రాష్ట్రపతి ఎన్నిక.. ఉమ్మడి అభ్యర్థి కోసం కాంగ్రెస్ కసరత్తు

Publish Date:Jun 10, 2022

Advertisement

కాంగ్రెస్ లో కదలిక వచ్చింది. వచ్చే ఎన్నికలలో రాణించి పార్టీకి పూర్వ వైభవం తెచ్చుకోవాలంటే రాష్ట్రపతి ఎన్నికలలో ఏదో మేర ప్రభావం చూపించాల్సిందేనని తలపోసిన సోనియా గాంధీ బీజేపీయేతర రాజకీయ పార్టీలతో చర్చలకు ఉపక్రమించారు. రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ వెలువడిన వెంటనే ఆమె రంగంలోకి దిగారు.

ఒక వైపు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు తమ అభ్యర్థిని సొంతంగా గెలిపించుకునే మెజారిటీ లేకపోయినా షెడ్యూల్ విడుదలకు ముందే కసరత్తు ప్రారంభించేసింది. ఇప్పుడు షెడ్యూల్ వెలువడిన అనంతరం కాంగ్రెస్ అధినేత్రి విపక్షాల ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టి గెలిపించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీపీఎం, ఎన్సీపీ, తృణమూల్ పార్టీల అధినాయకత్వానికి స్వయంగా ఫోన్ చేసి సంప్రదింపులు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలో విపక్షాల ఉమ్మడి అభ్మర్థిని పోటీలో నిలబెట్టే విషయంలో చర్చలు జరిపారు. ప్రస్తుతం సోనియా గాంధీ కరోనాతో బాధపడుతూ ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్న కారణంగా ఆమె ప్రయత్నాలను ఫోన్ చర్చలకు  మాత్రమే పరిమితమైనా తదుపరి బాధ్యతను రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున్ ఖర్గేకు అప్పగించారు. ఉమ్మడి అభ్యర్థి విషయంలో కలిసి వచ్చే పార్టీలతో సంప్రదించేందుకు మల్లికార్జున్ ఖర్గే ఇక రంగంలోకి దిగుతారని కాంగ్రెస్ వర్గాలు చెప్పాయి.

శరద్ పవార్ తో సోనియా ఫోన్ లో మాట్లాడిన అనంతరం ఖర్గే ముంబైలో శరద్ పవార్ తో భేటీ అయ్యారు. అలాగే డీఎంకే, టీఎంసీ, శివసేన పార్టీల అధ్యక్షులతోనూ త్వరలో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. బీజేపీ యేతర పార్టీలన్నిటితో చర్చించి రాష్ట్రపతి ఎన్నికకు ఉమ్మడి అభ్యర్థిని నిలబెడతామనీ, ఆ అభ్యర్థి ఎవరన్నది పార్టీలతో చర్చల తరువాత ప్రకటిస్తామని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే బీజేపీయేతర పార్టీలకు నేతృత్వం వహించి ఉమ్మడి అభ్యర్థిని నిర్ణయించే పరిస్థితుల్లో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే లేదు. ఎన్నికలలో వరుస ఓటములతో ఎలక్టోరల్ కాలేజీలో ఆ పార్టీకి ఉన్న ఓట్ల విలువ బహుస్వల్పం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కాంగ్రెస్ కంటే కొన్ని ప్రాంతీయ పార్టీలకే ఎలక్టోరల్ కాలేజీలో ఎక్కువ ఓటు విలువ ఉంది.

దీంతో ఉమ్మడి అభ్యర్థి విషయంలో కాంగ్రెస్ చర్చల ప్రక్రియ ప్రారంభించినా.. నిర్ణయాత్మక పాత్ర పోషించే పరిస్థితిలో అయితే లేదు. ఇక బీజేపీయేతర పార్టీలు అన్నీ ఒకే గూటి కిందకు రావడం కూడా దాదాపు అసాధ్యంగా కనిపిస్తున్నది. ఇప్పటికే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ బీజేపీ అభ్యర్థికే మద్దతు ఇవ్వడం అన్నది ఖాయమైంది. అలాగే ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేడీ కూడా ఎన్డీయే అభ్యర్థివైపే మొగ్గు చూపుతుందన్న స్పష్టత ఇచ్చేసింది. ఇక టీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ పార్టీ ఉమ్మడి అభ్యర్థి విషయంలో తన వైఖరి ఏమిటన్నది ఇప్పటి వరకూ వెల్లడించకపోయినా.. ఆ పార్టీ అధినేత చొరవ తీసుకుని ముందుగా చేసిన ప్రయత్నాలకు స్పందన కరవవ్వడంతో ఆయన ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

ఆ పార్టీ వర్గాల నుంచి విశ్వసనీయంగా అందుతున్న సమాచారాన్ని బట్టి ఏదో విధంగా రాష్ట్రపతి ఎన్నికలకు టీఆర్ఎస్ దూరంగా ఉండేలా ఆయన నిర్ణయం ఉంటుంది. ప్రస్తుత రాష్ట్రపతి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం జులై 24వ తేదీతో పూర్తి కానుంది.   జులై 18న రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలను అదే నెల 21న కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది.

రాష్ట్రపతి ఎన్నికల్లో 4,809 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వారిలో రాజ్యసభ ఎంపీలు 233 మంది, లోక్‌సభ ఎంపీలు 543 మంది, ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో విప్‌ జారీ చేసేందుకు ఏ రాజకీయ పార్టీకి అధికారం లేని కారణంగా ఎన్డీయే పక్షాలు కూడా ఆత్మప్రభోదం మేరకు విపక్షాల ఉమ్మడి అభ్యర్థికి ఓటు వేసే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని కాంగ్రెస్ వ్యక్తం చేస్తున్నది. సాక్షాత్తూ బీజేపీలోనే మోడీ విధానాలను, వైఖరిని వ్యతిరేకించే ఎంపీల సంఖ్య అధికంగానే ఉందని పరిశీలకులు సైతం చెబుతున్నారు. దీంతో జులై 18న జరిగే రాష్ట్రపతి ఎన్నిక ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

By
en-us Political News

  
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్ల ఖరారు వంటి   కీలకమైన విధానపరమైన నిర్ణయాలు తీసుకునే నిమిత్తం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశానికి  జనసేన అధినేత, ఉప ముఖ్య మంత్రి  పవన్ కల్యాణ్‌తో పాటు జనసేన మంత్రుల గైర్హాజర్ పొలిటికల్ చర్చలకు వేదికగా మారింది.
2015లో ప్రారంభమైన ఈ పథకం కృష్ణా డెల్టా రైతులకు సాగునీటి భరోసా కల్పించడంలో కీలకంగా నిలిచింది.   కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి లభ్యతను స్థిరీకరించాలనే ఉద్దేశంతో నిర్మించిన పట్టిసీమ ప్రాజెక్టు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించింది.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న శ్రీనుకు విజయనగరం జిల్లా తెలుగుదేశం అధ్యక్ష బాధ్యతలను అప్పగించనున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఈ విషయంలో అధికారికంగా తెలుగుదేశం హై కమాండ్ నుంచి ఎటువంటి ప్రకటన కానీ, సంకేతం కానీ రాలేదు. 
బీజేపీ, తెలుగుదేశం పొత్తు విచ్చిన్నం చేయడంలో అప్పట్లో తాను సక్సెస్ అయ్యానని విజయసాయి రెడ్డి విస్పష్టంగా చెప్పడంతో.. అసలు నాడు ఈ రెండు పార్టీల పొత్త విచ్ఛిన్నం కావడానికి దారి తీసిన పరిస్థితులపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
నిన్నగాక మొన్న ఇదే మోడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించిన జగన్, ఇప్పుడు ఆదే మోడీ నాయకత్వాన్ని ప్రస్తుతిస్తూ ప్రశంసలు కురిపించడం ద్వంద్వ వైఖరి కాక మరేమిటని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు.
. ఇక షర్మిల విజయ్ ను కలిసి తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా కోరుతూ పెళ్లి శుభలేక అందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందు కంటే కేంద్ర స్థాయిలో కాంగ్రెస్ తో పొత్తు విషయంలో విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ కూడా కీలకంగా ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో కాంగ్రెస్ భాగస్వామి.  
లౌకిక స్వభావం కలిగిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి మతపరమైన అంశాలను జొపపించడానికి విజయసాయి ప్రయత్నిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక తమ ప్రసంగాల్లో, మీడియా సమావేశాలలో విజయసాయిరెడ్డి ప్రస్తావిస్తున్న అంశాలు ఆ విశ్లేషణలకుబలం చేకూరుస్తున్నాయి.
ఇప్పటికే తనపై 45 ఎఫ్ఐఆర్ లు ఉన్నాయన్న ఆయన తన టార్గెట్ వంద ఎఫ్ఐఆర్ లు అని చెప్పారు. అంతే కాదు.. వాటిని తాను ప్రజల పక్షాన నిలబడినందుకు దక్కిన మెడల్స్ గా భావిస్తానన్నారు. రాహుల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి.
విపక్షాల నిరసనల నేపథ్యంలో   పోలీసులు ఢిల్లీలో విస్తృత బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  పలు ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు వేలాది మంది భద్రతా సిబ్బందిని మోహరించారు. ట్రాఫిక్ మళ్లింపులు కూడా చేపట్టారు. జంతర్ మంతర్, పార్లమెంట్ పరిసరాలు, ఎన్నికల సంఘం కార్యాలయం వైపు వెళ్లే మార్గాల్లో ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. 
 ధనుష్‌ తన కొత్త రాజకీయ పార్టీ కోసం  తమిళగ ఎళుచ్చి కళగం అనే పేరును ఖరారు చేసినట్లు  ప్రచారం జరుగుతోంది. అలాగే.. ఈ పేరుతో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తయ్యిందని అంటున్నారు.
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.