ భజన చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. ఎగ్జిట్ పోల్ లో కొన్ని ఆప్ ముచ్చటగా మూడో సారి అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని అంచనా వేస్తే మరి కొన్ని ఢిల్లీపీఠంపై కమలనాథుల జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ క ల్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు.
జగన్ హయాంలో ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలింది. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో అవినీతికి, అక్రమాలకు, దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయింది.
ఈ మూడుమార్గాలు కాకుండా కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోవాలని ఒక ప్రజా ప్రతినిధి నిండు లోకసభలో కామెంట్ చేయడంతో ప్రజాస్వామ్యం పట్ల సదరు ఎంపీగారికి ఉన్న అవగాహన ఏంటో తెలియజేస్తుంది
జగన్ అరాచకపాలన నుంచి విముక్తి పొందిన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయానికి రాష్ట్రం అన్ని రంగాలలో అధమ స్థానంలో ఉంది. వ్యవస్థలు నిర్వీర్యమై ఉన్నాయి.