Publish Date:May 14, 2025
కల్నల్ సోఫియా ఖురేషి పై బీజేపీ మంత్రి ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెను ఉగ్రవాదుల సోదరిగా పేర్కొంటూ మధ్యప్రదేశ్ మంత్రి విజయ్ షా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను మీడియాకు వివరించిన కల్నల్ సోఫియా ఖురేషీ 1999లో ఇండియన్ ఆర్మీ కార్ప్స్ ఆఫ్ సిగ్నల్‌లో చేరారు. 2016లో మల్టీనేషనల్ మిలటరీ విన్యాసాలకు సారథ్యం వహించిన తొలి మహిళా అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
Publish Date:May 14, 2025
పాకిస్థాన్ ప్రభుత్వానికి, ఉగ్రవాదానికి ఉన్న నెక్సస్ ప్రతి సందర్బంలోనూ బయటపడుతూనే ఉందిద. భారత్ లో జరిగిన ప్రతి ఉగ్రదాడిలోనూ ఆ దేశ ప్రేరేపిత ఉగ్ర సంస్థల ప్రమేయం, వాటికి పాకిస్థాన్ ప్రభుత్వ, సైన్యం సహాయ సహకారాలు మద్దతు ఉన్నట్లు పదేపదే రుజువైంది.
Publish Date:May 14, 2025
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఎట్టకేలకు దాదాపు 3 నెలల తరువాత బెయిలు మంజూరైంది. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారు సత్యవర్థన్ ను కిడ్నాప్ చేసి, బెదరించి ఆ కేసు ఉపసంహరించుకునేలా చేసిన కేసులో వల్లభనేని వంశీని ఈ ఏడాది ఫిబ్రవరి 13న పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
Publish Date:May 14, 2025
అమెరికా, చైనా ఫైటర్ జెట్లను చూసుకుని తమ వాయుసేన బలంపై పాకిస్థాన్ మిడిసిపడింది. అయితే తాజాగా ఆపరేషన్ సిందూర్‌లో ఆ దళాన్ని కొన్ని గంటల వ్యవధిలోనే భారత్ చావు దెబ్బ తీసింది. అత్యంత కచ్చితత్వంతో దాదాపు డజను సైనిక స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది.
Publish Date:May 14, 2025
వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు ఆర్థిక మంత్రిగా చక్రం తిప్పి, ఐదేళ్లూ వరుసగా బడ్జెట్ ప్రవేశ పెట్టిన బుగ్గన ఆ ఓటమితో డోన్ లో అడ్రస్ లేకుండా పోయారు.
Publish Date:May 14, 2025
వైసీపీలో కీలక నేతగా వెలుగొందిన చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి అధికారంలో ఉన్నంత కాలం తెగ దూకుడు ప్రదర్శించారు. అలాంటి ఫైర్‌బ్రాండ్ కనీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. తన స్వగ్రామం తుమ్మలగుంట అత్మీయసభలో మీకు అన్ని చేశాను, కాని మీరు నా కొడుకును ఓడించారంటూ తన మనోవేదన వెళ్లగక్కిన సందర్భంలో ఆయన కళ్లు చెమర్చాయి.
Publish Date:May 14, 2025
ఎట్టకేలకు బలూచిస్థాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది.ప్రభుత్వ ఏర్పాట్లకు సన్నాహాలు చేసుకుంటోంది. క్వెట్టాలో కొత్త పార్లమెంటు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది.
Publish Date:May 14, 2025
సరిహద్దుల్లో ఉద్రిక్తతలు, డ్రోన్ దాడులు, వార్ మాక్ డ్రిల్స్ నడుస్తున్న సమయంలో.. మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ ఇండియాలో ఆందోళనకరమైన పరిస్థితులు లేవని స్పష్టం చేస్తోంది. ఉద్రక్తతల తీవ్రత అంతగా లేని దేశంగా భారత్ ఫోకస్ అవుతోంది. సరిహద్దులకు హైదరాబాద్ దూరంగా ఉండటం, ప్రశాంతంగా ఈవెంట్ కొనసాగుతుండటంతో.. దేశంలో భద్రతపై అందరికీ స్పష్టత వచ్చింది.
Publish Date:May 14, 2025
భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ చీలిక ముంగిట నిలిచిందా? ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. తన వారసుడి ప్రకటనకు ముహూర్తం పెట్టేసి రాజకీయ విరమణ లేదా రాజకీయ సన్యాసానికి రంగం సిద్ధం చేసేసుకున్నారా? అంటే బీఆర్ఎస్ లో గత కొన్ని రోజులుగా వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే ఔనన్న సమాధానమే వస్తున్నది.
Publish Date:May 14, 2025
భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మోడీ సర్కార్ అంగీకరించడంపై దేశం రగిలిపోతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడికి ప్రధాని మోడీ తలొగ్గారన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది. దీంతో 1971 యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెగువ.. సాహసం గుర్తు చేసుకుంటూ.. మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
Publish Date:May 14, 2025
తిరుపతి గంగమ్మ జాతర వేడుకగా ముగిసాయి. బుధవారం ( మే 14) ఉదయం అమ్మవారి విశ్వరూపానికి చెంప తొలగింపు కార్యక్రమంతో ఎనిమిది రోజుల పాటు వైభవంగా సాగిన జాతర పరిసమాప్తం అయ్యింది.
Publish Date:May 13, 2025
నిజమే. కాల్పుల విరమణ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని, కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాదు, ఇతర ప్రతిపక్ష పార్టీలు, చివరకు బీజేపీ అభిమానులు, సామాన్యులు కూడా తప్పు పట్టారు. ఒక విధంగా చూస్తే.. అంతవరకు సానుకూలంగా ఉన్న ‘మూడ్ ఆఫ్ ది నేషన్’, ప్రతికూలంగా మారిపోయింది.
Publish Date:May 13, 2025
తిరుమలలో భక్తుల రద్దీ ఒకింత తక్కువగా ఉంది. బుధవారం (మే 14) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో తొమ్మిది కంపార్ట్ మెంట్లు నిండి ఉన్నాయి.