SPEED NEWS 3

Publish Date:Jun 27, 2023

Advertisement

1. డ్రగ్స్ వ్యవహారంలో  అరెస్టైన సినీ నిర్మాత కేపీ చౌదరి  కాల్ లిస్ట్ లో  తన పేరు ఉందంటూ వస్తున్న వార్తలను నటి అషురెడ్డి ఖండించారు.  అయితే మీడియాలో వస్తున్న వార్తలతో రెండు రోజుల నుంచి తాను మెంటల్ టార్చర్ అనుభవిస్తున్నానని,  తప్పుడు ప్రచారం చేయవద్దని  అషురెడ్డి అన్నారు.  

2.క్రికెట్ వరల్డ్ కప్   అక్టోబర్ 5 నుంచి ప్రారంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 5న తొలి మ్యాచ్ జరగనుండగా.. నవంబర్ 15న ఇదే వేదికపై ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈమేరకు వరల్డ్ కప్ షెడ్యూల్ ను మంగళవారం మధ్యాహ్నం ఐసీసీ విడుదల చేసింది.  

3. వారాహి యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఉపవాస దీక్షలో ఉన్న పవన్  అస్వస్థతకు గురి కావడంతో పెదఅమిరంలోని నిర్మలాదేవి ఫంక్షన్ హాలులో విశ్రాంతి తీసుకుంటున్నారు.  

4. మహారాష్ట్ర రాజకీయాలపై కేసీఆర్ ప్రభావం ఏ మాత్రం ఉండబోదని శివసేన ఉద్ధవ్ థాక్రే నేత, ఎంపీ సంజయ్‌రౌత్అన్నారు.  కేసీఆర్ మహారాష్ట్రలోకి వచ్చి డ్రామా చేస్తున్నారు. ఇలానే నాటకాలాడితే తెలంగాణలోనూ అధికారం కోల్పోవడం ఖాయమని రౌత్ అన్నారు.  

5. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత, బీఎస్పీ మాజీ నేత ముత్యాల సునీల్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో చేరికకు రెడీ అయ్యారు. ఆయనకు రూట్ క్లియర్ అయ్యింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు ఆయన ఢిల్లీకి పయనమయ్యారు.  

6. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం భోపాల్‌లోని రాణి కమలపాటి స్టేషన్ నుండి ఐదు వందేభారత్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లను ప్రత్యక్షంగా ప్రారంభించగా.. మరో మూడు రైళ్లను వర్చువల్ ద్వారా ప్రారంభించారు.  

7. తీను  వైసీపీకి దూరమయ్యాకే తెలుగుదేశం పార్టీ నుంచి  ఆహ్వానం అందిందని  నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పారు. ఈ రోజు నెల్లూరులో తెలుగుదేశం సమావేశంలో మాట్లాడిన ఆయన  లోకేష్ పాదయాత్రకు అనూహ్య స్పందన వస్తోందన్నారు.  

8.  వైసీపీ ప్రభుత్వం పై ప్రజలు విసుగ్గా ఉన్నారని.. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘనవిజయం సాధిస్తుందని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి నారాయణ అన్నారు. నెల్లూరులో జరిగిన తెలుగుదేశం సమావేశంలో ఆయన మాట్లాడారు.  

9.తెలంగాణలో వచ్చే ఎన్నికలలో ఎంఐఎం పోటీపై ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎంఐఎంకు బలం ఉన్న అన్ని స్థానాలలోనూ అభ్యర్థులను పోటీలో నిలుపుతామన్నారు. వచ్చే ఎన్నికలలో ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని అసద్ చెప్పారు.  

10. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చే నెల  4న రాష్ట్రపర్యటనకు రానున్నారు.  ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి  రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు.   

By
en-us Political News

  
బిల్లులకు అవసరమైన మద్దతు   లభిస్తుందనే ధీమాతో కేంద్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నడుంబిగించిందని అంటున్నారు. అయితే రాజ్యాంగ సవరణ అవసరమైన ఈ బిల్లులకు సభలో మూడింట రెండొంతుల మోజారిటీ అవసరం.  కేంద్రం ఆ మద్దతును సమకూర్చుకోగలుగుతుందా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి, ఉత్కంఠ వ్యక్తమౌతోంది. 
ఎడతెగని చర్చలు, మంతనాల అనంతరం, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి మధ్య సీట్ల కేటాయింపు ప్రక్రియ  పూర్తయింది.
ఇలాంటి అణచివేత చర్యలు, అరెస్టులు  పరిస్థితిని మరింత దిగజార్చుతాయని పేర్కొన్నారు. ఇంత కాలం కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని, బీజేపీని జగన్ నేరుగా విమర్శించిన లేదా వ్యతిరేకించిన సందర్భం లేదు. అటువంటి జగన్ ఇప్పుడు బొద్దింకల ఉద్యమానికి మద్దతుగా మాట్లాడటం, ఆ పార్టీ నేతల అరెస్టులను ఖండించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.