బీఆర్ఎస్ ను చీల్చడమా?.. కొత్త పార్టీయా.. కవిత అడుగులెటు?

Publish Date:May 29, 2025

Advertisement

తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్సీ, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తనయ కవిత హాట్ టాపిక్ గా మారారు. పార్టీ రజతోత్సవ సభ వేదికగా తండ్రి కేసీఆర్ ప్రసంగంలోని లోపాలను ఎత్తి చూపుతే ఆమె రాసిన లేఖ బయటకు వచ్చిన క్షణం నుంచీ తెలంగాణ రాజకీయ చర్చ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతోంది. అంతకు ముందు నుంచీ కూడా ఆమె మాటలు, తీరు బీఆర్ఎస్ లో కలకలం సృష్టిస్తూనే ఉంది. అయితే తాజాగా ఆమె బీఆర్ఎస్, బీజేపీ నెక్సస్ నిజమేనంటూ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పునాదులనే కదిపేశాయని చెప్పాలి. మరీ ముఖ్యంగా పార్టీ అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ నే ప్రమాదంలో పడేసేంత తీవ్రంగా ఉన్నాయి.

వాస్తవానికి సొంత తండ్రి, సోదరుడు లక్ష్యంగా ఆమె సంధించిన విమర్శనాస్త్రాలు, ప్రశ్నాస్త్రాలూ పార్టీ పునాదులనే కదిలించేస్తున్నాయి. బీజేపీలోకి బీఆర్ఎస్ విలీనం అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ అస్తిత్వానికే ముప్పుగా పరిణమించాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి   బీజేపీకి బీఆర్ఎస్ బీటీమ్.. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అన్న ప్రచారం  ఎప్పటి నుంచో బీఆర్ఎస్ వ్యతిరేక పార్టీలు చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఈ ఆరోపణ చేస్తూ వస్తోంది.  వాస్తవానికి బీజేపీ విజయం కోసం కవిత ఓటమికి బీఆర్ఎస్ తెరవెనుక రాజకీయం నడిపిందన్న ఆరోపణలు కూడా గట్టిగానే ఉన్నాయి. బీజేపీ గెలుపు కోసమే 2018 లో కవితను సొంత వారే బలిపశువును చేశారన్న ఆరోపణలూ ఉన్నాయి. అప్పట్లో  కవిత ఓటమి కి బిఆర్ఎస్ కు బీజేపీ తో ఉన్న తెరచాటు సంబంధాలే కారణం అనే వాదన కూడా అప్పట్లో గట్టిగానే వినిపించింది.

 ఢిల్లీ  మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత అరెస్టయ్యారు.  కవిత అరెస్టు వెనుక బీజేపీ పెద్దల హస్తం ఉందన్నది తెలంగాణ రాజకీయాలలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నప్పటికీ.. అయితే ఆ సమయంలో పార్టీ అధినేత కేసీఆర్ సహా పార్టీ ముఖ్య నేతలెవరూ కూడా  బీజేపీ కి వ్యతిరేకంగా ఒక్క ఖండన కూడా చేయలేకపోయారు. ఇక ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి అంటూ కేసీఆర్ పై విచారణకు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. , అలాగే    ఈ ఫార్ములా రేసింగ్ అంటూ కేటీఆర్ పై  కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలన్నా, కేసీఆర్ కుటుంబం అరెస్టుల భయం నుంచి బయటపడాలన్నా బీఆర్ఎస్ కు బీజేపీ సాయం తప్పనిసరి.  ఈ నేపథ్యంలోనే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. బీఆర్ఎస్ అడుగులు ఆ దిశగానే పడుతున్నాయన్న అనుమానాలూ బలపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఇదే సమయంలో కవిత కాంగ్రెస్ గూటికి చేరనున్నారన్న ప్రచారంపై కూడా ఆమె స్పష్టత ఇచ్చారు. మునిగిపోయే నావ వంటి కాంగ్రెస్ లో చేరే ప్రశక్తే లేదని కవిత కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. దీంతో ఇప్పుడు కవిత పొలిటికల్ ఫ్యూచర్ ఏమిటన్న చర్చ కూడా జోరందుకుంది. ఆమె కొత్త పార్టీ ఏర్పాటు ఆలోచనలో ఉన్నారనీ, ఆ పార్టీ పేరు బీఆర్ఎస్, టీఆర్ఎస్ కలబోతగా టీబీఆర్ఎస్ అని రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉంది. అదే సమయంలో కవిత సొంత పార్టీ పెట్టే అవకాశాలు లేవన్న వాదనా వినిపిస్తోంది. ఆమె పార్టీలో చీలిక తీసుకువచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక వేళ అదే జరిగితే.. జీహెచ్ఎంసీ పరిధిలో మెజారిటీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కవిత వెంట నడిచే అవకాశాలున్నాయంటున్నారు. అలా కాకుండా ఆమె సొంతంగా పార్టీ ఏర్పాటు చేస్తే.. అప్పుడు కూడా జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో అత్యధికులు కవిత వెంట నడిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయంటున్నారు.

అంటే కవిత సొంతంగా కొత్త పార్టీ స్థాపించినా, లేదా పార్టీలోనే చీలిక తీసుకువచ్చినా ఆమె వెంట పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నడిచే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ.  దీంతో ఎలా చూసినా బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకంగానే ఉందంటున్నారు. కేసీఆర్ మౌనం, కేటీఆర్ దుందుడుకు తీరు కారణంగా ఇప్పటికే పార్టీలోని మెజారిటీ నేతలలో  తీవ్ర అసంతృప్తి గూడుకట్టుకుని ఉందంటున్నారు. ఇప్పుడు అలా అసంతృప్తితో ఉన్న వారందరి గొంతుకగా కవిత తన గళమెత్తడం వారంతా కవిత వెంట నడిచే అవకాశలే మెండుగా ఉన్నాయంటున్నారు. 

By
en-us Political News

  
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థకు గురి అయ్యారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ సిమ్లాలో ని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజీలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు.
ఏపీలోని కర్నూలు జిల్లా ఓర్వకల్లు గ్రీన్ కో ఎనర్జీ ప్రాజెక్టును తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గ్రీన్ కో ప్రాజెక్టు దేశానికి, ప్రపంచానికి మార్గదర్శిలా నిలిచిందని అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు వివాదంలో తనను కావాలని లాగుతున్నరని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. కాళేశ్వరం కమీషన్ ఎదుట బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్ని అబద్దాలు చెప్పారని తుమ్మల తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిపైనా, మహిళలపైనా అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు కృష్ణం రాజు, ఒక టీవీ చానల్ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుపైనా ఏపీ డిప్యూటీ స్వీకర్ రఘురామకృష్ణం రాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధినేత జగన్‌పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారని లోకేష్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఎండ ఉక్కపోతతో అల్లడుతున్న ప్రజలకు వర్షంతో ఉపశమనం కలిగింది. ఉన్నపళంగా వాతావరణం మొత్తం చల్లబడింది.
తీవ్ర అనారోగ్యంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జూబ్లీహిల్స్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు.
అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అంటూ ఒక చానెల్ లో అనుచిత వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టు మ్యాగజైన్ ఎడిటర్ కృష్ణం రాజు, ఆయనను ఇంటర్వ్యూ చేసిన సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపుచేశారు.
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు క్యాబినెట్ విస్తరణకు ఉండే అవకాశముంది.
తెలుగుదేశం పార్టీలో చేరికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కీలక ప్రకటన చేశారు. టీడీపీలోకి ఇతర పార్టీలోకి వస్తామనే వారిపై పార్టీ హైకమాండ్ విచారణ చేస్తుందని తెలిపారు.
ఇప్ప‌టి వ‌ర‌కూ మ‌స్క్ పొలిటిక‌ల్ ఎంట్రీ ద్వారా జ‌రిగిన ప‌రిణామ క్రమం వేరు. 2024 ఎన్నిక‌ల్లో సుమారు 30 కోట్ల డాల‌ర్లు.. (ఇండియ‌న్ క‌రెన్సీలో 2500 కోట్లు) విరాళం ఇచ్చి మ‌రీ రాజ‌కీయాల్లోకి దిగిన మ‌స్క్ కి జ‌రిగిన శాస్తి ఏంటంటే.. ఆయ‌న టెస్లా అమ్మ‌కాలు భారీగా ప‌డిపోవ‌డం, షేర్ ధ‌ర‌లు యాభై శాతం డౌన్ కావ‌డం, వంద బిలియ‌న్ డాల‌ర్ల మేర త‌న సంప‌ద ఆవిరి కావ‌డం.
నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా నియమితులైన తరువాత గద్వాల జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు హజరయ్యారు . అదే కార్యక్రమానికి అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడు , గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి లు అటెండ్ అయ్యారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.