తెలుగుజాతి ప్రపంచంలోనే నంబర్‌ వన్‌ కావాలనేది నా లక్ష్యం : సీఎం చంద్రబాబు

Publish Date:Jul 8, 2025

Advertisement

 

ఏపీ సీఎం చంద్రబాబు శ్రీశైలం జలాశయం నుంచి గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు.. దాంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జునసాగర్ వైపుకు పరుగులు తీస్తున్నది.  ఆనకట్టపై రైతులు, మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి 4 గేట్లను ఎత్తి  కృష్ణమ్మ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కృష్ణమ్మకు పసుపు, కుంకుమ, చీరసారెలను సమర్పించారు. ఆ తర్వాత ఆనకట్టపై 6, 7, 8, 11 గేట్ల ద్వారా లాంచనప్రాయంగా నీటిని విడుదల చేశారు. అనంతరం ముఖ్యమంత్రి శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను దర్శించుకున్నారు.  దీంతో జలాశయానికి వరద పోటెత్తుతున్నది. సుంకేశుల, జురాల నుంచి 1.70లక్షల క్యూసెక్కులకరుపైగా వరద నీరు వచ్చి చేరుతున్నది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882 అడుగుల మేర నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. 

ప్రస్తుతం కుడి, ఎడమ జల విద్యుదుత్పత్తి కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తి అవుతున్నది.అనంతరం మల్లికార్జున స్వామిని, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత అర్చన, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాల్లోనూ ఆయన పాల్గొన్నారు. పూజల అనంతరం స్వామివారి మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతు తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్ వన్ కావడం తన లక్ష్యమని తెలిపారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. ఆ తప్పులు సరిచేసేందుకు రాత్రింబవళ్లు పనిచేస్తున్నానని తెలిపారు. ఇవాళ తన జీవితంలో సంతోషకరమైన రోజుని సీఎం అన్నారు. జులై తొలి వారంలోనే శ్రీశైలం ప్రాజెక్ట్ నిండటం శుభపరిమాణం అని తెలిపారు. నీటి కరువు ఉన్న రాయలసీమను ఎవరూ కాపాడలేరని చాలా మంది  అన్నారు. 

కానీ ఆ ప్రాంతం స్థితిగతులు మార్చందుకు ఎన్టీఆర్ నడుం బిగించారు. ఇప్పుడు రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నానని వెల్లడించారు. రాయలసీమ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తున్నా. సాగునీటి ప్రాజెక్టులకు రూ.68వేల కోట్లు ఖర్చు చేశాం. వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉండగా రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోలేదు. జీడిపల్లికి నీరు తీసుకెళ్లే బాధ్యత మా ప్రభుత్వానిదే. ఈనెల 15 నాటికి ఆ ప్రాంతానికి నీరు రావాలని అధికారులకు టార్గెట్‌ విధించా. ఈనెల 30 కల్లా కుప్పం, మదనపల్లెకు నీళ్లు తీసుకెళ్తాం. పోతిరెడ్డిపాడు, గాలేరు-నగరి, గండికోట.. అన్నీ మేమే తెచ్చామన్నారు. సీఎం వెంట మంత్రులు నిమ్మల రామానాయుడు, జనార్దన్ రెడ్డి, ఎన్‌ఎండీ ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా, దేవదాయ శాఖ సెక్రటరీ వినయ్ చంద్, కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్, ఆలయ ఈవో శ్రీనివాసరావు, జేఈవోలు పాల్గొన్నారు.

By
en-us Political News

  
సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు.
వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని క్లారిటీ ఇచ్చారు.
తాజాగా ఉత్తరాంధ్ర జిల్లాలలో పర్యటిస్తున్న నాగబాబు ఆదివారం శ్రీకాకుళంలో జనసేన నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఎన్నికలలో తన పోటీ గురించి వచ్చిన ప్రస్తావనపై స్పందించిన ఆయన తాను మాత్రం ఎన్నికలలో పోటీ చేసే ప్రశక్తే లేదని కుండబద్దలు కొట్టేశారు.
తెలుగుదేశం సీనియర్లు, అందులోనూ కమ్మసామాజికవర్గానికి చెందిన దిగ్గజాలను అంబటి పరామర్శించడం వెనుక లెక్కలేంటి? ఊరకరారు మహానుభావులు అన్నట్లు అంబటి రాక వెనుక పొలిటికల్ ఈక్వేషన్లు ఏంటన్నది ఇప్పడు హాట్ టాపిక్‌గా మారింది.
తమిళనాడులో బీజేపీ ఎన్ని జన్మలు ఎత్తినా అధికారంలోకి రాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్ మాజీ నేత, తెలంగాణ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధినేత్రి కల్వకుంట్ల కవిత ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై ప్రతికూలతకు కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరీ ముఖ్యంగా సరిగ్గా పంచాయతీ ఎన్నికల వేళ కవిత చేపట్టిన జనజాగృతి యాత్ర ప్రభావం బీఆర్ఎస్ ఓటింగ్ పై తీవ్ర ప్రభావం చూపిందంటున్నారు.
ఈ సూసైడ్ విన్న‌ర్స్ అంటే ఏంటి? ఈ పంచాయితీ ఎన్నిక‌ల్లో వెలుగులోకొచ్చిన కొత్త ప‌దం ఇది. సంగారెడ్డి, రాయికోడ్ మండ‌లం, పిప‌డ్ ప‌ల్లిలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజు ఉదంతంతో ఈ పదం పుట్టుకొచ్చిందని చెప్పొచ్చు.
కీలక సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాకపోవడంపై ఎందుకు రాలేదు అని చర్చ రాజకీయంగా జరుగుతోంది. సాధారణంగా ముఖ్యమంత్రి జరిపే ఇలాంటి సమావేశాల్లో మంత్రిగా ఉన్న వ్యక్తి కచ్చితంగా హాజరవ్వాలి. కానీ పవన్ కళ్యాణ్ మాటా- మంతి పేరుతో తన శాఖకు సంబంధించి సమావేశం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది.
3,911 గ్రామాల్లో పోలింగ్‌ జరుగుతోంది. మొత్తం 12,782 మంది సర్పంచ్‌ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. అలాగే.. 38,350 వార్డులకు గాను 108 వార్డులకు నామినేషన్లు రాలేదు. మరో 8,307 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మరో 18 వార్డుల్లో ఎన్నికల నిర్వహణపై స్టే ఉన్నది. దీంతో మిగిలిన 29,917 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
తొలి నుంచీ కూడా ఈటల బీజేపీలో ఇమడడానికి ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఆయన పార్టీలో ఉక్కపోతను భరిస్తూనే కొనసాగుతున్నారని ఆయన సన్నిహితులు చెబుతూ ఉంటారు. ఇప్పుడు తాజాగా మరో సారి ఆయన హర్టయ్యారు.
ఈ పోలింగ్ కోసం కోసం అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం అధికారులు ఇప్పటికే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల నుంచి ఎన్నికల సామగ్రిని పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఇకపోతే.. రెండో దశలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి పట్టణాలలో నివసిస్తున్న ప్రజలు తమ స్వగ్రామాలకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
వైసీపీ కార్పొరేటర్ కరీముల్లా టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయ‌ర్‌ ఎన్నికల్లో నెంబ‌ర్ గేమ్ మొద‌లైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.