నాలుగు కాళ్లు నాలుగు చేతులతో చిన్నారి.. సోనూ సూద్ సహకారంతో ఏం జరిగిందంటే..

Publish Date:May 29, 2022

Advertisement

ఆ చిన్నారి కష్టం పగవాడికి కూడా రాకూడదని ఆమెను చూసిన వారంతా అనుకున్నారు. జన్యు లోపం కారణంగా ఆ చిన్నారి పుట్టుకతోనే ఓ చిత్రమైన సమస్యతో బాధపడుతోంది. ఆమెకు అందరిలా రెండు చేతులు, కాళ్లతో కాకుండా పొట్ట భాగంలో మరో రెండు చేతులు కాళ్లతో పుట్టింది. జన్యులోపం కారణంగా విచిత్ర రూపంలో పుట్టినప్పటి నుంచీ బాధపడుతున్న ఆమెకు పెరుగుతున్న కొద్దీ బాధలు మరింత ఎక్కువయ్యాయి.

తోటి పిల్లలెవ్వరూ ఆమె రూపం కారణంగా దగ్గరకు రానివ్వడం లేదు. అందరిలా ఆడుకోలేక, అందరిలో కలవలేక ఇబ్బంది పడుతున్న ఆమెకు ఆపరేషన్ చేస్తే మామూలు మనిషి అవుతుందని వైద్యలు చెప్పారు. అప్పటి నుంచీ ఆ చిన్నారి తల్లిదండ్రులు దాతల కోసం, సాయం కోసం ఎక్కని గడప లేదు, తట్టని తలుపు లేదన్నట్లు తిరిగారు. రెక్కడితే కానీ డొక్కాడని ఆ కుటుంబానికి సొంత ఖర్చుతో తమ కూతురికి ఆపరేషన్ చేయించే స్తోమత లేదు.  ఆ చిన్నారి కష్టం సామాజిక మాధ్యమం ద్వారా నటుడు సోనూ సూద్ దృష్టికి వెళ్లింది.  

కరోనా సమయంలో ప్రభుత్వాలు పట్టించుకోని వలస జీవుల కష్టాలను కడతేర్చడానికి బస్సులు ఏర్పాటు చేసి, అవసరమైతే విమాన టికెట్లు కొనిచ్చి మరీ వారిని స్వస్థలాలక పంపడం ద్వారా సినీనటుడిగా విలన్ వేషాలు వేసినా.. దాతృత్వంలో, ఆపన్నులకు సహాయ హస్తం అందించడంలో హీరోననని చాటుకున్న సోనూ సూద్ ఆ తరువాత కూడా అవసరమైన వారికి సహాయం అందిస్తూనే ఉన్నాడు. సోనూ సూద్ సేవా కార్యక్రమాలను, ఆయనకు ప్రజల్లో వస్తున్న పలుకుబడిని ఓర్వలేని బీజేపీ నేతలకు కొందరు రాజకీయ స్టంట్ అంటూ విమర్శలు చేసినా పట్టించుకోలేదు.

కరోనా తరువాత కూడా ఆయన తన సేవాకార్యక్రమాలు కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ చిన్నారి కష్టం తెలియగానే ఆపరేషన్ చేయించడానికి ముందుకు వచ్చాడు.    బీహార్ కు చెందిన ఓ పేద కుటుంబానికి చెందిన ఓ చిన్నారి రెండున్నరేళ్లుగా వింత సమస్యతో బాధపడుతోందని, పొట్ట భాగంలో రెండు కాళ్లు, రెండు చేతులతో జన్మించిందపీ తెలుసుకుని వెంటనే ఆమె ఆపరేషన్ కు కావలసిన సహాయం అందించాడు. ఆ బాలిక పేరు చౌముఖి, బీహార్ లోని నెవాడా వాసి. సోనూ సూద్ సాయంతో చౌముఖికి వైద్యం అందుతోంది. త్వరలోనే ఆపరేషన్ చేస్తామనీ, ఆమె మామూలు మనిషి కావడం ఖాయమని వైద్యులు చెబుతున్నారు. చౌముఖికి వైద్యం అందుతున్న ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఆ చిన్నారిని ఆదుకోవడానికి ముందుకు వచ్చిన సోనూ సూద్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. 

By
en-us Political News

  
దేశ రాజధాని ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నేతల అరెస్టు వ్యవహారం తీవ్ర చర్చకు దారితీసింది
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అక్టోబర్ 13న ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించే అవకాశం ఉందన్న వార్తలు రాజకీయ, జలవనరుల వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
జాతీయ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
దేశ రాజధాని ఢిల్లీలో తీవ్ర రాజకీయ ఉద్రిక్తతలు నడుస్తున్న వేళ, కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
శ్రీవారికి జైపూర్ దంపతులు రూ.51.55 లక్షల ఆభరణాల కానుక.!
గోల్డ్ కొనాలన్న ఆశ.. బిడ్డను కోల్పోయిన విషాదం.!
ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్యకు హైదరాబాద్‌లో భూమి పేరుతో మోసం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీలో రాజకీయంగా ఉత్కంఠ నెలకొంది.
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.