దక్షిణాఫ్రికా వరల్డ్ కప్ ఆశలు గల్లంతు.. నెదర్లాండ్స్ చేతిలో చిత్తు

Publish Date:Nov 6, 2022

Advertisement

వరల్డ్ కప్ విజయం దక్షిణాఫ్రికాకు మరో సారి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ఐసీసీ వరల్డ్ కప్ లో దక్షిణాఫ్రికా సెమీస్ కు చేరకుండానే టోర్నీ నుంచి వైదొలగింది. పసి కూన నెదర్లాండ్స్ చేతిలో 13 పరుగు తేడాతో పరాజయం పాలై టోర్నీ నుంచి ఔటైపోయింది. ఇన్నేళ్లుగా కలగానే మిగిలిపోయిన  వరల్డ్ కప్ ను ఈ సారి ఎలాగైనా సాధించి తీరాలని, ఐసీసీ టి20 వరల్డ్ కప్ విజేతగా నిలవాలని ఎన్నో ఆశలు పెట్టుకున్న దక్షిణాఫ్రికాకు  మరోసారి నిరాశే మిగిలింది.

గ్రూప్ బిలో నిన్నటి (నవంబర్ 5) వరకూ అగ్రస్థానంలో నిలిచిన దక్షిణాఫ్రికా ఆదివారం(నవంబర్ 6)న నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 13 పరుగుల తేడాలో పరాజయం పాలయ్యింది. దీంతో సఫారీల వరల్డ్ కప్ ఆశలు గల్లంతయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది.

159 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన దక్షిణాఫ్రికా ఛేదనలో చతికిల బడింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లకు కేవలం 145 పరుగులు మాత్రమే చేసి 13 పరుగుల తేడాతో మ్యాచ్ ని కోల్పోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. సఫారీలకు వరల్డ్ కప్ అందని ద్రాక్షే అన్న సంగతి మరో సారి రుజువైంది. అద్భుతమైన బ్యాటింగ్ తో 41 పరుగులు చేసి అజేయంగా నిలిచిన నెదర్లాండ్ బ్యాటర్ ఆకెర్మాన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

By
en-us Political News

  
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
ఆఫ్రికాలోని కాంగో నదిలో జరిగిన ఒక అత్యంత విషాదకరమైన పడవ ప్రమాదం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది.
తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఉక్కుపాదం మోపుతోంది.
ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం అనూహ్య నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురిచేసింది.
వైద్యశాస్త్ర రంగంలో ప్రపంచవ్యాప్తంగా అత్యున్నతంగా భావించే నోబెల్ బహుమతి ప్రకటన వెలువడింది.
ఢిల్లీలోని ప్రముఖ ప్రాంతమైన జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల సంఘం ప్రధానాధికారి (CEC) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్
చేతిలో రూ.3 లక్షలు.. ఇప్పుడు రూ.100 కోట్ల బిజినెస్.!
కేబీఆర్ పార్క్ ఫ్లైఓవర్ ప్రణాళికల్లో కీలక మార్పులు.. .!
కొందరు దుండగులు ఏకంగా జ్యువెలరీ షాప్‌నే టార్గెట్‌ చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.