చేసిన తప్పులు దండంతో సరి అంటే ఎలా శ్రీరెడ్డీ!

Publish Date:Nov 14, 2024

Advertisement

గత కొన్నేళ్ళుగా నోటికొచ్చిన చెత్తవాగుడు వాగుతూ అసహ్యానికి, అసభ్యతకి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వైసీపీ నాయకురాలు శ్రీరెడ్డికి ఇప్పుడు జ్ణానోదయం అయ్యింది. వైసీపీకి గుడ్ బై చెప్పేశారు. అయితే ఆమె వైసీపీకి గుడ్ బై చెబుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణికి ఓ లేఖ రాశారు.  ఆ లేఖలో అందరికీ క్షమాపణలు చెప్పేశారు. జగన్ తో మొదలు పెట్టి ఆయన సతీమణి భారతి నుంచి  మంత్రులు లోకేష్, అనితలకు కూడా క్షమాపణలు చెప్పారు. షర్మిలనూ, వైఎస్ సునీతనూ కూడా క్షమించమని వేడుకున్నారు.

ఇకపై ఎలాంటి అసభ్య పోస్టులూ పెట్టనని దేవుడి మీద ప్రమాణం చేసి మరీ చెప్పారు. అయితే  అసభ్యం, అశ్లీలం, అసహ్యం ఈ మూడు అంశాల మేలు కలయిక  అన్నట్లుగా గత కొన్నేళ్లుగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తగా ఆమె చేసిన దూషణలు కేవలం క్షమాపణ సరిపెట్టేయడం అసాధ్యం. కేవలంమహిళ అన్న కారణంగా   ఎవర్నయినా ఎంత మాటయినా అనేయచ్చు అన్నట్లుగా వ్యవహరిం చిన శ్రీరెడ్డి  గత కొన్నేళ్లుగా చేసింది తన బూతు పురాణంతో జగన్ వ్యతిరేకులను దూషించడమే. శ్రీరెడ్డి సామాజిక మాధ్యమం వేదికగా ఎంత వల్గర్ గా మాట్లాడారో తెలియంది కాదు.  గత ఐదేళ్ళుగా శ్రీరెడ్డి సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ నాయకులను చెప్పడానికి కూడా వీల్లేని భాషలో తిట్టారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా  ముఖ్యమంత్రి , ఉప ముఖ్యమంత్రి , హోంమంత్రిపై దూషణల పర్వం కొనసాగించారు.  ఇన్నాళ్ళకు పాపం పండింది.  అరెస్టు తప్పదని అర్థం కావడంతో శ్రీరెడ్డి ఆడపిల్లని కనికరించండంటూ క్షమాపణలు చెబుతున్నారు.  

అయితే తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం ఆ క్షమాపణలను అంగీకరించేందుకు సిద్ధంగా లేరు.  ఆ లేఖ ఆధారంగా తెలుగుదేశం మహిళా కార్యకర్తలు ఆమెపై మరో ఫిర్యాదు చేశారు.  శ్రీరెడ్డి ఎవరెవరికి వ్యక్తిగతంగా టార్గెట్ చేసి బూతులు తిట్టారో ఆ పేర్లన్నీ ఆమె రాసిన లేఖలోనే ఉన్నాయి. దానినే పేర్కొంటూ తాజాగా మరో ఫిర్యాదు దాఖలైంది. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ (తారక్) రాజకీయ అరంగేట్రం గురించిన చర్చ
అమర్ రాజాకు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల పేరుతో నోటీసులు ఇవ్వడం, విద్యుత్ కనెక్షన్లు కట్ చేయడం వంటి చర్యలతో నాటి ప్రభుత్వం ఎలా ఇబ్బందులకు గురి చేసిందో.. పారిశ్రామిక వర్గాలు గుర్తుచేసుకుంటున్నాయి. ఏపీలో పుట్టి పెరిగిన ఒక ప్రతిష్టాత్మక సంస్థ, తన భవిష్యత్తు విస్తరణ, వృద్ధి ప్రస్థానం కోసం రాష్ట్రం దాటి వెళ్లాల్సిరావడంపై సర్వత్రా ఇప్పుడు మరోసారి చర్చ మొదలైంది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారిక డిజిటల్ వేదికగా రూపొందించిన జగన్ 2.0 సూపర్‌యాప్‌ను వైసీపీ అధినేత జగన్‌ గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిష్కరించారు.
భీమవరం, కిర్లంపూడి లలో పర్యటించారు. రెండు చోట్లా కూడా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలలో పట్టు నిరూపించుకోవడానికి ఆయన చేపట్టిన ఏ పర్యటన అయినా సరే.. ఉద్రిక్తతలు, గందరగోళం మధ్యే సాగుతున్నాయి.
కిర్లంపూడి పోలీస్ స్టేషన్‌లో ఆయనతో పాటు మరికొందరు  వైసీపీ నేతలపై  పోలీసులు  ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందిని అడ్డుకుని, వారిపై భౌతిక దాడికి దిగారనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు. 
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కౌశిక్ రెడ్డి ఒక ఛాలెంజ్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ ద్వారా నీటిని వెంటనే ఎత్తిపోయాలని, ఆ నీటిని అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మీదుగా ఎల్లంపల్లికి తరలించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆ విధంగా నీటిని ఎత్తిపోసే ప్రక్రియలో అన్నారం లేదా సుందిళ్ల బ్యారేజీలకు ఏవైనా నష్టాలు లేదా ప్రమాదాలు జరిగితే, దానికి పూర్తి బాధ్యత తమదేనన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్.. ముద్రగడ సమాజానికి చేసిన సేవలను గుర్తించి ఈ గౌరవాన్ని కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని, అన్ని రకాల ప్రభుత్వ మర్యాదలు లోటు లేకుండా చూడాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
ల్పపీడన ప్రభావంతో జులై మూడో వారంలో దేశవ్యాప్తంగా వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మధ్య భారతదేశం, తూర్పు రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది.
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా సాగుతున్న ఈ వినూత్న నిరసన ప్రదర్శనలకు మెల్లిమెల్లిగా జనం ముఖం చాటేస్తున్నారు. పరీక్షల అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా డిమాండ్‌తో ప్రారంభమైన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం.. ఆరంభంలో లక్షలాది మంది యువతను ఆకర్షించింది. అయితే క్రమక్రమంగా జనాదరణ కోల్పోయి ఇప్పుడు జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఆ పార్టీ నిరసనలు తూతూ మంత్రంగా మారాయి.
ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలల్లో స్థానిక ఎన్నికల జరిగే అవకాశం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ ఇప్పటికే తమ పార్టీ శ్రేణులకు సమాచారం అందించారు. ఈ క్రమంలోనే ఎన్నికల వ్యూహాలను పక్కాగా అమలు చేయడానికి కూటమి పార్టీల ముఖ్య నేతల కీలక సమావేశం బుధవారం జరగనుంది.
హరీష్ రావు ఇప్పుడు తన కుటుంబ వ్యాపారమైన మిల్చీ మిల్క్  విషయంలో తలెత్తుతున్న ప్రశ్నలకు, వెల్లువెత్తుతున్న విమర్శలకూ సమాధానం చెప్పుకోలేక సతమతమౌతున్నారు.
విజయ్ ప్రస్తుతం చెన్నై ఈస్ట్ కోస్ట్ రోడ్డు (ఈసీఆర్) లోని నీలాంకరి నివాసంలో ఉంటున్నారు. అక్కడి నుంచి ఆయన సచివాలయం ఉన్న రాజాజీ రోడ్డుకు రోజువారీ ప్రయాణం చేస్తున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.