Publish Date:Aug 16, 2025
సృష్టి కేసు ఇంకా దర్యాప్తులో ఉండగానే..మరో అక్రమ సృష్టి బయటపడింది. మహిళలను అంగట్లో సరుకుల మార్చి అమ్మత నాన్ని అమ్ముకుంటు న్నారు.అమాయకమైన మహిళలను టార్గెట్ చేసుకొని వారి దందా కొనసాగిస్తూ లాభాలు గడిస్తున్నారు.ఇప్పడు తాజాగా మేడ్చల్ కేంద్రంగా చేసుకొని అక్రమ సరోగసి దందా కొనసాగిస్తున్న కిలాడి ఎస్ఓటి బృందం చేతికి చిక్కిన విషయం తెలిసిందే... ఈ కేసులో సంచలన మైన విషయాలు బయటపడుతున్నాయి. నిన్న ఎస్ఓటి బృందం మేడ్చల్ జిల్లా పరిధిలో గుట్టు చప్పుడు కాకుండా సరోగసి దందా కొనసాగిస్తున్న నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్ రెడ్డి ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
అంతేకాకుండా పోలీసులు సరోగసి తల్లులకు నోటీ సులు కూడా పంపించారు. అయితే నింది తురాలు లక్ష్మి గతంలో పిల్లల విక్రయాలు సరోగసి కేసులో ముంబై పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే జైలు నుండి తిరిగి వచ్చిన తర్వాత లక్ష్మి తన కుమారుడు నరేందర్ రెడ్డి మరియు కూతురు తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు... నగరాన్నికి వచ్చిన నిందితురాలు లక్ష్మి మళ్ళీ అదే దందా కొనసాగించింది. లక్ష్మి పలు ప్రవేట్ హాస్పిటల్స్ మరియు ఐవీఎఫ్ సెంటర్లకు ఏజెంట్‌గా వ్యవహరిస్తుంది ఎవరైనా దంపతులు సరోగసి పద్ధతిలో పిల్లల కోసం హాస్పటల్స్ సెంటర్లను ఆశ్రయించగా వాళ్ల ఏజెంట్లు లక్ష్మికి సమాచారం ఇస్తారు.
ఆ విధంగా లక్ష్మి ఐవీఎఫ్ సెంటర్ కు వెళ్ల దంపతుల వివరాలు ఏజెంట్ల ద్వారా సేకరించేది. అనంతరం ఆర్థిక పరిస్థితి బాగోలేని మహిళలను టార్గెట్‌గా చేసుకొని వారికి డబ్బు ఆశ చూపించి బలవం తంగా సరోగసికి ఒప్పించేది. ఆ తర్వాత పిల్లల కోసం తాపత్రయం పడుతున్న దంప తులను టార్గెట్‌గా చేసుకొని... వారికి మాయమాటలు చెప్పి వారి వద్ద నుండి 20 నుండి 25 లక్షల వరకు డబ్బులు వసూలు చేసేది. కానీ సరోగసి తల్లులకు మాత్రం ఐదు నుండి నాలుగు లక్షలు మాత్రమే ఇచ్చేది. అంతేకాకుండా నిందితురాలు లక్ష్మి సరోగసి తల్లులకు డబ్బులు ఇచ్చేటప్పుడు ప్రామిసరీ బాండ్ రాయించు కునేది.
ఇలా ఇప్పటివరకు ఎనిమిది మంది సరోగసి తల్లుల చేత ప్రామిసరీ బాండ్ రాయించుకున్నది. ఇప్పుడు పోలీసులు వారందరికీ నోటీ సులు జారీ చేశారు. లక్ష్మి మరియు ఆమె కుమారుడ్ని పోలీసులు అరెస్టు చేసి... ఇంట్లోఉన్న ప్రామిసరీ నోట్లు, బాండ్ పేపర్లు గర్భాదారణ మందులు హార్మోన్ ఇంజక్షన్లు లతో పాటు హెగ్డే హాస్పిటల్ తో సహా అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవిఎఫ్ ,ఫర్టి కేర్ ,శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్ కు సంబంధించిన కొన్ని రిపోర్ట్ పేపర్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు పోలీసులు పలు ఐ వి ఎఫ్ హాస్పిటల్స్ తో లక్ష్మి కి ఉన్న సంబంధాల పై ఆరా తీస్తున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/srishti-fertility-case-39-204358.html
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు.
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది.
ధనుష్ తన కొత్త రాజకీయ పార్టీ కోసం తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.