ప్రపంచ టీటీకి శ్రీజ
Publish Date:Aug 31, 2022
Advertisement
ఇటీవల కామన్వెల్త్ క్రీడల టేబుల్ టెన్నిస్‌లో మిక్స్‌డ్ డబుల్స్ స్వర్ణంతో అదరగొట్టిన తెలుగమ్మాయి ఆకుల శ్రీజ ప్రపంచ చాంపి యన్‌షిప్ జట్టులో చోటు దక్కించుకుంది. టీటీ ప్రపంచ చాంపియన్‌షిప్ వచ్చేనెల 30 నుంచి అక్టోబరు 9 వరకు చైనాలో జరగ నుంది. శ్రీజ, రీత్ రిష్యా, దియా, స్వస్తికా ఘోష్‌లతో కూడిన మహిళల బృందానికి మనికా బత్రా.. సానిల్, హర్మీత్, మానుష్ షా, మానవ్‌తో కూడిన పురుషుల జట్టుకు సాతియాన్ సారథ్యం వహిస్తారు. కాగా, వెటరన్ స్టార్ ఆచంట శరత్ కమల్ వ్యక్తిగత కారణాల రీత్యా టోర్నీలో ఆడడం లేదు. ఇటీవలి కామన్వెల్త్ క్రీడల్లో శరత్ కమల్ మూడు స్వర్ణాలు సాధించిన సంగతి తెలిసిందే. మహిళల జట్టులో హైదరాబాదీ స్టార్ ఆకుల శ్రీజ చోటు దక్కించుకుంది. కామన్వెల్త్ క్రీడల్లో శరత్‌తో కలిసి మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం సాధించిన శ్రీజ.. అదే జోరు ఇక్కడ కూడా కొనసాగించాలనుకుంటున్నట్లు పేర్కొంది.
http://www.teluguone.com/news/content/srija-to-play-in-world-tt-championship-25-142986.html





