ఏపీలో వైసీపీకి శృంగభంగం.. శ్రీఆత్మసాక్షి తాజా సర్వే

Publish Date:Sep 5, 2022

Advertisement

ఇప్పటి కిప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఏమవుతుంది?  అధికార వైసీపీ సీట్ల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. విపక్ష తెలుగుదేశం పార్టీకి సీట్ల సంఖ్య బాగా పెరుగుతుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన జనసేనకు ఈ సారి నాలుగు నుంచి ఐదు స్థానాలు రావచ్చు. కొన్నిస్థానాలలో తెలుగుదేశం, వైసీపీల మధ్య పోరు నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది. పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వేరు వేరుగా పోటీ చేస్తే పరిస్థితి ఇది. అలా కాకుండా పొత్తులు పొడిచి పోటీలోకి దిగినా పై ఫలితాలలో పెద్దగా మార్పు ఉండే అవకాశం లేదు.

శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్ తాజాగా శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో తేలిన ఫలితమిది..   శ్రీ ఆత్మ సాక్షి గ్రూప్, 02.06.2022 -03.09.22 మధ్య నిర్వహించిన,  ‘మూడ్ ఆఫ్ ది ఏపీ’  సర్వే ప్రకారం  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. తెలుగుదేశం పార్టీ 95 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది, అలాగే వైసీపీ 75 స్థానాలలో గెలుపొందుతుంది. ఇక జనసేప పార్టీకి 5 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. శ్రీ ఆత్మ సాక్షి ( ఎస్ఎఎస్)  గ్రూప్ ఏదో సర్వే చేశాం అంటే చేశాం అన్నట్లు కాకుండా, ఇంచు మించుగా నెలరోజుల వ్యవధిలో మూడు దఫాలుగా, అన్ని వర్గాల ప్రజలను, ప్రభుత్వ పథకాల లబ్దిదారులను వ్యక్తిగతంగా కలిసి, 43 అంశాలకు సంబంధిచి  సేకరించిన ప్రజాభిప్రాయం అధాంగా శాస్త్రీయంగా నిర్వహించింది. ఓటర్లను విభిన్న ప్రాతిపదికల ఆధారంగా  20 వర్గాలుగా విభజించి ప్రతి నియోజక వర్గంలో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను ప్రాధాన్యతా క్రమంలో సేకరించి  మరీ నిర్వహించిన సర్వే. నెల రోజుల వ్యవధిలో మూడు దశలుగా నిర్వహించిన ఈ సర్వే ఫలితం వాస్తవ పరిస్థితులకు దగ్గరగా ఉందని ఆత్మసాక్షి సర్వే ఒక ప్రకటనలో తెలిపింది.

అయితే సర్వేలో అత్యధికులు బీజేపీ, తెలుగుదేశం పొత్తు పట్ల అయిష్టత వ్యక్తం చేశారని పేర్కొంది. అదే సమయంలో తెలుగుదేశం, జనసేన పొత్తు పట్ల సుముఖత వ్యక్తం చేశారని సర్వేలో తేలిందని పేర్కొంది. తెలుగుదేశం, జనసేన 2024 ఎన్నికలలో పొత్తు పెట్టుకుంటే తాము మద్దతు పలుకుతామని 55శాతం మంది, మద్దతు ఇవ్వబోమని 35శాతం మంది చెప్పగా, సుముఖత, వ్యతిరేకత వ్యక్తం చేయని వారి శాతం 5గా ఉంది. ఇక బీజేపీ, జనసేనలతో తెలుగుదేశం పొత్తు పట్ల వ్యతిరేకత వ్యక్తం చేసిన వారు 56శాతం మంది కాగా, మద్దతు పలుకుతామని చెప్పిన వారి శాతం 30గా ఉంది. మరో 14శాతం మంది మాత్రం ఏమో తెలియదు అని చెప్పారని శ్రీఆత్మసాక్షి సర్వే పేర్కొంది.

ఇక జనసేన, బీజేపీ పొత్తు విషయంలో ఏకంగా 62శాతం మంది వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేవలం 31 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. అదే పొత్తులు లేకుండా ఏ పార్టీకి ఆ పార్టీ వేరువేరుగా పోటీ చేస్తే వైసీపీకి 43శాతం, తెలుగుదేశంకు 44.5శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందనీ ఇక జనసేనకు అయితే 9శాతం, ఇతరులకు 2 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని సర్వే తేల్చింది. ఇక సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ నిశబ్ద ఓటు (ఎస్వీఎఫ్) 1.5శాతంగా ఉందని పేర్కొంది.   

ఒక గత ఎన్నికలలో పోలిస్తే, వైసీపీ దాదాపు ఏడు శాతం   (6.95 శాతం) ఓట్లను కోల్పోతోంది. 2019 ఎన్నికలలో ఇంచుమించుగా 50 ( 49.95) శాతం ఓట్లు పొందిన వైసీపీ ఓటు షేర్ ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే, 43 శాతానికి పడిపోతుంది. టీడీపీ ఓటు  షేర్, గత ఎన్నికలలో పోలిస్తే 5 శాతానికి పైగా(5.25 శాతం) పుంజుకుని, 39.26 శాతం నుంచి 44.5 శాతానికి చేరుతుందని సర్వే సూచిస్తోంది. అదే విధంగా, జనసేన ఓటు షేర్ కూడా ఇంచుమించుగా రెండు శాతానికి పైగా (2.03 శాతం) వరకు పెరుగుతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.

గత ఎన్నికలో 6.7 శాతం ఓట్లు మాత్రమే పోలైన జనసేనకు, ఈసారి 9 శాతం ఓట్లు పోలవుతాయని సర్వే తేల్చింది. అంటే,సర్వే లెక్కల ప్రకారం చూస్తే, వైసీపే కోల్పోయే ప్రతి ఓటు, నేరుగా టీడీపీ లేదా జనసేన ఖాతాలో చేరుతోంది. అంటే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఓటర్ల పై బీజేపీ, కాంగ్రెస్, వామపక్ష పార్టీల ప్రభావం దాదాపు శూన్యమని సర్వే చెబుతోంది. మరో వంక 1.5 శాతంగా ఉన్నఎటు పోతుందో తెలియని నిశ్శబ్ద ఓటు ( సైలెంట్ ఓటు ఫ్యాక్టర్, ఎస్ వీఎఫ్) కీలకంగా మారనుందని సర్వే పేర్కొంది.

మొత్తంగా రాష్ట్రంలో ఇప్పటి కిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీకి శృంగభంగం తప్పదని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి విజయం నల్లేరుమీద బండి నడక కాదనీ తేల్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నప్పటికీ కనీసంలో కనీసం 38 స్థానాలలో అధికార, విపక్షాల మధ్యా పోటీ హోరాహోరీగా ఉంటుందని పేర్కొంది.  తెలుగుదేశం 77 స్థానాలలో, వైసీసీ 56 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉందనీ, జనసేన నాలుగు స్థానాలలో విజయం సాధించవచ్చనీ సర్వే పేర్కొంది.ఇక ఉమ్మడి జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం  తెలుగుదేశం 6, వైసీపీ 2, విజయనగరం తెలుగుదేశం 4, వైసీపీ 3, విశాఖపట్నం తెలుగుదేశం 6, వైసీపీ 5, తూర్పు గోదావరి తెలుగుదేశం 8, వైసీపీ 4, జనసేన 2, పశ్చిమ గోదావరి తెలుగుదేశం 8, వైసీపీ 3, జనసేన 2 స్థానాలలో విజయం సధించే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. ఇక కృష్ణా జిల్లా విషయానికి వస్తే ఇక్కడ తెలుగుదేశం 7 స్థానాలలోనూ, వైసీపీ నాలుగు స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. గుంటూరు జిల్లాలో అయితే తెలుగుదేశంకు పది స్థానాలలో విజయావకాశాలు మెండుగా ఉంటే, వైసీపీకి నాలుగు స్థానాలలో విజయావకాశాలు ఉన్నాయి. మిగిలిన చోట్ల పోటీ హోరాహోరీగా ఉంటుందని సర్వే పేర్కొంది. అలాగే ప్రకాశం జిల్లాలోనూ అత్యధిక స్థానాలలో తెలుగుదేశం పార్టీకే విజయావకాశాలు ఉన్నాయి. ఈ జిల్లాలో 7 స్థనాలలో తెలుగుదేశం, నాలుగు స్థానాలలో వైసీపీ గెలుపొందే చాన్స్ ఉందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. నెల్లూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ వైసీపీకి ఒకింత మొగ్గు కనిపిస్తోంది. ఈ జిల్లాలో వైసీపీకి ఐదు చోట్ల విజయం సాధించే అవకాశాలు ఉంటే తెలుగుదేశం పార్టీ మూడు స్థానాలలో విజయం సాధిస్తుంది. కడపలో తెలుగుదేశం పార్టీ ఒక స్థానంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయనీ, వైసీపీ ఐదు స్థానాలలో విజయం సాధిస్తుందనీ పేర్కొన్న సర్వే మిగిలిన నాలుగు స్థానాలలోనూ ఇరు పార్టీల మధ్యా నువ్వా నేనా అన్న స్థాయిలో పోటీ ఉంటుందని పేర్కొంది.

కర్నూలులో వైసీపీ, టీడీపీలకు చెరో ఐదు స్థానాలలోనూ విజయావకాశాలు ఉంటే నాలుగు స్థానాలలో పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంటుందని సర్వే పేర్కొంది. అలాగే చిత్తూరులో తెలుగుదేశం పార్టీకి 5, వైసీపీకి 6 స్థానాలలో విజయావకాశాలు ఉండగా, మూడు స్థానాలలో పోరు హోరాహోరీగా ఉంటుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే వెల్లడించింది. అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలలోనూ వైసీపీకి 6 స్థానాలలోనూ విజయావకాశాలు ఉండగా, ఒక చోట పోటీ నువ్వా నేనా అన్నట్లుగా ఉంది. మొత్తానికి ఆత్మసాక్షి సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య హోరాహోరీ పోరు తప్పదని సర్వే తేల్చింది. అదే సమయంలో గత ఎన్నికలతో పోలిస్తే వైసీపీకి ఓటు షేర్ గణనీయంగా తగ్గిపోతుందనీ, అదే సమయంలో తెలుగుదేశం బలంగా పుంజుకుంటుందనీ తేల్చింది. ఇక బీజేపీ, తెలుగుదేశం పొత్తు విషయంలో ప్రజలలో అంత సానుకూలత లేదనీ సర్వే వెల్లడించింది. మొత్తం మీద ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ విజయానికి అవకాశాలు మెండుగా ఉన్నాయని సర్వే పేర్కొంది.
   

By
en-us Political News

  
తెలంగాణ రక్షణ సేన పార్టీకి గుర్తింపు ఇవ్వాలని పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.
సీఎం అవినీతి బండారం మొత్తం బయటపడిందన్న కేటీఆర్ కాంగ్రెస్ సర్కార్ తీరు పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రజా రంజక పాలనను పూర్తిగా గాలికొదిలేసి కేవలం ప్రతిపక్షాలపై నిందలు వేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు.
తెలంగాణ షాబాద్ లో ఆరుగురిని అత్యంత కిరాతకంగా చంపిన రాజ్ కుమార్ కు, సొంత బాబాయిపై గొడ్డలి వేటు, సొంత తల్లీ, చెల్లిని గెంటేసిన జగన్ కూ మనస్తత్వ పరంగా పోలీకలు ఉన్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పరిశ్రమల పేరుతో యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, వేల ఎకరాల విలువైన ప్రభుత్వ భూములను ఇలా కారుచౌకగా కేటాయించడంపై అప్పట్లోనే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, భూములు పొందిన తర్వాత గాలి జనార్ధన్ రెడ్డి అక్కడ ఉక్కు కర్మాగారాన్ని నిర్మించడంలో పూర్తిగా విఫలమయ్యారు. పరిశ్రమ పెట్టకపోగా, ఈ ప్రభుత్వ భూములను జాతీయ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి దాదాపు 350 కోట్ల రూపాయల మేర రుణాలు పొంది బ్యాంకులను సైతం మోసం చేశారనే ఆరోపణలు వ్యక్తమయ్యాయి.
ముందస్తు ఎన్నికల ప్రచారాలపైనా సీఎం స్పష్టత ఇచ్చారు. కొందరు ప్రచారం చేస్తున్నట్లుగా రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగే ప్రశక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరో ఏదో అనుకున్నారని తాము ముందస్తుకు వెళ్లే ప్రసక్తే లేదన్నారు.
నిన్న మొన్నటి వరకూ వైసీపీకి, వివాదాస్పద యూట్యూబర్ ప్రశ్న రావణ్ కు అనుకూలంగా గళమెత్తిన జడ శ్రవణ్ కుమార్ అంత లోనే.. ఇలా యూటర్న్ తీసుకుని వైసీపీపై విరుచుకు పడటం విశేషం. తనకు వైసీపీ ఫండింగ్ చేస్తోందని వస్తున్న ఆరోపణలపై వివరణ ఇచ్చే క్రమంలో ఆయన వైసీపీ దోపిడీని ఎండగట్టారు. వైసీపీ తనకు ఫండింగ్ చేయడమేంటని ప్రశ్నించిన ఆయన ఆ పార్టీ నేతలు ఎంగిలి మెతుకులను కూడా వదలకుండా దోచేసుకుంటారని దుయ్యబట్టారు. జగన్ పాలనా కాలమంతా దోపిడీ రాజ్యమేలిందని విమర్శలు గుప్పించారు.
మొత్తం మీద రేవంత్ సభలో జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా తెలంగాణలో కేటీఆర్ సభలోనూ జగన్ ఫ్లెక్సీలు వెలిసన సంగతి తెలిసిందే. సొంత రాష్ట్రంలో కార్యక్రమాలు చేపట్టడంలో స్తబ్దుగా ఉంటున్న వైసీపీ శ్రేణులు తెలంగాణలో మాత్రం ఇతర పార్టీల సభలలో తమ అధినేత ఫ్లెక్సీలు, బ్యానర్లు ప్రదర్శించడం పట్ల రాజకీయవర్గాలలో విస్మయం వ్యక్తమౌతోంది.
మాజంలో వివాదాలకు కారణమైన ఒక వ్యక్తికి వైసిపి బహిరంగంగా మద్దతు ప్రకటించడం, మరీ ముఖ్యంగా మత విద్వేషాలు ప్రజ్వరిల్లేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తికి.. తనను తాను రావణుడినని చెప్పుకున్న వ్యక్తిని వత్తాసుగా వైసీపీ నిలవడం కోరి ప్రజా వ్యతిరేకతను కొని తెచ్చుకోవడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఈటల కాళేశ్వరం విషయంలో బీఆర్ఎస్ గళం ఎత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ఆరోపణలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో ఈటల రాజేందర్ బీఆర్‌ఎస్‌కు అనుకూలంగా మాట్లాడారు. దీంతో ఈటల మళ్లీ కారెక్కేస్తారా అన్న ప్రచారం అప్పట్లో జోరందుకుంది. ఆ తరువాత సద్దుమణిగింది.
ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అత్యంత సంక్లిష్టమైన మరియు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి.
ఉపా కింద నమోదైన ఈ కేసులో నిందితుడి తరఫున న్యాయపోరాటం చేసేందుకు వైసీపీ పార్టీ లీగల్ సెల్ విభాగానికి చెందిన ప్రముఖ సీనియర్ న్యాయవాది, మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.
ఈ సర్జరీల తరువాత పవన్ కల్యాణ్ కనీసం నెల రోజుల పాటు పూర్తిగా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది.
ఇటీవల అనంతపురం జిల్లాలో మడకశిర ఎమ్మెల్యే ఎమ్ఎస్ రాజు, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత విమర్శలు, ఆరోపణల పరంపరపై మధుసూదన్ రెడ్డి, ప్రజాప్రతినిధుల మధ్య కేవలం రాజకీయ పోరాటం ఉంటే ఫర్వాలేదని, కానీ ఇరువర్గాలు కులాల ప్రస్తావన తెస్తూ కుంపట్లు రాజేయడం తీవ్రమైన ప్రమాదాలకు దారితీస్తుందని హెచ్చరించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.