సోనియా గాంధీతో వైఎస్ షర్మిల భేటీ..ఆసక్తికరంగా మారిన పుస్తకం బహూకరణ.!
Publish Date:Nov 11, 2026
Advertisement
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో షర్మిల తన భర్త అనిల్ కుమార్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన కుమార్తె అంజలి వివాహానికి హాజరుకావాలని కోరుతూ సోనియా గాంధీకి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. షర్మిల దంపతులను ఆప్యాయంగా పలకరించిన సోనియా గాంధీ.. ఈ సందర్భంగా తాను ఇటీవల రచించిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' (Belonging: A Journey of Love) పుస్తకాన్ని వారికి బహూకరించారు. అంతేకాదు, పుస్తకంపై స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి అందించడం విశేషం. ఇది కూడా చదవండి: విదేశీ మహిళ దేశాధినేత ఎలా అయ్యారు.. సోనియాపై కంగనా సంచలన వ్యాఖ్యలు.! సోనియా గాంధీ జీవిత ప్రయాణం, వ్యక్తిగత అనుభవాలు, కుటుంబ బంధాలు, భారత రాజకీయాల్లో ఆమె ఎదుర్కొన్న సవాళ్లను ఈ పుస్తకం ఆవిష్కరిస్తోంది. ముఖ్యంగా గాంధీ కుటుంబంలోని అనుబంధాలు, విభేదాలకు సంబంధించిన ఆసక్తికర అంశాలు ఇందులో ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా మేనకా గాంధీతో తనకు ఉన్న సంబంధాలు, కుటుంబంలో చోటుచేసుకున్న పరిణామాల గురించి సోనియా వెల్లడించిన విషయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ నేపథ్యంలో 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకంపై ఆసక్తి పెరుగుతోంది. మరోవైపు, సోనియా గాంధీతో షర్మిల భేటీ రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. కుమార్తె వివాహ ఆహ్వానం కోసం జరిగిన ఈ సమావేశంలో రాజకీయ అంశాలు కూడా చర్చకు వచ్చాయా? అన్న ఆసక్తి నెలకొంది. అయితే, ఈ భేటీలో రాజకీయ చర్చలు జరిగినట్లు అధికారిక సమాచారం లేదు. మొత్తానికి, ఒకవైపు కుమార్తె వివాహ ఆహ్వానం.. మరోవైపు సోనియా గాంధీ స్వయంగా ఆటోగ్రాఫ్ చేసి అందించిన పుస్తకం.. ఈ భేటీకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మీకు నచ్చవచ్చు: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత.. ఎయిమ్స్‌లో అత్యవసర చికిత్స.! [ Sonia Gandhi, YS Sharmila, Anil Kumar, Anjali Wedding, Belonging A Journey of Love, Maneka Gandhi ]
http://www.teluguone.com/news/content/sonia-gandhi-25-236872.html





