స్టార్ బ్యాట్స్ మ్యాన్ కి ఇంకా ఎన్నిబాల్స్ మిగిలాయో

Publish Date:Dec 6, 2013

Advertisement

 

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాష్ట్ర విభజనను వ్యతిరేఖిస్తూ ఎన్నివాదనలు వినిపిస్తున్నపటికీ, విభజన ప్రక్రియకు మాత్రం ఆయన ఎన్నడూ అవరోధం కలిగించలేదనేది తెలంగాణావాదులు కూడా అంగీకరిస్తారు. ఆయన తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు తప్ప, అధిష్టానాన్ని ధిక్కరించడం లేదని కొందరు కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తే, ఆయన పరోక్షంగా విభజనకు సహకరిస్తున్నట్లు అనుమానం కలుగుతుంది. నిన్నతెలంగాణా ఏర్పాటుకి కేంద్ర మంత్రి వర్గం ఆమోదం తెలపడంతో విభజన ప్రక్రియలో మరో అంకం ఎటువంటి అవాంతరాలు లేకుండా ముగిసింది. అయితే ముఖ్యమంత్రి నుండి దానిపై ఇంతవరకు స్పందించకపోవడం చాల విచిత్రం. ఏమయినప్పటికీ, ఆయన తదుపరి కార్యాచరణ ఏమిటనేది, రాష్ట్ర విభజన లాగే ఒక పెద్ద సస్పెన్స్ గా ఉంది.

 

ఒకవేళ ఆయన విభజన తరువాత కూడా పార్టీలోనే కొనసాగాలనుకొన్నా, ముఖ్యమంత్రి పదవి ఆశిస్తున్నవారు ఆయనని ఉండనీయకపోవచ్చును. ఒకవేళ బయటకు వెళ్లి కోట్లు ఖర్చు చేసి పార్టీ పెట్టుకొన్నా, ప్రజలు నమ్మి ఓటేస్తారనే నమ్మకం లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో పనిచేసిన కారణంగా అయన వేరే ఏ పార్టీలోను జేరి మరొకరి క్రింద పనిచేయడం కూడా చాలా కష్టమే. మరి ఇటువంటి పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి ఏమిచేస్తారనే ప్రశ్నకి ఎవరూ కూడా ఊహించని జవాబు వచ్చినా ఆశ్చర్యం లేదు.

 

బీజేపీ పాలిత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారేకర్ కొద్ది రోజుల క్రితం కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా కలవడం అనుమానాలకు తావిస్తోంది. నరేంద్ర మోడీ, రాజ్ నాథ్ సింగ్ లకు అత్యంత సన్నిహితుడయిన ఆయన  తమ ప్రత్యర్ధ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని రహస్యంగా ఎందుకు కలిసారో ఇంకా తేలవలసి ఉంది. కాంగ్రెస్ అధిష్టానంపై కోపంతో రగిలిపోతున్నకిరణ్ కుమార్ రెడ్డి పరిస్థితిని అర్ధం చేసుకొన్నబీజేపీ ఇదే అదునుగా భావించి ఆయనని తమ పార్టీలోకి ఆహ్వానించి సీమాంధ్ర పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే అటు ఆయన, ఇటు సీమాంధ్రలో సరయిన నాయకుడు లేక బలహీనంగా ఉన్నబీజేపీ ఇద్దరూ కూడా ప్రయోజనం పొందే అవకాశం ఉంది.

 

ఈ కాంగ్రెస్, బీజేపీ ముఖ్యమంత్రులిద్దరి రహస్య సమావేశం దేనికి దారి తీస్తుందో తెలుసుకోవాలంటే శాసనసభకు తెలంగాణా బిల్లు వచ్చే వరకు ఓపిక పట్టక తప్పదు.

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.