లంకలో రాజకీయ సంక్షోభం ముదిరి పాకాన పడింది. ప్రజలలో అసహనం రావణకాష్టంలా రగులుతోంది.శ్రీలంకను అర్ధికంగా దివాళా స్థితికి తీసుకువచ్చిన అధ్యక్షుడు రాజపక్సే గట్టబాయ రాజీనామా చేయాలంటూ గత కొంత కాలంగా దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు శనివారం పరాకాష్టకు చేరుకున్నాయి.శనివారం కర్ఫ్యూ ఎత్తివేయడంతో లక్షలాది మంది ఆందోళనకారులు దేశం నలుమూలల నుంచీ కొలంబో చేరుకుని అధ్యక్షుడి నివాసాన్నిముట్టడించారు. జనసందోహాన్ని అదుపు చేయడంలో భద్రతా దళాలు ఏం చేయలేక చేతులెత్తేశాయి. ఎలాంటి విధ్వంసం, రక్తపాతం లేదు. అధ్యక్ష నివాసం జనం అధీనంలోకి వెళ్లిపోయింది. అయితే జనం అధ్యక్ష నివాసాన్ని ముట్టడించడానికి ముందే రాజపక్సె గొట్టబాయ పలాయనం చిత్తగించారు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నారన్న సమాచారం లేదు. దేశం విడిచి వెళ్లిపోయారని అంటున్నారు.
ఏది ఏమైనా దేశాధ్యక్షుడు ప్రజాగ్రహాన్ని తట్టుకోలేక అజ్ణాతంలోకి వెళ్లిపోయారన్నది మాత్రం వాస్తవం.ఆందోళనకారులు శ్రీలంక ప్రధాని నివాసాన్ని దగ్ధం చేశారు. ప్రజాగ్రహానికి శ్రీలంక రాజకీయం వణికిపోయింది. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా సమావేశమయ్యారు. ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారు. అఖిలపక్ష ప్రభుత్వం ఏర్పాటుకు ముందుకు వస్తే తాను తక్షణమే రాజీనామా చేస్తానని ఆయన ఆ సమావేశంలో ప్రకటించారు. వారం రోజుల్లో తాత్కాలిక అధ్యక్షుడి ఎన్నిక కోసం పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
అంతకు ముందు జన సముద్రం శ్రీలంక రోడ్లపై కవాతు చేస్తున్నదా అన్నట్లు కొలంబో రోడ్లన్నీ ఇసుక వేస్తే రాలదన్నంతగా ఆందోళన కారులతో నిండిపోయాయి. దేశంలో అన్ని దార్లూ కొలంబోకేనా అన్నట్లు రహదారుల జన ప్రవాహం కొలంబో చేరుకుని అధ్యక్షుడు రాజపక్సె గొట్టబాయ నివాసానికి దారితీసింది. బారికేడ్లను ఛేదించుకొని మరీ గొటబాయ నివాసం వైపు జన ప్రవాహం కదిలింది. ఆస్తులకు ఎలాంటి నష్టం చేయకుండానే అధ్యక్షుడి నివాసం జనం స్వాధీనమైంది.
ఆందోళనకారులు గొటబాయ నివాసంలోని స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టారు. అందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి. అధ్యక్ష భవనంలోని గదులు, కారిడార్లు జనంతో కిక్కిరిసి పోయాయి. ఇంకా వందలాది మంది ఆందోళనకారులు భవనం వెలుపల ఉన్నారు. రాజపక్సె గొటబాయ రాజీనామా చేసేదాకా తమ ఆందోళనలను ఆపే ప్రసక్తే లేదని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/sri-lanka-presidenr-official-residence-occupied-by-people-25-139413.html
Publish Date:Sep 10, 2026
G.D. Naidu జీవితంలో నుంచి Millennials, Gen Z, Gen Alpha నేటి తరాలు ఏం నేర్చుకోవాలి? ఆయన Curiosity, Self-Learning, Innovation, Technology, Learning by Doing, Experimentation మరియు India కోసం కొత్తగా ఆలోచించే విధానం గురించి తెలుసుకోవడానికి ఈ కథనం చదవండి.
Publish Date:Sep 10, 2026
చంద్రబాబు అక్రమ అరెస్ట్ మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పార్టీ కార్యాలయాల్లో యాభై మూడు దీపాలను వెలిగించాలని కోరారు.
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత, అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో అరెస్టయిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు నాంపల్లి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది
టీడీపీ కేంద్ర కార్యాలయంలో రెండో రోజు నిర్వహిస్తున్న లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో పొలిటికల్ కమ్యూనికేషన్ అండ్ పబ్లిక్ ఓరియంటేషన్ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ మాట్లాడారు.
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్ తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు. పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.