స్పీడ్ న్యూస్ 2

Publish Date:Jul 25, 2023

Advertisement

కేసీఆర్ ను గద్దె దించే వరకూ పోరాటం: ఈటల

11.కేసీఆర్ ను గద్దె దించే వరకు తాము పోరాటం చేస్తామని హుజూరాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ నేత ఈటల రాజేందర్  అన్నారు. యువతను నిర్వీర్యం చేస్తోన్న చరిత్ర కేసీఆర్ ది అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఇంటికి ఇద్దురు వృద్ధులకు పెన్షన్  ఇస్తామన్నారు.

........................................................................................................................................................

కుతుబ్ షాహీ మసీదుపై పిడుగుపాటు

12. హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ మసీద్ పై పిడుగు పడటంతో మినార్ బీటలు వారింది. పిడుగు పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు.  సరూర్ నగర్, దిల్ సుఖ్ నగర్, మలక్ పేట తదితర ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

...............................................................................................................................................................

పాఠశాలల వేళల్లో మార్పులు

13. భారీ వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మినహా పాఠశాలల వేళల్లో మార్పులు చేసింది.  మంగళవారం నుంచి   ప్రాథమిక పాఠశాలలు, ఉదయం గం.9.30 నుండి సాయంత్రం గం.4.15 వరకు ఉన్నత పాఠశాలలు ఉదయం గం.9.30 నుంచి 4.45 వరకు పని చేస్తాయి.

........................................................................................................................................................

పార్లమెంటు ఆవరణలో విపక్షాల నిరసన

14. మణిపూర్ అల్లర్లపై ప్రధాని మోడీ ప్రకటనకు పట్టబట్టడంతో పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో వాయిదాల పర్వం కొనసాగుతోంది.  ఈ నేపథ్యంలో కేంద్రం   తీరును నిరసిస్తూ విపక్ష ఎంపీలు రాత్రంతా పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన చేపట్టారు.

........................................................................................................................................................

ట్రాక్ బేస్ లోపంతో నిలిచిపోయిన భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్

15.  రైల్వే ట్రాక్ బేస్ లోపం వల్ల కాగజ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళుతున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఉప్పరపల్లి వద్ద ఈ ఉదయం నిలిచిపోయింది.    రైల్వే సిబ్బంది మరమ్మతులు చేసిన అనంతరం బయలుదేరింది.

............................................................................................................................................................

18 మంది డీఎస్పీల బదిలీ

16.   18 మంది డిఎస్పి లను బదిలీ చేస్తూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజని కుమార్  నిన్న రాత్రి  త్తర్వులు జారీ చేశారు. ఈనెల 31 లోగా ఎన్నికల నియమావళి ప్రకారం బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో ఈ బదలీల ప్రక్రియ సాగుతోంది. 

........................................................................................................................................................

17.  హైదరాబాద్ మలక్ పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో  ఒకే ట్రాక్ పైకి రెండు లోకల్ ట్రైన్స్ ఎదురెదురుగా వచ్చాయి. అప్రమత్తమైన లోకో పైలట్లు ట్రైన్లను ఆపి వేశారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.  ఈ ఘటనపై రైల్వే శాఖ అంతర్గతంగా విచారణ జరుపుతున్నది.

......................................................................................................................................................

మేఘాలమ పీఎం కార్యాలయంపై దాడి

18.మేఘాలయ సీఎం కన్నాడ్ సంగ్మా కా ర్యాలయంపై దాడి జరిగింది.  తురాలో శీతాకాల రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు ఆందోళనకారులు సీఎం కార్యాలయాన్ని ముట్టడించి రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు అయ్యాయి.

...........................................................................................................................................................

ఆన్ లైన్ లో సబ్సిడీ ధరకు టమాటా

19. కేంద్రం సబ్సిడీపై కిలో  టమాటోలను 70రూపాయలకే ఆన్‌లైన్‌లో అందిస్తోంది. టమాటా ధరలు ఆకాశానికి అంటిన నేపథ్యంలో   ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ప్రాంతంలో ప్రభుత్వ వ్యవసాయ మార్కెటింగ్ సంస్థ  ఆన్‌లైన్‌లో నెట్‌వ‌ర్క్ ద్వారా కిలో రూ.70లకే టమోటాలను అందిస్తోంది.

..............................................................................................................................................................

ఎమ్మెల్యే రాజేంద్రసింగ్ గూడాపై దాడి

20.  రాజస్థాన్ అసెంబ్లీలో  అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీకే చెందిన ఎమ్మెల్యేపై దాడికి దిగారు.  తన వద్ద రెడ్ డైరీ ఉందని, సీఎం అశోక్ గహ్లోత్ కు సంబంధించిన నగదు లావాదేవీల గురించి అందులో ఉందని చెప్పి మంత్రి పదవి పోగొట్టుకున్న  రాజేంద్ర సింగ్‌ గుడాపై ఈ దాడి జరిగింది.

......................................................................................................................................................

కూనేటివాగుకు వరద పోటు

21.ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.  మెంటాడ మండలం కొండలింగాలవలసలోని కూనేటి వాగుకు వరద ఉద్ధృతి పెరగడంతో కొండలింగాలవలస పరిధిలోని 14 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. 

.................................................................................................................................................

కట్టలేరు వాగుకు వరద ఉధృతి

22. ఉమ్మడి కృష్ణా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావంతో వినగడప వద్ద కట్టలేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో  20 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. విజయవాడ వైపు వచ్చే వాహదారులు ఇబ్బందులు పడుతున్నారు.

.........................................................................................................................................................

30న  పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం

23.ఈ నెల 30న  పీఎస్‌ఎల్‌వీ-సి56 ప్రయోగం చేపట్టనున్నట్లు ఇస్రో  ప్రకటించింది.  ఈ  ప్రయోగం ద్వారా సింగపూర్‌కు చెందిన 351.9 కిలోల  డీఎస్‌-ఎస్‌ఏఆర్‌ సహా ఆర్కేడ్‌, ఎలోక్స్‌-ఏఎం, ఓఆర్‌బీ-12 స్ట్రైడర్‌, గెలాసియా-2, 3యూ, స్కూబ్‌-2, 3యూ ఉపగ్రహాలను  కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు.

......................................................................................................................................................

పవన్ పై రోజా విమర్శలు..చిన్న మెదడు చితికిపోయింది

24.  మంత్రి  రోజా మరోసారి జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై విమర్శలు గుప్పించారు. తిరుపతిలో నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమంలో మాట్లాడిన ఆమె  పవన్ కళ్యాణ్‌కు చిన్న మెదడు చితికిపోయిందని, అందుకే వాలంటీర్లపై పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు.  

........................................................................................................................................................

భారీ వర్షాలకు గుజరాత్ లో కుప్పకూలిన భవనం

25. గుజరాత్ లో భారీ వర్షాల ధాటికి గుజరాత్‌లోని జునాగఢ్‌లో ఓ రెండు అంతస్థుల భవనం కుప్పకూలింది.  ఆ భవనం శిథిలాల కింద నలుగురు చిక్కుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలోని దాతర్ రోడ్‌లోని కడియావాడ్ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

By
en-us Political News

  
Publish Date:Jan 7, 2026
ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు
ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది.
పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు.
ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు. ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు.
తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది.
ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు.
రండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది. పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.
ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు.
రద్దు చేసిన కమిటీల స్థానంలో నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత మరోసారి హరీష్ రావుపై హాట్ కామెంట్స్ చేశారు.
కొత్త సంవత్సరం చేతినిండా, నోటి నిండా పని పెట్టనుంది. ఎందుకంటే ఈ ఏడాది పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే జాతీయ, ప్రాంతీయ రాజకీయ పార్టీలన్నీతమతమ వ్యూహాలు, ఎత్తుగడలకు పని చెప్పనున్నాయి. పెద్ద రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల అసెంబ్లీలకు 2026 తొలి అర్ధ భాగంలోనే ఎన్నికలు జరగనున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.