ప్రశ్న రావణ్ రిమాండ్ పొడగింపు.!

Publish Date:Jul 18, 2026

Advertisement

సంచలన వ్యాఖ్యలు, వాదాస్పద డిజిటల్ కంటెంట్ ద్వారా వార్తల్లో నిలిచిన ప్రశ్న రావణ్ కు న్యాయస్థానంలో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.  విద్వేషపూరిత వ్యాఖ్యల ఆరోపణలపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణ చట్టం ఉపా  కింద నమోదైన కేసులో ఆయనకు లీగల్ రిలీఫ్ లభించలేదు. గన్నవరం న్యాయస్థానం శనివారం (జులై 18)  రావణ్ రిమాండ్‌ను పొడిగిస్తూ  ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఆయన మరికొన్ని రోజుల పాటు జైలులోనే గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఈ కేసు విచారణలో భాగంగా, ప్రస్తుతం నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న రావణ్‌ను పోలీసులు గన్నవరం కోర్టులో  వర్చువల్ విధానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా న్యాయస్థానంలో ఇరుపక్షాల లాయర్ల మధ్య సుదీర్ఘ వాదనలు జరిగాయి. నిందితుడిపై ఉన్న తీవ్రమైన ఆరోపణలపై దర్యాప్తు   కొనసాగుతున్నందున అతని రిమాండ్‌ను  పొడిగించాలని ప్రభుత్వ పక్ష న్యాయవాదులు కోరారు. మరో వైపు.. ప్రశ్న రావణ్ తరఫు న్యాయవాదులు తమ క్లయింట్ ఇప్పటికే తగినంత కాలం జైలులో ఉన్నాడనీ,  దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నాడని కోర్టుకు వివరించి బెయిలు మంజూరు చేయాలని కోరారు. ఇరు పక్షాల వాదనలూ విన్న న్యాయమూర్తి ప్రశ్న రావణ్ బెయిలు పిటిషన్ ను తిరస్కరించి రిమాండ్ పొడిగించారు.   

ప్రస్తుతానికి దిగువ న్యాయస్థానంలో ఆశించిన ఫలితం దక్కకపోవడంతో, రావణ్ న్యాయవాదులు ఇప్పుడు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తనపై రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే వరుస కేసులు పెట్టారని, వాటన్నింటినీ పూర్తిగా కొట్టివేయాలంటూ  క్వాష్ పిటిషన్  రావణ్ తరఫున ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో   పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టు పరిశీలనలో పెండింగ్‌లో ఉంది.

Prasna Ravan, Gannavaram Court, Remand Extension, UAPA Case, AP Police

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి మరోసారి చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.
తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటన కలకలం రేపింది.
ఢిల్లీ వేదికగా సాగుతున్న ప్రజా పోరాటంలో మరో కీలక అంకం మొదలైంది.
హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లో శనివారం హైడ్రా భారీ స్థాయిలో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌
ప్రముఖ కార్టూనిస్ట్ శేఖర్ స్మారకార్థం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన కార్టూనిస్ట్ శేఖర్ మెమోరియల్ అవార్డ్స్–2026 ప్రదానోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో విజేతలుగా నిలిచిన సినీ ప్రముఖులకు
ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఫిఫా ప్రపంచ కప్ తుది పోరు సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్రీడా ప్రేమికులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని.. విషసర్పంతో భర్త ప్రాణాలు తీసిన భార్య..!
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీ వేదికగా దేశ రాజకీయాల్లో ఊహించని హైడ్రామా చోటుచేసుకుంది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానా శ్రయంలో ఓ ప్రయాణికుడు చేసిన నిర్లక్ష్య వ్యాఖ్య తీవ్ర కలకలం రేపింది.
ప్రకృతి ప్రకోపం.. క్లౌడ్ బరస్ట్‌తో విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలు..!
నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం మునుకుంట్ల గ్రామంలో ఒకే రోజు చోటుచేసుకున్న రెండు విషాద మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.