ప్రత్యేక హోదా వన్స్ మోర్.. అదే ప్రశ్న ..అదే జవాబు

Publish Date:Dec 13, 2022

Advertisement

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన ఎలా జరిగిందనేది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పడు ఆ లోతుల్లోకి పోవలసిన అవసరం లేదు. అయితే, రాష్ట్ర విభజన న్యాయంగా జరిగిందో  అన్యాయంగా జరిగిందో ఇప్పుడు చర్చించి ప్రయోజనం లేదు. అయితే, కనీసం  రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల కోసం అయినా  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం  ఆంద్ర ప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు పార్లమెంట్ లోపల వెలుపల ఎందుకు గళం విప్పలేక పోతున్నారు.

ముఖ్యంగా అధికార వైసేపీ సభ్యులు  పార్లమెంట్  ఉభయ సభల్లో హోదా, పోలవరం ప్రస్తవన వచ్చిన ప్రతి సంధర్భలో ఎందుకు మౌనంగా ఉండి పోతున్నారు. ఎందుకు వారు గళం ఎత్తుతారని ఆశించడం కూడా అత్యాశగా అనిపిస్తోంది? అంటే,   వైసేపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీ ఎంపీలు కేంద్రానికి అంతగా దాసోహం అంటున్నారు కాబట్టే అనే సమాధానమే వస్తోంది. ఆ మాటలు అంటోంది  ఎవరో కాదు, అధికార పార్టీ  నాయకులూ, క్యాడర్ నోటి నుంచే ఇలాంటి మాటలు వినిపిస్తున్నాయి. 

రాష్ట్ర విభజన చట్టంలో అవశేష ఆంధ్ర ప్రదేశ్ కు ప్రామిస్ చేసిన  ప్రత్యేక హోదాకు కేంద్ర ప్రభుత్వం మంగళం పాడేసింది. అదొక ముగిసిన అధ్యాయం  అంటూ పక్కన పెట్టేసింది. ఎన్ని సార్లు అడిగినా అదే సమాధానం. అవే మోసపు మాటలు. తాజాగా మంగళవారం  (డిసెంబర్ 13) రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా ప్రతిపాదన వచ్చిందా? అంటూ ప్రశ్నించారు. అటు లోక్ సభలో టీడీపీ ఎంపీ కేశినేని నాని కూడా విభజన అంశాలపై ప్రశ్నించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం మళ్ళీ అదే పాత పాటనే మరోమారు వినిపించింది. 14, 15వ ఆర్థిక సంఘం సిఫారసుల మేరకు రాష్ట్రాలకు నిధులు అందిస్తున్నామని వెల్లడించింది.  14వ ఆర్థిక సంఘం కేటగిరీ రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపిణీలో ఎలాంటి వ్యత్యాసం చూపడంలేదని స్పష్టం చేసింది. అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామని పేర్కొంది.  తద్వారా ప్రత్యేక హోదా అంశం తమ దృష్టిలో లేదని స్పష్టం చేసింది. అలాగే 14వ ఆర్థిక సిఫారసులను పరిగణనలోకి తీసుకుని కేంద్రం రాష్ట్రాలకు పన్నుల వాటాను కేంద్రం 32 శాతం నుంచి 42 శాతానికి పెంచిందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ లిఖితపూర్వకంగా తెలియజేశారు.  

 కేంద్ర ప్రభుత్వం  పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని తుంగలో తొక్కి రాష్ట్రానికి అన్యాయం చేస్తోంది. నిజమే   అయితే, మన బంగారం మంచిదైతే కదా, వేరొకరిని వేలెత్తి చూపేందుకు.. నిజానికి  2019 ఎన్నికలకు ముందు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అసెంబ్లీ  లోక్ సభ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే  ప్రత్యేక హోదా సాధిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఎన్నికల ఫలితాలు పూర్తిగా రాక ముందే చేతులు ఎత్తేశారు. కేంద్రలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది కాబట్టి ఇక, ప్రత్యేక హోదా మోడీ దయ మన ప్రాప్తం అంటూ జగన్ రెడ్డి చేతులు  ఎత్తేశారు. 

నిజమే  కావచ్చును  కానీ, రాష్ట్రానికి అన్యాయం జరిగినప్పడు  సంఖ్యాబలంతో పని లేకుండా పార్లమెంట్ లోపల, వెలుపల, న్యాయస్థానాల ద్వారా.. కేంద్రం మెడలు వంచేందుకు ఉన్న ఇతర మార్గాలను ఎందుకు ఉపయోగించు కోలేదు. ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళినా ఎన్ని సార్లు ప్రధానిని కలిసినా ఎంత సేపు కాళ్ళకేసి చూడడమే తప్ప గొంతెత్తి అడిగిందేదని అధికార పార్టీ క్యాడర్, ముఖ్యంగా ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి, పరిశ్రమలు వస్తే ఉద్యోగాలు వస్తాయని ఆశగా ఎదురు చూసిన యువత జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి. పార్లమెంట్ లో తెలుగు దేశం సభ్యులు పదే పదే ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు  వైసీపీ సభ్యులు మౌనంగా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ప్రశ్న ఎవరు అడిగారన్నది కాదు... రాష్ర ప్రయోజనాల విషయంలో అయినా  వైసేపీ రాజకీయాలకు అతీతంగా ఎందుకు కేంద్రాన్ని  నిలదీయ లేక పోతోంది, అనేదే అసలు ప్రశ్న అంటున్నారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రయోజనాలే తమకు పరమావధన్న ఆయన పార్లమెంటులో ఈ ప్రతిపాదనపై చర్చ,  ఓటింగ్ జరిగినప్పుడు తమ పార్టీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు అనుకూలంగా ఓటు వేస్తారని వెల్లడించారు.
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులు ఆమోదం పొందితే దేశ రాజకీయాలలో కాంగ్రెస్ ప్రతిష్ఠ బాగా మసకబారుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ఇది 2029 సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలపై నిస్సందేహంగా ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
తొలి విడత పంచాయతీ ఎన్నికలలో  వైసీపీ మద్దతుదారులు కనీసం పాతిక శాతం  స్థానాలను కూడా గెలుచుకోలేకపోయారు. అదే సమయంలో తెలుగదేశం కూటమి మద్దతు ఉన్నఅభ్యర్థులు తిరుగులేని విజయాలతో ప్రభంజనం సృష్టించారు. 
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ బిల్లు ఉద్దేశాలను, ప్రక్రియను  తప్పుబడుతుండగా, ఇండియా కూటమిలోని పలు ప్రాంతీయ పార్టీలో,  సీట్ల వాటా రక్షణ, సవరణల ఆధారంగా తమ వైఖరిని మార్చుకుంటున్న సంకేతాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.
డీలిమిటేషన్ తో పాటు, మహిళా రిజర్వేషన్ల అమలును తీసుకురావడమే ఈ సమావేశాల నిర్వహన ప్రధాన లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ చెబుతున్నప్పటికీ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ముంగిట ఈ హడావుడి సమావేశాల వెనుక ఉన్న ప్రధాన లక్ష్యం బీజేపీకి రాజకీయ లబ్ధి చూకూర్చడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 
కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయం మేరకు ఏ   రాష్ట్రంలోనూ  సీట్ల వాటా తగ్గదు, ప్రస్తుత నిష్పత్తిని కాపాడుతూనే అన్ని రాష్ట్రాల్లోనూ సమానంగా స్థానాలు పెరుగుతాయి.  అంతేకాకుండా, 2051 సీట్ల విషయంలో మార్పులు లేకుండా స్తంభనను అమలు చేయడం ద్వారా భవిష్యత్ జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య సీట్ల నిష్పత్తి మారకుండా నియంత్రించామని కేంద్రం చెబుతోంది. 
లోక్‌సభ నియోజకవర్గాల సంఖ్యను 50 శాతం పెంచడం వల్ల ఏ రాష్ట్రానికీ నష్టం జరగదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు చేపట్టిన నషా ముక్త్ భారత్ యాత్రకు ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
తమిళనాడులో సంచలనం సృష్టించిన మహిళా ఐఏఎస్ అధికారిణి వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన శుక్రవారం (నవంబర్ 27) సాయంత్రం జరిగే  ఎన్డీయే భాగస్వామ్య పక్షాల సమావేశంలో వీరు పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా ప్రధాని నరేంద్రమోడీ ఆహ్వానించడంతో వీరిరువురూ ఢిల్లీ పర్యటనకు బయలుదేరారు.
మదురై సమీపంలోని తిరుపరంకుండ్రం కొండపై ఉన్న దీపస్తంభం వద్ద శనివారం దీపం వెలిగించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
పార్లమెంట్ సమావేశాలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఇటీవలి కాలంలో ఆయన బీజేపీకి దూరంగా జరుగుతున్నారనీ, అదే సమయంలో ఇండియా కూటమికి దగ్గరౌతున్నారనీ వార్తలు వినవస్తున్న నేపథ్యంలో... కేంద్రంలోని ఎన్డీయే కూటమి పార్లమెంటులో డీ లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టడానికి సమాయత్తమైన తరుణంలో ఆయన మద్దతు ఇస్తారా ఇవ్వరా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.