కక్ష కట్టిన ఆడబిడ్డ.. రంగంలోకి బ్రదర్ అనిల్!

Publish Date:May 12, 2023

Advertisement

ఇంటిగుట్టు లంకకి చేటు అన్నట్లు.. ఇంటి గుట్టు పార్టీకి.. అదీ అధికార ఫ్యాన్ పార్టీకి చేటు అన్నట్లుగా ఉందనే ఓ చర్చ అయితే అంధ్రప్రదేశ్ పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది. మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో ప్రదానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి వైయస్ భాస్కరరెడ్డిలు చేసిన తీవ్ర ఆరోపణలపై వైయస్ ఫ్యామిలీ నుంచి ఒక్కరంటే ఒక్కరు స్పందించిందీ లేదు.. ఖండించిందీ లేదని.. కానీ వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల మాత్రం వైయస్ అవినాష్ రెడ్డి అండ్ కో చేసిన ప్రతీ ఆరోపణను అటు ఢిల్లీలో... ఇటు హైదరాబాద్‌లో.. ఎక్కడైనా సరే మీడియా ముందకు వచ్చి.. ఎన్నీ ప్రెస్ మీట్ సింగిల్ హ్యాండ్ అన్నట్లు.. ఏ మాత్రం అదురు బెదురు లేకుండా వైయస్ వివేకాపై వచ్చిన ఆరోపణలను ఖండించడమే కాదు.. తమ చిన్నాన్న ఎలాంటి వ్యక్తి.. ఆయన వ్యక్తిత్వం ఏమిటి... అలాగే కడప జిల్లా ప్రజల్లో ఆయనకు ఉన్న గుడ్ వీల్ ఎలాంటిదో కూడా సోదాహరణగా వివరించింది.. వివరిస్తోంది కూడా. దీంతో వైయస్ షర్మిల వ్యాఖ్యలను తెలుగు ప్రజానికం నమ్మక తప్పని పరిస్థితి నెలకొందనే ఓ చర్చ అయితే సదరు సర్కిల్‌లో కొన... సాగుతోంది. 

మరోవైపు చంద్రబాబు ప్రభుత్వ హయాంలో తన చిన్నన్న వైయస్ వివేకా హత్య చోటు చేసుకొందని.. అందులో సీఎం చంద్రబాబు పాత్ర ఉందని.. దీనిపై సీబీఐతో విచారణ జరిపిస్తేనే కానీ.. ఈ హత్య కేసులో పాత్రదారులు, సూత్రధారులు బయటకు వస్తారంటూ పులివెందుల్లోని వైయస్ వివేకా మృతదేహం సాక్షిగా నాటి ప్రతిపక్షనేత వైయస్ జగన్ డిమాండ్ చేశారని.. ఆ క్రమంలో ఆయన కోర్టులో సైతం ఈ హత్య కేసు సీబీఐ విచారణ చేపట్టాలంటూ పిటిషన్ కూడా దాఖలు చేశారని... ఆ తర్వాత ఎన్నికలు జరగడం.. ఆ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి బంపర్ మెజార్టీ రావడం.. జగన్ ముఖ్యమంత్రి కావడం... నాటి నుంచి సీఎం వైయస్ జగన్ .. నేటి వరకు ఈ వివేకా హత్య కేసులో అనుసరించిన వ్యవహారశైలిని ప్రజలు నిశితంగా గమనిస్తున్నారనే ఓ చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా నడుస్తోంది.   

ఇంకోవైపు వైయస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ సైతం ప్రస్తుతం రంగంలోకి దిగి.. వైయస్ జగన్‌ను గద్దె దింపేందుకు ఎంత చేయాలో అంత చేసేందుకు తన వంతు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు.. అందులోభాగంగా వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీకి కొన్ని వర్గాల వారి నుంచి ఓట్లు పడకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు సైతం ఆయన సిద్దం చేసి.. వాటిని ఎన్నికల నాటికి స్లిపర్ సెల్స్‌లాగా జనాల్లోకి పంపేందుకు వ్యూహరచన సైతం సిద్దం చేసినట్లు సదరు సర్కిల్‌లో ఓ టాక్ అయితే హల్‌చల్ చేస్తోంది.   

అయితే ఫ్యాన్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్థానం నుంచి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కారంటే.. ఆ అందులో ఆయన తల్లి వైయస్ విజయమ్మ, చెల్లి వైయస్ షర్మిల, బావ బ్రదర్ అనిల్ కుమార్ పాత్ర ఖచ్చితంగా ఉందని.. ఇది ఎవరు కాదనలేని సత్యమని స్పష్టం చేసే వారు ఉన్నారని... అయితే వైయస్ జగన్ సోదరి వైయస్ షర్మిల.. జగనన్న వదిలిన బాణం అంటూ తన పాదయాత్రలో బాణంలాగా దూసుకుపోతే.. ఆమె భర్త బ్రదర్ అనిల్ మాత్రం.. 2019 ఎన్నికల వేళ.. జగన్ గెలుపు కోసం చాలా పకడ్బందీ వ్యూహాంతో ముందుకు వెళ్లారని... దీంతో క్రిస్టియానిటీ ఓటింగ్ అంతా గంపగుత్తగా ఫ్యాన్ పార్టీకి పడడంలో కీలకంగా మారిందని.... ఆ క్రమంలో రాష్ట్రంలోని మొత్తం 24 ఎస్సీ నియోజకవర్గాల్లో 23 జగన్ పార్టీ ఖాతాలోకి వచ్చి పడ్డాయంటే అదంతా బ్రదర్ అనిల్ కుమార్ వ్యూహా రచన అనే వారు సైతం ఫ్యాన్ పార్టీలో ఉన్నారనే టాక్ సైతం వైరల్ అవుతోంది.  

అదీకాక వచ్చే ఎన్నికల్లో 175కి 175 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోవాలని.. ఆ క్రమంలో  వై నాట్ 175 అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్.. పార్టీ శ్రేణులతో నిర్వహిస్తున్న వివిధ సమీక్షా సమావేశాల్లో మాట్లాడడమే  కాకుండా.. ఆ దిశగా ఆయన ప్రణాళికలు సైతం వేసుకొని.. ముందుకు సాగుతోన్నారని... అయితే ఇప్పటికే వైయస్ జగన్ ప్రభుత్వ పాలనపై ప్రజల్లో ఓ క్లారిటీ అయితే వచ్చేసిందని.. అలాగే  గత ఎన్నికల వేళ.. వైయస్ జగన్ వెంట నడిచిన వారు.. ఈ ఎన్నికల వేళ నడుస్తారా? అంటే అదీ సందేహమేనని.. ఐ ప్యాక్ తప్ప.. వైయస్ ఫ్యామిలీలోని  వారు సైతం ఆయన వెంటనే నడిచే పరిస్థితులు అయితే లేవనే వ్యాఖ్యలు సైతం వినిపిస్తున్నాయని... మరి జగనన్న వదిలిన బాణం అంటూ నాడు వైయస్ జగన్‌ను అధికారంలోకి తీసుకు వచ్చేందుకు ఎంత చేయాలో అంత చేసిన వైయస్ షర్మిల, ఆమె భర్త బ్రదర్ అనిల్.. అదే జగనన్నను గద్దె దింపేందుకు చేస్తున్న ప్రయత్నాల్లో ఈ దంపతులు సఫలీకృతులవుతారా? లేదా? అనేది మాత్రం వచ్చే ఎన్నికల ద్వారా సుస్పష్టమవుతోందని చర్చ సైతం పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొంది.

By
en-us Political News

  
తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్న వేళ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం సాధించడంలో సువేందు కీ రోల్ పోషించారు. ఆ పార్టీ 206 స్థానాల్లో గెలిచి బెంగాల్‌లో తొలిసారిగా అధికారం చేపట్టబోతోంది. బీజేపీ తరఫున రెండు స్ధానాల నుంచి బరిలోకి దిగిన సువేందు అధికారి.. మరోసారి మమతా బెనర్జీని ఓడించారు. భవానిపూర్‌లో దీదీపై గెలిచిన ఆయన.. తన సొంత నియోజకవర్గమైన నందిగ్రామ్‌లోనూ గెలిచి పట్టు నిలుపుకున్నారు.
ముఖ్యంగా అస్సాం, పశ్చిమబెంగాల్ లో బీజేపీ ఎన్నికల సంఘం సహకారంతో ఫలితాలను చోరీ చేసిందన్నారు.
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.