మేదాంత ఆస్పత్రికి సోనమ్ వాంగ్చుక్ తరలింపు.!

Publish Date:Jul 22, 2026

Advertisement

 ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ పరిరక్షణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితి  విషమంగా ఉంది. విద్యార్థుల హక్కుల కోసం, విద్యా రంగంలో సంస్కరణల కోసం గత 24 రోజులుగా  నిరశన దీక్ష సాగిస్తున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో  ఆయనను హర్యానా గురుగ్రామ్ లోని మేదాంత ఆస్పత్రికి తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు సోనమ్ వాంగ్చుక్ ను మేందాంత ఆస్పత్రికి తరలించారు. 

ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా జూన్ చివరి వారంలో ఆయన నిరవధిక నిరశన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరాహార దీక్ష కారణంగా  ఆయన ఆరోగ్యం క్షీణించడంతో మూడు రోజుల కిందట ఆయనను పోలీసులు బలవంతంగా  ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆస్పత్రిలో కూడా ఆయన చికిత్స నిరాకరించి నిరశన కొనసాగించారు. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారింది. ఈ నేపథ్యంలో   ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ నేతృత్వంలోని ధర్మాసనం వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై మంగళవారం (జులై 21) అత్యవసర విచారణ జరిపింది. అనంతరం  ఆయన కోరిక మేరకు  హర్యానాలోని గురుగ్రామ్‌లోని  మేదాంత ఆసుపత్రికివెంటనే తరలించాలని ఆదేశించింది. 

వాంగ్‌చుక్‌కు నిరంతర, అత్యున్నత స్థాయి వైద్య పర్యవేక్షణ అత్యవసరమని ఎయిమ్స్, సఫ్దర్‌జంగ్ వైద్యులతో పాటు ఆయన వ్యక్తిగత వైద్య బృందం కూడా కోర్టుకు తెలిపారు.   ఇలా ఉండగా ఢిల్లీలో విద్యార్థులపై లాఠీఛార్జ్, నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజీ వంటి అంశాలపై ప్రభుత్వం స్పందించే వరకు తన  నిరశన విరమించేది లేదని సోనమ్ వాంగ్చుక్ స్పష్టం చేశారు. తనను మేదాంత ఆస్పత్రికి తరలించినప్పటికీ.. అక్కడ కూడా నిరశన కొనసాగిస్తానని పేర్కొన్నారు. 

Delhi High Court order, Medanta Hospital Gurugram, Hunger strike 24 days, Sonam wangchuk

By
en-us Political News

  
స్కూల్ యూనిఫాంలు పంపిణీ చేసిన త‌ర్వాత వాటి నాణ్య‌త‌, సైజు ఇత‌ర అంశాల‌పై ప్ర‌తి విద్యార్థి నుంచి వాట్సాప్ ద్వారా అభిప్రాయ సేక‌ర‌ణ (ఫీడ్ బ్యాక్‌)
చిత్తూరు జిల్లా పలమనేరు అటవీ ప్రాంతం నుంచి అల్లూరి సీతారామరాజు (మన్యం) జిల్లాకు తరలిస్తున్న శిక్షణ పొందిన కుంకీ ఏనుగులు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పోరు నెలకొంది.
కాజా గ్రామానికి చెందిన పెద్దకాపు సింహాద్రి వెంకటరామారెడ్డి పొలాల్లోని పాటి దిబ్బనుగురువారం (జులై 23) దున్నతుండగా రెండు చిన్న విగ్రహాలు నాగలి చాలు పైకి వచ్చాయన్న సమాచారం మేరకు శివనాగిరెడ్డి ఆ విగ్రహాలను పరిశీలించారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
హైదరాబాదు నగర పరిసరాల్లో ఆర్మీకి చెందిన భూములపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ రక్షణ శాఖ అధికారులు హైడ్రా కమిషనర్‌ను ఆశ్రయించారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే లక్ష్యంతో ప్రక్షాళన, విముక్తి, భద్రత అనే మూడు అంశాలపై కూటమి ప్రభుత్వం దృష్టి సారిస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు.
ఈ జనరేషన్‌కి ఎమోషనల్ కంట్రోల్ లేకపోవడమే నేరాలకు కారణమా..!
టెక్ మహీంద్రా కంపెనీ ముందు ధర్నాకు దిగిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి..
ముంబై నటి కాదంబరి జత్వానీ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర చలననాన్ని రేపింది.
వరంగల్‌లో మీడియా రిపోర్టర్లతో నిర్వహించిన చిట్‌చాట్ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు.
తన అనుచరులు, స్థానికులతో కలసి ప్రత్యేక వేదికపై కూర్చుని ఈ మౌన నిరసన చేపట్టారు. ఏలాంటి ఉపన్యాసాలు, నినాదాలు లేకుండా కేవలం మౌనంతోనే ఆయన నిరసన వ్యక్తం చేశారు. దేశ రాజథానిలో వేలాది మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం స్పందించకపోవడం దారుణమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేతులు మారిన ప్రతీసారీ రాయలసీమ సాగునీటి ప్రాజెక్టుల అంశం మళ్లీ రాజకీయ తెరపైకి వస్తుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.