Publish Date:Apr 26, 2022
ఉక్కు సెగ వైసీపీని ఉక్కిరి బిక్కిరి చేయనుందా? ఉక్కు సంకల్పం విశాఖపట్నానికే పరిమితం కాకుండా రాష్ట్రం మొత్తం అదే సంకల్పం కనిపిస్తుందా? ఏది ఏమైనా ఉక్కు దెబ్బకు వైసీపీ గింగిరాలు తిరగక తప్పదన్న సంకేతం అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఆ ఎన్నికలలో వైసీపీకి చేదు అనుభవం ఎదురైంది. విపక్ష టీడీపీకి తీపి గెలుపు అందింది. నిజానికి ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ ఐఎన్టీయూసీకి మద్దతు ఇచ్చింది. కేవలం మద్దతే కాదు..ఈ ఎన్నికలలో ఐఎన్టీయూసీ తరఫున...వైసీపీ నేతే పోటీలో దిగి పరాజయం పాలయ్యారు.
అయితే ఈ ఎన్నికలలో వైసీపీ అనుబంధ కార్మిక సంస్థ పోటీ చేయకపోవడానికి కారణం కార్మికులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకతే కారణమి పరిశీలకులు అంటున్నారు. మొత్తం మీద వైజాగ్ ఉక్కు కర్మాగారం ఎన్నికల ఫలితం కేవలం ఉక్కు కర్మాగారానికే పరిమితం కాదనీ, అది విశాఖ నగరంలో అధికార పార్టీ వ్యతిరేకతకు అద్దం పడుతున్నదని పరిశీలకులు చెబుతున్నారు. అలాగే కేవలం విశాఖ నగరానికే కాక ఉక్కు జ్వాలలు రాష్ట్ర మంతటా వ్యాపించే అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అంటూ తెలుగువాడు నినదించి ఆందోళనలతో రగిలి వందల మంది ప్రాణత్యాగంతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటు పరం చేస్తున్నా ఆపడానికి ఇసుమంతైన ప్రయత్నించని వైసీపీ సర్కార్ పై ఉక్కు కార్మికుల్లోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. విశాఖ ఉక్కు కేవలం ఒక కర్మాగారం కాదు అది ఆంధ్రుల సెంటిమెంట్. ఆ సెంటిమెంట్ ను వైసీపా పట్టించుకోని ఫలితమే వైజాగ్ స్టీల్ ఎన్నికల్లో ఓటమి.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎన్నికలలో తెలుగుదేశం అనుబంధ యూనియన్ మద్దతు ఇచ్చిన ఐఎన్టీయూసీ దాదాపు 466 ఓట్ల ఆధిక్యంతో గెలిచింది.
ఈ మూడేళ్లలో వైసీపీకి ఏదైనా ఒక ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగలడం ఇదే ప్రథమం అని చెప్పవచ్చు. విశాఖ ఉక్కు సెగ వైసీపీని మరింత ఉక్కిరి బిక్కిరి చేయడం ఖాయమన్నది పరిశీలకుల అంచనా. ఈ అంచనాకూ కారణం లేకపోలేదు. ఒక కర్మాగారం కార్మిక సంఘం ఎన్నికలే అయినా...ఈ ఎన్నికల ప్రచారం మాత్రం ఒక అ సెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఎన్నిక స్థాయిలో జరిగింది. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలూ కూడా ప్రచారంలో పాల్గొన్నారు. చివరికి గేట్ మీటింగులకు కూడా హాజరై ప్రచారం నిర్వహించారు. అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేసినా వైసీపీ తాను మద్దతు పలికిన యూనియన్ ను గెలిపించుకోలేకపోయింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/steel-plant-privitisation-heat-defeats-ycp-39-134995.html
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.