స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 21, 2023

Advertisement

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

11.తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం శ్రీవారిని 63వేల 628 మంది భక్తులు దర్శించుకున్నారు. 33 వేల 548 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చింది. ఇక శుక్రవారం ఉదయం శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి క్యూలైన్ బాట గంగమ్మ ఆలయం వరకూ సాగింది.

.................................................................................................................................................

కాంగ్రెస్ సీనియర్ నేత చిలుకూరి రామచంద్రారెడ్డి మృతి

12.  కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే చిలుకూరి రామచంద్రారెడ్డి అనారోగ్యంతో కన్నుమూశారు.   ఆయన నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పని చేశారు.   రామచంద్రారెడ్డి ఆకస్మిక మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రామచంద్రారెడ్డి మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అన్నారు.  

...............................................................................................................................................................

భూ కంపం

13. దేశంలోని మణిపూర్, రాజస్థాన్ లలో  శుక్రవారం తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 3.5గా నమోదైంది. భూమికి  20 కిలోమీటర్ల లోతులో భూ కంప కేంద్రం ఉన్నట్లు గుర్తించారు. ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. 

.........................................................................................................................................................

పొన్నం ప్రభాకర్ నిరసన గళం

14. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడు పొన్నం ప్రభాకర్ నిరసన గళం ఎత్తారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ అధ్యక్షతన 26 మందితో ఏర్పాటు చేసిన ఎన్నికల కమిటీలో చోటు దక్కక పోవడంతో ఆయన తన అసంతృప్తి వ్యక్తం చేశారు.   సీనియర్ నైన తనను ఎందుకు విస్మరించారంటూ నిరసన గళం విప్పారు.

....................................................................................................................................................

జైపూర్ లో వరుస భూకంపాలు

15. రాజస్థాన్ రాజధాని జైపూర్ వరుస భూకంపాలతో వణికిపోయింది. ఈ తెల్లవారుజామున 4.09 నుంచి 4.23 గంటల మధ్య భూమి మూడు సార్లు కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంపాల తీవ్రత 3.1 నుంచి 4.2 మధ్య నమోదైంది. వీటి వల్ల ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగలేదు. 

.................................................................................................................................................

హైకోర్టు న్యాయమూర్తిపై సీజేఐ అసంతృప్తి

16. రైల్లో వసతులు లేక అసౌకర్యానికి లోనైన ఓ హైకోర్టు న్యాయమూర్తి రైల్వే నుంచి వివరణ కోరడంపై భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్ ప్రకారం కల్పించే సౌకర్యాల ఆధారంగా తమకు ప్రత్యేక హక్కులు ఉన్నట్టు భావించకూడదని సూచించారు. 

................................................................................................................................................

రామడుగులో అత్యధిక వర్షపాతం

17. కరీంనగర్ జిల్లా రామడుగులో  ఈ ఉదయం  21. 35 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుఅయ్యింది. రాష్ట్రంలో ఇదే అత్యధిక వర్షపాతం. భారీ వర్షం నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 

.....................................................................................................................................................

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ

18. బీజేపీ తెలంగాణ  అధ్యక్షుడిగా జి. కిషన్ రెడ్డి నేడు బాధ్యతలు చేపట్టారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆయన చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా పాల్గొన్నారు.

..................................................................................................................................................

తగ్గేదేలే: పవన్

19. వాలంటీర్ల విషయంలో  పవన్ వ్యాఖ్యలపై కేసు నమోదుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తరువాత కూడా  వాలంటీర్ వ్యవస్థ గురించి తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని పవన్ చెబుతున్నారు.   వాలంటీర్లు సేకరించిన డేటా ఎక్కడికి వెళ్తుంది? అంటూ నిలదీశారు.

.......................................................................................................................................................

విమర్శలు కాదు వ్యవస్థలో లోపాలు సరిదిద్దే యత్నం: పేర్ని నాని

20.  తాను వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను విమర్శించానంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను పేర్నినాని ఖండించారు. తాను సర్కార్ ను విమర్శించలేదనీ,   వ్యవస్థల్లో లోపాలు సరిదిద్దే ప్రయత్నం మాత్రమే చేశాననీ వివరణ ఇచ్చారు.  

...........................................................................................................................................................

వరద పరిస్థితిపై సీఎస్ శాంతి కుమారి

21.   గోదావరికి వరద పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల జిల్లాల్లో పరిస్థితులపై సంబంధిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. భద్రాచలం వద్ద  చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు.

........................................................................................................................................................

ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం వద్ద వరద

22.  భారీ వర్షాల  నేపథ్యంలో  ఎడుపాయల వన దుర్గ అమ్మవారి ఆలయాన్ని అధికారులు మూసివేసారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మంజీర నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడంతో, ఆలయ పరిసరాల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

......................................................................................................................................................

తెలంగాణకు భారీ వర్ష సూచన

23. తెలంగాణలో మరీ ముఖ్యంగా  ఉత్తర, దక్షిణ తెలంగాణలో నేటి నుంచి 5 రోజుల పాటు కుండపోత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.  అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని పేర్కొంది.  

..................................................................................................................................................

నేటి నుంచి ఏపీలో ఓటర్ వెరిఫికేషన్

24. ఎన్నికల కమిషన్ ఏపీలో  నేటి నుంచి నెల రోజుల పాటు  ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా బూత్ లెవెల్ ఆఫీసర్లు ఇంటింటికీ వచ్చి ఓటర్ వెరిఫికేష్ చేపడతారు.    రాష్ట్రంలో ఓట్ల తొల‌గింపు, దొంగ ఓట్ల న‌మోదుపై  ఆరోపణల నేపథ్యంలో ఈ కార్యక్రమం చేపట్టారు.

..................................................................................................................................................

నవంబర్ లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్

25. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 12న నోటిఫికేషన్ వెలువడే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. రాజస్థాన్ లో కూడా అదే తేదీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.  

...............................................................................................................................................

డీఎస్పీల బదలీలు

26. తెలంగాణలో  51 మంది డిఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర డిజిపి అంజనీ కుమార్  ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 31వ తేదీ నాటికి బదిలీల ప్రక్రియ ముగించాలని ఆదేశించడంతో గత పది రోజులుగా రెవెన్యూ, పోలీస్ శాఖల్లో పెద్ద ఎత్తున బదిలీలు జరుగుతున్నాయి.

 .............................................................................................................................................

సహాయక చర్యల్లో పాల్గొనండి

27.    రాష్ట్రంలో  కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు   కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహాయ హస్తం అందించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ పిలుపునిచ్చారు.  ముంపు ప్రాంతాలలో పిల్లలకు పాలు, ఆహార పదార్థాలు అందించాలన్నారు. 

....................................................................................................................................................

ఆరోగ్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి : హరీష్

28. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి హరీష్ రావు అన్నారు. ప్రజలకు వైద్య సేవలలో ఎలాంటి అంతరాయం ఉండకూదన్నారు. 

..................................................................................................................................................

రోడ్డుపైనా నాట్లు.. వినూత్న నిరసన

29.జోగులాంబ జిల్లా శల్కాపురం గ్రామస్తులు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో  ప్రధాన రోడ్డు గుంతలమయంగా మారినా పట్టించుకోవడం లేదంటూ ఆ రోడ్డుపైనే నాట్లు వేసి నిరసన తెలిపారు. 

.............................................................................................................................................................

ఆర్డినెన్స్ కేసు విస్తృత ధర్మాసనానికి

30. ఢిల్లీ ఆర్డినెన్స్ కేసును సుప్రీం త్రిసభ్య ధర్మాసనం విస్తృత ధర్మాసనానికి సిఫారసు చేసింది. ఢిల్లీలో ప్రభుత్వ అధికారుల నియామకాలు, బదలీలపై కేంద్రం ఆర్డినెన్స్ ను ఆప్ సర్కార్  సుప్రీంలో సవాల్ చేసిన సంగతి తెలిసిందే.

By
en-us Political News

  
Telangana government pays special attention to the renovation of barrages, Revanth Reddy, Kaleshwaram Project, Medigadda Barrage, Annaram Barrage, Sundilla Barrage, Kaleshwaram Barrage Repairs, Barrage Restoration, Dam Safety, NDSA, Irrigation Projects, Devadula Lift Irrigation, Sitarama Lift Irrigation
ఏపీపీఎస్సీ గ్రూప్-1 మూల్యాంకన కుంభకోణం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) చేపట్టిన సోదాలు ముగిశాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రజారోగ్య పరిరక్షణ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక విధానంలో అత్యంత కీలకమైన మార్పులకు తెరలేపుతున్నట్లు తెలుస్తోంది.
Mahabubnagar ACB Raid, Telangana ACB, ACB Trap, Bribery Case, Rs 1 Lakh Bribe, Government Officials Arrested, Mahabubnagar Corruption, Youth and Sports Department, Jakkula Rajasekhar Reddy, Gorre Umesh, Telangana Anti Corruption Bureau, ACB Helpline 1064, Telangana Crime News
చలికాలం రాగానే మనలో చాలామంది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు
అనంతపురం జిల్లాలో జరుగుతున్న పరిషత్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.