ఫార్వర్డ్ పోస్ట్ ప్రాణం తీసింది..
Publish Date:May 15, 2021
Advertisement
సోషల్ మీడియా పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది. ఎంబిబిఎస్ చదవనోడు డాక్టర్ అవుతున్నాడు. శాస్త్రం తెలియని సన్నాసి కూడా వేదాంతాలు చెపుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే కొంత మంది అనవసమైన విషయాలను క్రియేట్ చేసి మరి ప్రచారం చేస్తుంటారు. దానివల్ల వాళ్లకు ఎలాంటి లాభం ఉంటాడో తెలీదు గానీ పొద్దున్న లేస్తే ఇది షేర్ చేయండి మీకు మంచి జరుగుతుంది. ఇది షేర్ చేయండి మీకు ఇది జరుగుతుంది. అని ప్రచారం చేస్తారు. ఇంకొంత మంది అయితే లేనిపోని అభూత కల్పితాలు క్రియేట్ చేసి వాట్స్ ఆప్ గ్రూప్స్ లో పోస్ట్ చేసి ప్రజలను కూడా భయబ్రాంతులకు గురిచేస్తారు. తాజాగా ఒక వ్యక్తి తనకు వచ్చిన ఒక అభూతకల్పిత మెస్సేజ్ ను ఫార్వర్డ్ చేశాడు. ఇంకేముంది ఒక సారిగా పోలీసులు అతని ఇంటి ముందు వాలిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని నారాయణపేట. అతని పేరు గుత్తుల శ్రీనివాస్. అతనికి పెళ్లి కూడా అయింది. అతని భార్య పేరు వెంకటపద్మ. శ్రీనివాస్ ఆక్వా కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని సెల్‌ఫోన్‌కు ‘కోళ్లకు కూడా సోకిన కరోనా మహమ్మారి’ అనే వాట్సప్ సందేశం వచ్చింది. దానిని ఆయన ఇతర గ్రూప్‌లకు పంపాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం శ్రీనివాస్‌కు ఫోన్ చేసి విచారించారు. తనకేమీ తెలియదని ఆయన ఎంత చెప్పినా వారు వినలేదు. దాంతో శ్రీనివాస్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. శరీరంపై చెమటలు పట్టి కూలిపోయాడు. చికిత్స నిమిత్తం మూడు ఆసుపత్రులకు తీసుకెళ్లినా చేర్చుకోలేదు. చివరకు అమలాపురం కిమ్స్‌లో చేర్పించాం. ఆ తర్వాత గంట వ్యవధిలోనే ఆయన చనిపోయాడు’ అని పేర్కొన్నారు. ఇది చాలా పెద్ద కేసు అవుతుందని బెదిరిస్తూ శ్రీనివాస్ ఫోన్‌ను తీసుకెళ్లిన స్థానిక పోలీసులు. ఆయన చనిపోయిన కొద్ది సేపటికి దానిని వెనక్కి తెచ్చి ఇచ్చేశారన్నారు. హైదరాబాద్‌లోని సైబర్‌క్రైమ్ సీఐ రాజేష్, ఎస్సై రంజిత్‌కుమార్ తన భర్తను మానసికంగా హింసించారని ఆమె ఆరోపించారు. శ్రీనివాస్‌కు భార్య, తొమ్మిదేళ్ల కుమారుడు, ఏడేళ్ల కుమార్తె ఉన్నారు. దీనిపై అమలాపురం పట్టణ ఇన్‌ఛార్జి ఎస్సై సత్యప్రసాద్‌ను వివరణ కోరగా ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.
http://www.teluguone.com/news/content/srinivas-forward-the-whatsapp-message-corona-pandemic-that-also-infects-chickens-39-115477.html





