పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం డ్యామ్
Publish Date:Jul 8, 2025
Advertisement
శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం (జులై 6) శ్రీశైలం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేయనున్నారు. ఇలా ఉండగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ వరద నీటితో పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున నీటి వరద కొనసాగుతోంది. సుంకేసుల, జారాల నుంచి లక్షా 72 వేల 705 క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తున్నది. కాగా శ్రీశైలం జలశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 881.60 అడుగులకు చేరింది. ఈ నేపథ్యంలో శ్రీశైలం పర్యటను రానున్న చంద్రబాబు ఈ మధ్యాహ్నం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేయనున్నారు. నీటి విడుదలకు ముందు చంద్రబాబు కృష్ణమ్మకు జలహారతి ఇస్తారు. అంతకు ముందంు ఆయన శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. ఇలా ఉండగా జులై నెలలోనే శ్రీశైలం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం పాతికేళ్లలో ఇదే తొలి5 సారి. ఇక పోతే చంద్రబాబు శ్రీశైలం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసిన అనంతరం నీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో భేటీ అవుతారు.
http://www.teluguone.com/news/content/srisailam-dam-nears-full-water-level-39-201466.html





