కమలానికి విజయం ఎంతో దూరం!

Publish Date:Apr 28, 2023

Advertisement

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. నిజానికి, మే 10న జరిగేది అసెంబ్లీ ఎన్నికలే అయినా, ఈసంవత్సరం చివరి వరకు  మరో ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు  టర్నింగ్ పాయింట్ కావడంతో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను  అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు అందిపు చ్చుకు నేందుకు కాంగ్రెస్, అధికారం కోసం హంగ్ కలలు కంటున్న జేడీఎస్ మాత్రమే కాకుండా కర్నాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు.

ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలలో విజయం ఎవరిదన్న దానిపై ఇప్పటి వరకూ వచ్చిన పలు ప్రీ పోల్ సర్వేలు రాష్ట్రంలో హంగ్ అనివార్యం అని పేర్కొన్నాయి. అయితే తాజాగా కర్నాటక ఎన్నికలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే మాత్రం ఆ రాష్ట్రంలో బీజేపీకి విజయం చాలా దూరం అని పేర్కొంది.  కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అవసరమైన స్థానాలను సాధిస్తుందనీ, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయిన 113 స్థానాల కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పేర్కొంది.  

శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ 115 నుంచి 127 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక  ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విజయం సాధించే స్థానాలు 77 నుంచి 88 వరకూ ఉండోచ్చని తేల్చింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందనీ, హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందనీ అంచనాలున్న జేడీఎస్ 29 నుంచి 36 స్థానాలకు పరిమితమౌతుందనీ శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. ఇతరులు మూడు నుంచి ఎనిమిది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. 

ఆత్మసాక్షి సర్వే 2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన సర్వే అంచనాలు కచ్చితంగా రావడంతో తాజా ప్రీపోల్ సర్వేపై కూడా రాజకీయ పరిశీలకులు విశ్వసనీయత వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ ఆత్మసాక్షి సర్వే బీజేపీ 102 నుంచి 105 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేయగా.. ఆ పార్టీ 104 స్థానాలలో విజయం సాధించింది. అదే విధంగా కాంగ్రెస్ 76 నుంచి 78 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని పేర్కొనగా ఆ పార్టీ 78 స్థానాలలో విజయం సాధించింది. అలాగే జేడీఎస్ కు 35 నుంచి 38 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తే ఆ పార్టీ 37 స్థానాలలో గెలుపొందింది.

ఈ సారి కర్నాటకలో  కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  రాష్ట్రంలో హంగ్ పరిస్థితి లేదని ఆ సర్వే తేల్చింది. 

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.