స్పీడ్ న్యూస్ 1

Publish Date:Jul 27, 2023

Advertisement

ప్రేమ జంటకు శ్మశానంలో వివాహం

1. ఓ ప్రేమ జంటకు స్మశానంలో అతి వైభవంగా వివాహం జరిగిన అరుదైన ఘటన    శిర్డీ సమీపంలోని రహతా గ్రామంలో జరిగింది.  స్థానిక శ్మశానంలో కాటికాపరిగా పని చేస్తున్న వ్యక్తి కుమార్తె ప్రేమ వివాహాన్ని ఆమె పుట్టి పెరిగిన చోటే చేయాలన్న తలంపుతో  ఆ జంట వివాహం శ్మశానంలో   అంగరంగ వైభవంగా జరిపించారు.

...............................................................................................................................................

పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకం నిషేధం : యునెస్కో

2. ప్రపంచవ్యాప్తంగా  పాఠశాలల్లో మొబైల్ ఫోన్ల వాడకాన్ని నిషేధించాలని యూనెస్కో సూచించింది. మనుషుల మధ్య సంబంధాలను  డిజిటల్ టెక్నాలజీతో భర్తీ చేయకూడదని అభిప్రాయపడింది. కాగా, ఇప్పటికే పలు దేశాల్లో ప్రభుత్వాలు స్కూళ్లల్లో మొబైల్ ఫోన్లు, ఇతర గ్యాడ్జెట్ల వినియోగంపై నిషేధం విధించాయి.

..............................................................................................................................................................

ముత్యాల జలపాత సందర్శనకు వెళ్లి చిక్కుకున్న పర్యాటకులు

3.  ములుగు జిల్లా వీరభద్రవరం ముత్యాల జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన 84 మంది పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు. నిన్న ఉదయం ఈ జలపాతం చూసేందుకు వెళ్లి తిరిగి వస్తుండగా  భారీ వర్షాలకు వాగు ఉప్పొంగింది. దీంతో పర్యాటకులు అక్కడే చిక్కుకుపోయారు.  డయల్ 100 ద్వారా పర్యాటకులు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగు చూసింది.

.......................................................................................................................................................

బీజేపీ నుంచి జిట్టా సస్పెన్సన్

4. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది.   చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా ఇటీవల   బీజేపీలో   గ్రూప్ రాజకీయాలు చాలా ఎక్కువ అయ్యాయని, అందుకే పార్టీకి మానసికంగా దూరమయ్యాయనీ చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే బీజేపీ అధిష్ఠానం ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది.

.......................................................................................................................................................

జగన్ ఓ కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ : లోకేష్

5. జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ అన్నారు. ఒంగోలులో బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన జగన్ ను కట్టింగ్, ఫిట్టింగ్ మాస్టర్ గా అభివర్ణించారు. దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్ చేసిన ఏకైక నాయకుడు జగనే అంటూ విమర్శించారు.

.........................................................................................................................................................

ఏపీలో బాలికలు, మహిళల అదృశ్యం

6. ఆంధ్రప్రదేశ్ లొ  2019- 2021 మధ్య 7,928 మంది బాలికలు, 22,278 మంది మహిళలు అదృశ్యమైనట్లు  కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా పార్లమెంటులో లిఖితపూర్వక సమాధానం ద్వారా తెలిపారు. దీనిపై జనసేనానిని కేంద్రం విడుదల చేసిన గణాంకాలను కాదనగలరా జగన్ అంటూ ట్వీట్ చేశారు.

...................................................................................................................................................

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా వనమాలే: షర్మిల

7. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో కేసీఆర్ పార్టీలోని ఎమ్మెల్యేలందరూ వనమాలే అంటే వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల విమర్శించారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు   తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన  ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని  అన్నారు.

.........................................................................................................................................................

అవిశ్వాసంతో ఒరిగేదేమీ లేదు: కిషన్ రెడ్డి

8.కేంద్ర ప్రభుత్వంపై విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంతో ఒరిగేదేమీ లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో విలేకరులతో మాట్లఅాడిన ఆయన  కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు మూడూ ఒక్కటేని చెప్పారు. ఈ మూడు పార్టీల మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు.

..................................................................................................................................................

సీఎస్ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్

9.తెలంగాణ వ్యాప్తంగా వచ్చే  48 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో  జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో సీఎస్‌ శాంత కుమారి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.  అప్రమత్తంగా ఉండాలని, ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని  ఆదేశించారు.

..........................................................................................................................................................

భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక

10. భారీ వర్షాలకు గోదావరి పోటెత్తుతోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం  50.2 అడుగులకు చేరింది  రికార్డు స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో రాత్రి 12 గంటల సమయానికే 350 మిల్లీమీటర్ల  వర్షపాతం నమోదయింది.

By
en-us Political News

  
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.