సేఫ్ గా ఇండియా చేరిన పీవీ సింధు
Publish Date:Mar 3, 2026
Advertisement
భారత స్టార్ షట్లర్, తెలుగుతేజం, రెండు సార్లు ఒలింపిక్ విజేత పీవీ సింధు క్షేమంగా భారత్ చేరుకుంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్ పై దాడులకు తెగబడటంతో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగిన పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పీక్స్ చేరాయి. ఇరాన్ గల్ఫ్ దేశాలలోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో యూఏఈ గగనతలాన్నిమూసివేసిన సంగతి తెలిసిందే. కాగా ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు బ్రిటన్ వెళ్తున్న సింధు దుబాయ్‌లో విమాన సర్వీసులు నిలిచిపోవడంతో ఆమె తన సిబ్బంది అక్కడే చిక్కుకుపోయారు. దుబాయ్ విమానాశ్రయం సమీపంలోనే బాంబు పేలుళ్లు సంభవించాయి. ఆ సమయంలో సింధు దుబాయ్ ఎయిర్ పోర్టులోనే ఉంది. ఈ విషయాన్ని సామాజిక మాధ్యమం ద్వారా వెల్లడించిన సింధు.. పేలుళ్ల శబ్దినికి వెన్నులో వణుకు పడుతోందని పేర్కొన్నారు. కాగా సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోవడంపై స్పందించిన భారత రాయబార కార్యాలయం ఆమెను అక్కడ నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించింది. తాజాగా విమాన సర్వీసులు పునఃప్రారంభం కావడంతో సింధు స్వదేశానికి తిరిగి వచ్చింది. క్లిష్ట సమయంలో తనకు అండగా నిలి చిన భారత ప్రభుత్వం, ఎంబసీ అధికారులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసింది. అంతర్జాతీయ విమాన సర్వీసులు పూర్తిస్థాయిలో పునరుద్ధరించబడగానే గల్ఫ్ దేశాలలో చిక్కుకున్న వారిని స్వదేశానికి తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది.
http://www.teluguone.com/news/content/star-shutler-returned-india-safe-36-214919.html





