సోనమ్ వాంగ్ చుక్ కు సంఘీభావంగా బెంగళూరులో విద్యార్థుల నిరవధిక దీక్ష.. ఎప్పటి నుంచంటే?

Publish Date:Jul 18, 2026

Advertisement

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విద్యా రంగ అక్రమాలు, పరీక్షల లీకేజీల వ్యవహారంపై విద్యార్థి లోకం సమర శంఖం పూరిస్తోంది. నీట్ లీకేజ్ కి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జంతర్ మంతర్ వద్ద  కొనసాగుతున్న ఆందోళనలు ఇప్పుడు రాష్ట్రాలకూ విస్తరిస్తున్నాయి.  ఈ క్రమంలోనే ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా భగ్నం చేయడాన్ని నిరసిస్తూ కర్ణాటక రాజధాని బెంగళూరులోని విద్యార్థులు   ప్రత్యక్ష పోరాటానికి రెడీ అయ్యారు.  సోనమ్ వాంగ్‌చుక్ పోరాటానికి మద్దతుగా తాము కూడా నిరశన దీక్ష చేపట్టనున్నట్లు  బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు ప్రకటించారు.  

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా దాదాపు  21 రోజుల పాటు సోనమ్ వాంగ్‌చుక్ నిరశన దీక్ష చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆయన దీక్షను శనివారం (జులై 18) పోలీసులు భగ్నం చేసి బలవంతంగా తరలించారు.  దీనిపై దేశ వ్యాప్తంగా విద్యార్థిలోకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం ేస్తున్నది.  

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్ మరియు దీక్ష భగ్నాన్ని  నిరసిస్తూ బెంగళూరు విశ్వవిద్యాలయ  విద్యార్థులు..  ఆయనకు  దేశంలో  విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం జరుగుతున్న పోరాటానికి సంఘీభావం ప్రకటిస్తూ తాము కూడా నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించి,  తన  ఆందోళన నిర్వహణకు అనుమతులు, ఇతర ఏర్పాట్ల కోసం విశ్వవిద్యాలయ అధికారులకు స్థానిక యంత్రాంగానికి  లిఖితపూర్వకంగా నోటీసులు అందజేశారు. ల 

ఈ మొత్తం వ్యవహారంపై ప్రముఖ నటుడు, విలక్షణ సామాజిక విశ్లేషకుడు ప్రకాష్ రాజ్ సామాజిక మాధ్యమాల వేదికగా స్పందించారు. బెంగళూరు యూనివర్సిటీ విద్యార్థులు తీసుకున్న  నిర్ణయాన్ని ప్రకాశ్ రాజ్ స్వాగతించారు. సోనమ్ వాంగ్‌చుక్,  కాక్రోచ్ జనతా పార్టీ దేశ రాజధానిలో చేస్తున్న న్యాయబద్ధమైన పోరాటానికి సంఘీభావంగా బెంగళూరు విద్యార్థులు సోమవారం (జులై 21) నుండి నిరవధిక నిరశన దీక్ష  ప్రారంభించబోతున్నట్లు ఎక్స్ ద్వారా వెల్లడించిన ప్రకాశ్ రాజ్   దేశంలో పాలకులను, వ్యవస్థలను జవాబుదారీగా ఉంచాలని కోరడంలో యువత చూపుతున్న ఇటువంటి అలుపెరుగని స్ఫూర్తి అభినందనీయమని  కొనియాడారు.  

Sonam Wangchuk Hunger Strike, Bengaluru University Students Protest, Prakash Raj Tweet, Dharmendra Pradhan Resignation Demand, Cockroach Janata Party Jantar Mantar

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.