ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో తొక్కిసలాట ఇద్దరు విద్యార్థులు ఆస్పత్రి పాలు
Publish Date:Nov 2, 2022
Advertisement
ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ లో తొక్కిసలాట చోటు చేసుకుంది. కంభంలో బీఈడీ పరీక్షలు రాసేందుకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన బీఈడీ పరీక్ష రాసిన విద్యార్థులు తిరుగు ప్రయాణంలో ఈస్ట్ కోస్ట్ ప్రెస్ రైలు ఎక్కారు. దీంతో రైలులోని బోగీలన్నీ కిక్కిరిసి పోయాయి. ఈ సందర్భంగా రైల్లో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఇద్దరు విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిరువురినీ విజయనగరంలో దించేసి దగ్గరలోని ఆసుపత్రికితరలించారు. . వీరిరువురినీ దించేసి ఆసుపత్రికి తరలించిన తరువాత రైలు యథాప్రకారం బయలు దేరి వెళ్లింది. తీవ్ర అస్వస్థతకుగురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. ప్రకాశం జిల్లా కంభంలో జరిగిన బీఈడీ పరీక్ష రాసి తిరుగు ప్రయాణంలో తమ స్వస్థలం ఒడిశాకు వెళుతున్న సమయంలో ఈ సంఘటన జరిగిందని విద్యార్థులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉండటంతో రైల్వే అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. వారు పూర్తిగా కోలుకోగానే వారిని వారి స్వస్థలానికి పంపిస్తామని తెలిపారు.
http://www.teluguone.com/news/content/stampede-in-eastcost-express-two-hospitalised-25-146439.html





