Publish Date:Feb 24, 2025
ఆంధ్రప్రదేశ్ సర్కార్ వంశీకి మరో షాక్ ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అక్రమాలపై దర్యాప్తునకు సిట్ ఏర్పాటు చేసింది. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో సిట్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుతం గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడిని కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
ఆయనను పది రోజుల కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పు మేరకు ఆయనను పోలీసులు మూడు రోజుల పాటు తమ కస్టడీలోకి తీసుకుంటారు. ఈ మూడు రోజుల పాటూ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలీసులు వంశీని విచారిస్తారు. అనంతరం వంశీని మళ్లీ జిల్లా జైలుకు తరలిస్తారు. ఇక జైల్లో సౌకర్యాలపై వంశీ చేసిన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కోర్టు ఆయనకు జైలులో బెడ్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే వెస్ట్రన్ టాయిటెల్ సదుపాయం కూడా కల్పించాలని ఆదేశించింది.
అయితే పోలీసు కస్టడీకి అనుమతి ఇవ్వడంతో ఈ సదుపాయాల కల్పన వంశీకి పెద్ద ఊరట అని భావించలేము. గన్నవరం ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ అక్రమాలపై పలు ఫిర్యాదులు ఉన్నాయి. ముఖ్యంగా నియోజకవర్గంలో ఇసుక అక్రమ తవ్వకాలు, భూముల కబ్జా, తక్కువ ధర చెల్లించి సొంతదారులను బెదరించి భూములు సొంతం చేసుకున్నారన్న ఫిర్యాదులు, ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటిపైనా కూడా సిట్ దర్యాప్తు చేయనుంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/special-investigative-team-appointed-on-vallabaneni-vamshi-rregularities-25-193365.html
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది. సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
రాజకీయ నాయకులపై ప్రజలకు ఉండే అభిమానం ఒక్కోసారి అసాధారణ రీతిలో వ్యక్తమవుతుంది.
టాలీవుడ్ సినీ పరిశ్రమలో వరుస వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే పలువురు యంగ్ హీరోలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతుండగా
దీపావళి పండగ అనగానే ప్రతి ఇంటా సంబరాలు, బాణసంచా చప్పుళ్లు సర్వసాధారణం.
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
చెన్నై వేదికగా ఇటీవల వైఎస్ అనిల్ కుమార్ రెడ్డి కుమార్తె వివాహం ఎంతో వైభవంగా జరిగింది.
అప్పుడప్పుడే లోకాన్ని చూడటం మొదలుపెట్టింది. అమ్మా నాన్నల ఒడిలో గోరుముద్దలు తింటూ.. బుడిబుడి అడుగులు వేస్తూ ఆడుకోవాల్సిన వయసు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది. 25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు.
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు.
ప్రతిరోజూ ఉదయం మనం ఎంతో ఆరోగ్యకరమని భావించి తాగే పాలు అసలు సిసలైనవేనా? లేక ప్రాణాల మీదకు తెచ్చే విషపూరిత కల్తీ పాలా? అనే ప్రశ్న ఇప్పుడు హైదరాబాద్ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది
హైదరాబాద్ నగరంలో నిత్యం రాకపోకలు సాగించే లక్షలాది మంది ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.