సైనా, కాశ్యప్ వివాహబంధానికి ఎండ్ కార్ట్.. విడాకులు తీసుకోనున్న స్టార్ షట్లర్లు
Publish Date:Jul 13, 2025
Advertisement
బ్యాడ్మింట్ స్టార్ కపుల్ సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ తమ వివాహ బంధం నుంచి విడిపోవడానికి నిర్ణయించుకున్నారు. తాము విడాకులు తీసుకుంటున్న విషయాన్ని సైనా నెహ్వాల్ సామాజిక మాధ్యమ వేదికగా ప్రకటించారు. తాము విడిపోవాలన్న నిర్ణయం తీసుకున్నామనీ, అన్నీఆలోచాంచిన తరువాతే కాశ్యప్ తో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్లు సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. ఇద్దరం కలిసి అన్ని చర్చించుకుని ఈ నిర్ణయం తీసుకున్నామనీ, జీవితంలో వేరువేరుగా ముందుకు సాగాలని భావించామని తెలిపిన సైనా.. ఈ విషయంలో తమ ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతున్నామన్నారు. సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇరువురూ కూడా హైదరాబాద్ లోని గోపీచంద్ అకాడమీలో శిక్షణ పొందిన వారే. అక్కడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తమ ప్రేమ బంధాన్ని పెళ్లిబంధంగా మార్చుకున్నారు. 2018 డిసెంబర్ లో సైనా, కశ్యప్ ల వివాహం జరిగింది. ఇప్పుడు తాజాగా ఆదివారం (జులై 13) తమ ఏడేళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతున్నట్లుగా సైనా నెహ్వాల్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన క్రీడా వర్గాల్లో సంచలనం సృష్టించింది. సైనా నెహ్వాల్ 2008 లో బిడబ్ల్యుఎఫ్ ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ విజయంతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది. అదే ఏడాది ఆమె ఒలింపిక్స్ లో ఆడింది. తొలి ప్రయత్నంలోనే క్వార్టర్ ఫైనల్ వరకూ వెళ్లి ఆ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షట్లర్ గా నిలిచింది. ఆ తరువాత నాలుగేళ్లకు తొలి ఒలింపిక్ పతకం సాధించింది. 2012 ఒలింపిక్స్ లో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకుంది. సైనాకు 2009లో అర్జున, 2010లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న పురస్కారాలు దక్కాయి.
ఇక పారుపల్లి కశ్యప్ విషయానికి వస్తే 2014 కామన్వెల్త్ గేమ్స్ లో అతడు స్వర్ణపతకం సాధించాడు. 32 ఏళ్ల తరువాత కామన్వెల్త్ గేమ్స్ లో స్వర్ణం సాధించిన తొలి షట్లర్ గా రికార్డు సాధించాడు. అలాగే ఒలింపిక్స్ లో క్వార్టర్ పైనల్ కు చేరిన తొలి ఇండియన్ షట్లర్ గా నిలిచాడు. 2024లో షటిల్ బ్యాడ్మింటన్ నుంచి రిటైర్ అయిన కాశ్యమ్ ఇప్పుడు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.
http://www.teluguone.com/news/content/star-shutlers-saina-and-kasyap-divorce-25-201942.html





