సోనియా గాంధీ ఫిర్ ఏక్ బార్ ?!

Publish Date:Sep 28, 2022

Advertisement

అవును. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అటు తిరిగి, ఇటు తిరిగి చివరకు సోనియా చెంతకు చేరుతుందా? మరోసారి, ఆమె ఆ బాధ్యతలను భుజానికి ఎత్తుకోక తప్పదా? అంటే, అవుననే సమాధానమే వస్తోంది. నిజానికి, కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కుంటున్న బహుముఖ సంక్షోభం వెనక పైకి కనిపించే కోణం ఒకటైతే, అంతర్గతంగా వినిపిస్తున్నకథనం మరోలా ఉందని ఢిల్లీ రాజకీయ వర్గాల సమాచారం. పార్టీ పగ్గాలు కుటుంబేతరులకు అప్పగించేందుకు సోనియా గాంధీ ఎంత మాత్రం సుముఖంగా లేరు. అంతే కాదు, చివరకు ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు ఆమె మనసు అంగీకరించడం  లేదు. కూతురు మనమ్మాయే అయినా అల్లుడు మన వాడు కాదు, పైగా, అతగాడు మామూలోడు కూడా కాదు. నిజానికి, ఇప్పటికే పార్టీలో ఒక వర్గం వాద్రా కనుసన్నల్లో పనిచేస్తోందనే అనుమాన, భయాలు సోనియాను వెంటాడు తున్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సందర్భంగా, సోనియా గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టక తప్పని పరిస్థితిని సృష్టించి, తాత్కాలిక అనే ట్యాగ్ లైన్ తో బాధ్యతలు స్వీకరించారు.

ఇప్పుడు అదే పద్దతిలోనే మరో మారు, అదే పరిస్థితి క్రియేట్ చేసే దిశగా అడుగులు పడుతున్నాయని, పరిశీలకులు భావిస్తున్నారు. నిజానికి పార్టీ పగ్గాలు వదిలితే, ఇక మళ్ళీ పార్టీని తమ చెప్పు చేతల్లోకి తెచ్చుకోవడం అయ్యే పని కాదని సోనియా గాంధీ చాలా గట్టిగా నమ్ముతారనేది ఎవరూ కాదనలేని నిజం. నిజానికి, ఒక్క కాంగ్రెస్ అనే కాదు, ఏ కుటుంబ పార్టీ కూడా పార్టీ పగ్గాలు కుటుంబ వ్యక్తులకు అప్పగించరు. అలాంటిది  ఒకసారి పార్టీ పగ్గాలు వదిలితే ఎమౌవుతుందో అనుభవ పూర్వకంగా తెలుసు కున్న సోనియా గాంధీ, అందుకు అసలే ఇష్టపడరని అంటున్నారు. 

రాజీవ్ గాంధీ ఆకస్మిక మరణం తర్వాత, పీవీ నరసింహ రావు, సీతారాం కేసరికి పార్టీ ప్రభుత్వ పగ్గాలు వదిలేసిన సమయంలో ఎదురైన చేదు అనుభవాలు ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అందుకే 2019లో రాహుల్ గాంధీ క్లియర్ కట్ గా గాంధీ కుటుంబం బయటి వ్యక్తికి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని పట్టు పట్టినా ఆమె అది తమకు మోయలేని భారమే అయినా ఆ బరువు బాధ్యతలను నెత్తి కెత్తుకున్నారు. ఏదో ఒకనాటికి రాహుల్ గాంధీ మనసు మార్చుకుని పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తారని ఆశించారు. అయితే మూడేళ్లయినా, రాహుల్ తీరు మాలేదు. బాధ్యతలు లేని అధికారాలకు అలవాటు పడిన రాహుల్  పార్టీ అధ్యక్షుడు ఎవరైనా ఇప్పటిలానే, ఎప్పటికీ ‘అధినాయకుడు’ గా ఉండి పోయేందుకే నిర్ణయించుకున్నారు. 

ఈ నేపధ్యంలో విధేయుడు అనుకున్న అశోక్ గెహ్లాట్ ను, అధ్యక్ష పదవికి ఎంపిక చేస్తే ఎన్నికకు ముందే తిరుగుబాటు జెండా ఎగరేశారు. అఫ్కోర్స్, అది కూడా సోనియా స్క్రిప్ట్ లో భాగమనే వాదన మరొకటి ఉందనుకోండి అంది వేరే విషయం. గెహ్లాట్ తిరుగుబాటు, సోనియా  రాహుల్  స్క్రిప్ట్ ప్రకారం జరిగినా  గెహ్లాట్ స్వయంగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం కథ నడిపినా, సోనియా గాంధీ మరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించే  అవకాశం లేదని, అంతర్గత వర్గాల వర్గాల సమాచారం.అందుకే మళ్ళీ మరోమారు రాహుల గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలనే  రాగాలు మొదలయ్యాయని అంటున్నారు.

అలాగే కమల్ నాథ్, దిగ్విజయ్ సింగ్, ఏకే అంటోనీ, ముకుల్ వాస్నిక్, ఖర్గే వంటి మరికొందరు ‘విధేయుల’ పేర్లు ప్రచారం లోకి వచ్చినా, చివరకు రాహుల్ గాంధీ అంగీకరించని పక్షంలో మళ్ళీ  ఫిర్ ఏక బార్ సోనియానే పార్టీ చీఫ్ అంటున్నారు.  అయితే ఇది ఇంతవరకు జరిగిన కథ. ఇది ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో, చివరకు శుభం కార్డు ఎప్పుడు, ఎలా పడుతుందో ... చూడవలసిందే అంటున్నారు.

By
en-us Political News

  
తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఏబీ వెంకటేశ్వరరావు తమిళనాడులో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలను.. ముఖ్యంగా విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ సాధించిన విజయాలను ఏబీ వెంకటేశ్వరరావు ఆసక్తికరంగా విశ్లేషించారు. ఎవరూ ఊహించని మార్పులు రాజకీయాల్లో సంభవిస్తాయని, ప్రజలు మార్పును కోరుకున్నప్పుడు అసాధ్యం సుసాధ్యం అవుతుందని అన్నారు.
టీవీకే నేత ఆదవ అర్జునకు, వీసీకే అధినేత తిరుమావళవన్ స్వయంగా మద్దతు లేఖను అందజేశారు. ఈ కీలక పరిణామంతో అసెంబ్లీలో టీవీకే కూటమి సంఖ్యా బలం ఇప్పుడు 118కి చేరింది.
అధికారులు సచివాలయంలోని ఏసీ గదులలో కూర్చుని పని చేసే విధానానికి స్వస్థి చెప్పారు. అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ప్రసంగిస్తూ.. పౌరుల ఫిర్యాదులను నేరుగా క్షేత్రస్థాయిలో పరిష్కరించడానికి అధికారులు తమ కార్యాలయాలను విడిచిపెట్టి ప్రజల వద్దకు వెళ్లాలని ఆదేశించారు.
సువేందు అధికారి రాజకీయ నేపథ్యాన్ని పరిశీలిస్తే.. కాంగ్రెస్ సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన సువేందు, రాజకీయ ఓనమాలు అక్కడే నేర్చుకున్నారు. ఆయన తాత కెనరామ్ అధికారి స్వాతంత్ర్య సమరయోధుడు కాగా, తండ్రి శిశిర్ అధికారి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా రాణించారు. సువేందు అధికారి మమతా బెనర్జీ స్థాపించిన తృణమూల్ కాంగ్రెస్‌లో చేరి ఆ పార్టీలో కీలక నేతగా ఎదిగారు.
కరీంనగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ నాయకత్వం బంద్ పిలుపునిచ్చిన నేపథ్యంలో . శనివారం ( మే 9) ఉదయం నుండే నగరంలోని ప్రధాన కూడళ్లలో పోలీసులు భారీగా మోహరించారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నిరసనలో పాల్గొనకుండా పోలీసులు ఆయన ఇంటి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీనిపై బీఆర్ఎస్ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
ముఖ్యంగా పార్టీలో అభిషేక్ బెనర్జీ పెత్తనం పెరగడం వల్లే సువేందు అధికారి వంటి బలమైన నేతలు టీఎంసీని వీడారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులను కాదని, కార్పొరేట్ తరహా రాజకీయాలకు అభిషేక్ బెనర్జీ ప్రాధాన్యత ఇవ్వడం తృణమూల్‌కు ప్రతికూలంగా మారిందంటున్నారు.
ఆంధ్రోళ్లను తిట్టి ఓట్లు దండుకున్న బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ప్రాజెక్టుల పేరుతో దోపిడీకి పాల్పడిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రస్తుత ఎన్నికల ఫలితాలు కేరళలో పెను మార్పులకు నాంది పలికాయి. యూడీఎఫ్ స్పష్టమైన మెజారిటీ సాధించడంతో.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై కసరత్తు జరుగుతోంది. కేసీ వేణుగోపాల్ అనుభవం, రాహుల్ గాంధీతో ఉన్న సాన్నిహిత్యం ఆయనకు ప్రధాన బలంగా మారాయి.
టీవీకే అధినేత విజయ్‌కు కాంగ్రెస్ మద్దతు తెలపడంపై ఆగ్రహంగా ఉన్న డీఎంకే.. కాంగ్రెస్‌కు కటీఫ్ చెప్పేసింది. మారిన రాజకీయ పరిస్థితుల దృష్ట్యా, లోక్‌సభలో తమ పార్టీ సభ్యులకు కాంగ్రెస్ ఎంపీలతో కాకుండా విడిగా సీటింగ్ కేటాయించాలని డీఎంకే ఎంపీ కనిమొళి స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
తాజా సమాచారం ప్రకారం.. విజయ్ తన పార్టీకి ఉన్న బలానికి తోడుగా మరో మూడు పార్టీల మద్దతును కూడగట్టుకున్నారు. ఆ పార్టీల మద్దతుతో అధికారం చేపట్టడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 118ని ఆయన సాధించారు.
తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల తర్వాత, విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవ్వగా.. మెజారిటీ నిరూపణ విషయంలో రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్ కచ్చితమైన నిబంధనలు పాటించాలని పట్టుబడుతున్నారు. విజయ్ కు తన పార్టీ ఎమ్మెల్యేలు 107 మందికి అదనంగా కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు ఎమ్మెల్యేల మద్దతు కూడా ఉంది.
పదవి నుంచి తొలగించిన అనంతరం ఎస్వీఎస్ఎన్ వర్మ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ తీసుకున్న ఈ నిర్ణయం తనకు ముందే తెలుసని, నాయకత్వం నుంచి సమాచారం అందిందని చెప్పారు. అయితే పార్టీ కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడి.. క్షేత్రస్థాయిలో కేడర్‌ను కాపాడుకుంటూ వచ్చిన తనకు ఈ పరిణామం మనస్తాపానికి గురిచేసిందన్న ఆవేదన కూడా వ్యక్తం చేశారు.
బాబు కూటమిని ఎందుకంత విలువైన‌దిగా భావిస్తున్నారంటే.. కారణం వైసీపీ. ఆ పార్టీ కూట‌మి ఎప్పుడెప్పుడు చీలిపోతుందాని కాచుకుని కూర్చుని ఉంది. ఏ అవ‌కాశం వ‌చ్చినా వారు వ‌దిలిపెట్టినట్టే క‌నిపించ‌దు. మొన్న కోట వినుత ఘ‌ట‌న‌, నిన్న అర‌వ శ్రీధ‌ర్ వ్య‌వ‌హారం, ఇవాళ వ‌ర్మ ఇష్యూ.. ఇలా స‌మ‌యం దొరికిన‌పుడ‌ల్లా ఆయా అంశాల‌ను బాగా హైలెట్ చేసి.. కూట‌మిలో ఏదో ఒక చిచ్చు రాజేయాల‌ని చూస్తోంది వైసీపీ అధినాయ‌క‌త్వం.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.