స్పీక‌ర్ పదకొండు సెటైర్ వెనుక ఇంతుందా?

Publish Date:Feb 12, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డికి  2024 ఎన్నికల తరువాత నుంచీ  లెవ‌న్ రెడ్డి అనే  పేరు కూడా వచ్చి చేరింది.  వైసీపీ కార్యకర్తలు పార్టీ ర్యాలీల్లోనే ఈ పేరుతో నినాదాలు కూడా చేస్తుంటారు. ఇందుకు కారణం 2024 ఎన్నిక‌ల్లో ఆయన నాయకత్వంలోని వైసీపీ సాధించిన సీట్ల సంఖ్య 11  కావ‌డమే.  కొందరైతే ఆయనను   లెవ‌నాసుర అని కూడా అంటుంటారు. 

అది పక్కన పెడితే  తాజాగా జ‌గ‌న్ అసెంబ్లీకి ఇలా హాజరై, అలా వాకౌట్ చేసినప్పుడు   స్పీక‌ర్ అయ్య‌న్న  పాత్రుడు 11-11-11 అంటూ కామెంట్ చేశారు. ప‌ద‌కొండు మంది  ఎమ్మెల్యేల‌తో వ‌చ్చిన జ‌గ‌న్ 11 నిమిషాల  11 సెక‌న్లు మాత్ర‌మే ఉండి వెళ్లడంతోనే  స్పీక‌ర్ ఈ కామెంట్ చేశారని అంటారు. ఆ మధ్య ఒక సినిమా వేదిక‌పై   న‌టుడు పృధ్వీ ప‌ద‌కొండు గొర్రెలు అంటూ చేసిన కామెంట్ ఏ స్థాయిలో సంచలనం సృష్టించిందో..  ఆ కామెంట్ చేసిన పృధ్విని జగన్ సైన్యం, అంటే వైసీపీ శ్రేణులు ఎంతలా వేటాడి, వెంటాడి వేధించాయో కూడా తెలిసిందే. ఇందుకు కారణం మరేమీ కాదు.. 11 అన్న సంఖ్య అంటే జగన్ కు, ఆయన సామాజిక మాధ్యమ సైన్యానికీ కూడా అస్సలు గిట్టదు. ఈ సంఖ్య నినడానికీ, కనడానికీ కూడా వారికి భయం, బెదురు.  దీంతో ఎక్కడ 11 నంబర్ కనిపించినా, అది జగన్ ను ఉద్దేశించినదే అని వాళ్లకు వాళ్లు నిర్ణయించేసుకుని ఉడుక్కుంటుంటారు.  అంతెందుకు ఆయ‌న జైల్లో ఉన్న కాలాన్ని కూడా ప‌ద‌కొండుకు ముడిపెట్టి  నెటిజనులు సెటైర్లు వేస్తున్న పరిస్థితి. అలాగే ఆయన చట్టపరంగా ఎదుర్కొంటున్న కేసులలోనూ 11 నంబర్ మేజిక్ చేస్తూన్నదంటారు.  సీబీఐ ఆయ‌న‌పై వేసిన ఛార్జి  షీట్ల సంఖ్య 11. ఇక ఆ కేసుల్లో ఆయ‌న ఏవ‌న్ నిందితుడు.

 ఏ అంటే  న్యూమ‌రాల‌జీ  ప్ర‌కారం ఒక‌టి. వ‌న్ అంటే ఒక‌టి. ఈ రెండింటినీ ప‌క్క ప‌క్క‌న పెట్టి చూసినా ప‌ద‌కొండే  వ‌స్తుంద‌ని జగన్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ జరుగుతున్న సంగతీ విదితమే.  ఇక జ‌గ‌న్ వ‌రుస‌గా  11 శుక్ర‌వారాలు.. కోర్టుకు హాజ‌ర‌వ‌డం కూడా అప్ప‌ట్లో మీడియా బాగా హైలెట్ చేసింది. అయితే అది 11వ నెంబ‌ర్ గా కాకుండా శుక్ర‌వారంగా   ప్ర‌చారంలోకి వ‌చ్చింది. అది వేరే సంగతి.  ఒక‌ప్పుడు వైసీపీ  రాజ్య‌స‌భ స‌భ్యుల సంఖ్య కూడా 11 ఉండేది. ఇటీవ‌ల కొంద‌రు రిజైన్ చేయ‌డంతో ఆ సంఖ్య‌లో మార్పు వ‌చ్చింది.  అలాగే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ల్లోనూ, సీట్ల కేటాయింపుల్లోనూ, ప‌ద‌కొండవ నెంబ‌ర్ ఆయ‌న్ను వదల కుండా వెంటాడిందని అంటారు.   గ‌తంలో జ‌గ‌న్ ఢిల్లీ  వెళ్లిన‌పుడు ఆయ‌న‌కు కేటాయించిన నివాసం, లేదా ఆయ‌న  హోట‌ల్ రూం నెంబ‌ర్ కూడా  11. 

ఇక జ‌గ‌న్ లెవ‌న్ పై మీమ్స్ గురించి  చెప్ప‌న‌క్క‌ర్లేదు. పంజాబ్ కింగ్స్ లెవ‌న్ లాగా.. జ‌గ‌న్స్ బొ*గ్స్ లెవ‌న్ అనే  పేరు మీద కూడా కొంద‌రు మీమ్స్ గుప్పించారు.  ఇలా జ‌గన్ ని ప‌ద‌కొండో నెంబ‌ర్ ఇప్ప‌టి  నుంచే  కాదు ఎప్ప‌టి  నుంచో వెంటాడి వేధిస్తోంద‌ంటారు పరిశీలకులు.

By
en-us Political News

  
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
అయితే ఆమె కొత్త రాజకీయ పార్టీ ప్రకటన.. ఏపీ రాజకీయాలలో కూడా సంచలనం సృష్టించింది. ఆమె పార్టీ ప్రకటన వైసీపీకి ఒకింత ఇబ్బందికరంగా మారగా, తెలుగుదేశం, జనసేన పార్టీల్లో జోష్ ను నింపింది. టీడీపీ-జనసేన కూటమికి కవిత కొత్త పార్టీ ఒక గొప్ప వ్యూహాత్మక అవకాశాన్ని అందించినట్లయిందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది.
ఎమ్మెల్యేల పనితీరును ప్రజల నుంచే తెలుసుకోవాలని చంద్రబాబు నిర్ణయించారు. మే 1 నుంచే ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ప్రజల నుంచి వచ్చే స్పందన ఆధారంగా ఎమ్మెల్యేలు పనితీరు మార్చుకోవాల్సి ఉంటుందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసిటివి దృశ్యాలను టీవీలో చూసినప్పుడు తనకు అనుమానం కలిగిందనీ.. అందుకే స్వయంగా తనిఖీ చేయడానికి వచ్చానని మమతా బెనర్జీ తెలిపారు. అక్కడ జరుగుతున్న పరిణామాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి అయినా సరే ప్రజా తీర్పును కాపాడుకుంటామన్న మమతా బెనర్జీ.. ఓట్ల లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు.
తెలుగువన్ వాస్తవ వేదికలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులపై విస్తృత చర్చ జరిగింది.
తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ అధికారికంగా అడుగుపెట్టింది.
మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళలో, ఈ నెల 23న ఒకే విడతలో ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 71. బుధవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ ముక్తకంఠంతో యూడీఎఫ్‌కే అధికారమని అంచనా వేశాయి.
తమిళనాట అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 117 కాగా.. విజయ్ టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు గెలిచే అవకాశం ఉందని యాక్సిస్ మై ఇండియా సర్వే అంచనా వేసింది.
ప్రకాష్ రాజ్ తన విమర్శల్లో ప్రధానంగా పవన్ కళ్యాణ్ స్పందనల్లో ఉన్న వైవిధ్యాన్ని వేలెత్తి చూపారు. తిరుమల లడ్డూ వివాదంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాలని కోరుతున్న పవన్ కల్యాణ్.. గతంలో దేశాన్ని కుదిపేసిన ఇతర కీలక సంఘటనల సమయంలో ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు.
యాక్సిస్ మై ఇండియాతన అంచనాలలో తృణమూల్ కాంగ్రెస్‌కు స్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టింది. ఈ సంస్థ అంచనా ప్రకారం టీఎంసీ 165 నుంచి 185 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉండగా.. బీజేపీ 95 నుంచి 110 స్థానాలకే పరిమితం కావచ్చని ఆ సర్వే ఫలితం పేర్కొంది. ఇక సీ-ఓటర్ సర్వే కూడా మమతా బెనర్జీపైనే బెంగాల్ ప్రజలు విశ్వాసం ఉంచారని పేర్కొంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.