speed news

Publish Date:Jun 27, 2023

Advertisement

1.బీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీపై  రాజుభాయ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  తన తండ్రే రాజు భాయ్ తో తనపై కేసు పెట్టించారని భవాని ఆరోపిస్తున్నారు.

2.  ఇకపై అమెరికాలోని న్యూయార్క్‌లోనూ పాఠశాలలకు దీపావళి సెలవు ఇవ్వనున్నట్లు నగర మేయర్  ప్రకటించారు. అయితే ఈ సెలవు వచ్చే ఏడాది నుంచి అమలులోకి వస్తుంది. 

3. జనసేన పార్టీ అధికారిక యూట్యూబ్ ఛానల్ చ10 లక్షల మంది సబ్ స్క్రైబర్లను  సాధించింది. ఈ విషయాన్ని జనసేన అధికారికంగా ప్రకటించింది.  

4.తెలంగాణ కాంగ్రెస్ లో ఓ వైపు జోష్, మరో వైపు అసమ్మతి సమాంతరంగా కనిపిస్తున్నాయి. తాజాగా  పార్టీ వ్యవహారాలలో అనేక లోపాలు ఉన్నాయని, వాటి గురించి రాహుల్ కు చెబుతాననీ  ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

5. విశాఖ వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ భార్య, కుమారుడు కిడ్నాప్ ఉదంతంతో మంత్రి అమర్నాథ్ కు చెమటలు పడుతున్నాయి. ఆయన తాజాగా గన్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

6. నైరుతి రుతుపవనాల  ఆలస్యం, వర్షాభావ పరిస్థితుల కారణంగా టమాటా ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. కిలో టమాటా వంద రూపాయలకు చేరువైంది.  (టమాటా)

7. ఉత్తరప్రదేశ్‌ లో  తుపాకీ పేలింది. డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న మోస్ట్ వాంటెడ్‌ క్రిమినల్‌ గుఫ్రాన్‌  ఈ రోజు ఉదయం  ఎన్‌కౌంటర్‌ హతమయ్యాడు. (ఎన్ కౌంటర్)

8. తెలంగాణ కాంగ్రెస్ లో నయా జోష్ కనిపిస్తోంది. పొంగులేటి, జూపల్లి సహా 35 మంది నేతలు  నిన్న కాంగ్రెస్ కండువా కప్పుకోగా, ఈ రోజు  ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అధ్యక్షతన పార్టీ కార్యాలయంలో తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై స్ట్రాటజీ మీటింగ్ జరిగింది.

9.తెలంగాణ సీఎం కేసీఆర్  మ‌హారాష్ట్ర‌ పండ‌రీపుర్ లోని  విఠోభ రుక్మిణి ఆల‌యాన్ని ద‌ర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ‌వ్యాప్తంగా రైతులు అంతా క్షేమంగా ఉండాల‌ని ఆయ‌న ప్రార్ధించారు.  

10.  రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి  కన్నుమూశారు. ఆయన వయస్సు 92 సంవత్సరాలు.  70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందిన రామచంద్రారెడ్డి మరణం పూడ్చలేని లోటని సీఎం కేసీఆర్ సంతాప సందేశంలో పేర్కొన్నారు. 

By
en-us Political News

  
మహానగరంలో శాంతిభద్రతలకు సవాల్ విసురుతూ మరో కిరాతక ఘటన వెలుగు చూసింది.
పెంపుడు జంతువుల పట్ల యజమానులు చూపే ప్రేమ రోజుకో కొత్త రూపం దాల్చుతోంది.
ప్రముఖ బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ మేనల్లుడైన ఇమ్రాన్ ఖాన్‌కు ముంబై పోలీసులు విదేశీ ప్రాంతీయ రిజిస్ట్రేషన్ కార్యాలయం (FRRO) నుంచి కఠినమైన ఆదేశాలు జారీ అయ్యాయి.
అమెరికాలోని చికాగో సమీపంలో ఒక భారీ ఉగ్ర కుట్ర తృటిలో తప్పింది.
బెంగళూరులోని ఒక పబ్‌లో పోలీసులతో జరిగిన వివాదంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత కఠినంగా స్పందించింది.
నాలుగేళ్ల పాటు ప్రేమించుకున్నారు.. ఎన్నో కలలు కన్నారు.. కుటుంబాల వ్యతిరేకతను ఎదుర్కొని మరీ ఒక్కటయ్యారు.
ప్రియుడిని బయటకు తీసుకురావాలనుకుంది.. చివరికి తానే కటకటాల వెనక్కి.!
జర్మనీలో చోటుచేసుకున్న ఒక అనూహ్య ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం సందర్శించారు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ బ్లూ డ్రమ్ హత్య కేసులో న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం (ఉప్పల్) వేదికగా జరుగుతున్న నాల్గో టీ20 పోరులో భారత జట్టు టాస్ నెగ్గి తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
తిరుమల శ్రీవారి పవిత్ర లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించే నెయ్యి కల్తీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక చర్యలు చేపట్టింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.