కోడిగుడ్డు.. వెరీ‘గుడ్డు’.. అందులో అవినీతి గాడిద గుడ్డేనట!

Publish Date:Nov 11, 2020

Advertisement

బీజేపీ అధ్యక్షుడి ఆరోపణలపై గాలి తీసిన శుక్లా

 

ఒక్క ఫిర్యాదూ రాలేదని వెల్లడి

 

రాష్ట్రంలో సరఫరా చేస్తున్న కోడిగుడ్ల సరఫరాలో.. 700 కోట్ల అవినీతి జరుగుతోందన్న ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపణలో, ఏమాత్రం పస లేదని ఐఏఎస్ అధికారి గాలి తీసిన వైనమిది. పైగా.. రాష్ట్రంలో కోడిగుడ్ల సరఫరా అద్భుతమని ,స్వయంగా కేంద్రమంత్రి ఇచ్చిన కితాబును గుర్తు చేయడం ద్వారా.. సదరు బీజేపీ నేత ఆరోపణలో పసలేదని జగన్ సర్కారు చెప్పకనే చెప్పినట్లయింది. ఏమిటీ కోడిగుడ్ల లొల్లి అనుకుని తల గోక్కుంటున్నారా?..  అయితే ఓసారి అలా ఆ కోడిగుడ్డు కథలోకి వెళ్లొద్దాం రండి.

 

రాష్ట్రంలో జరుగుతున్న కోడిగుడ్ల సరఫరాలో అవినీతి జరుగుతోందని, దాదాపు 700 కోట్ల రూపాయల మేర జరిగిన అవినీతిపై,  విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు,  ఇటీవల రాజమండ్రిలో ఏర్పాటుచేసిన విలేక రుల సమావేశంలో డిమాండ్ చేశారు. ఆయన దానిపై మాట్లాడిన వెంటనే, మహిళా శిశు సంక్షేమ శాఖ డైరక్టర్ కృతికా శుక్లా తెర పైకొచ్చారు. 15 వేల మంది లబ్ధిదారులను సంప్రదించగా, ఏ ఒక్కరూ కోడిగుడ్ల నాణ్యతపై ఫిర్యాదు చేయలేదని వెల్లడించారు. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాల పనితీరును, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి కూడా ప్రశసించారని గుర్తు చేశారు. అసలు బడ్జెట్ మొత్తమే  423.43కోట్ల రూపాయలని తే ల్చడం ద్వారా, సోమును ఆత్మరక్షణలో నెట్టేసినట్టయింది.

 

కేంద్రం ఇటీవల నిర్వహించిన పోషణాభియాన్ సర్వేలో కూడా.. రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలు,  నూటికి నూరు శాతం బాగా పనిచేస్తున్నాయన్న వాస్తవం వెల్లడయిందని శుక్లా చెప్పారు. గుడ్ల సరఫరాలో మహిళా శిశు సంక్షేమ శాఖ పాత్ర లేదని, వాటిని పాఠశాల విద్యశాఖనే ఖరారు చేస్తోందన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, గుడ్లు తీసుకునే ముందు వాటి బరువు తనిఖీ చేసి, తక్కువ బరువున్న గుడ్లను వెనక్కి పంపుతారన్నారు.

 

కరోనా వల్ల..  గుడ్లను లబ్థిదారుల ఇళ్లకే పంపుతున్నామని, ఆ సందర్భంగా ఏ ఒక్కరూ ఇప్పటిదాకా వాటిపై ఫిర్యాదు చేయలేదన్నారు. దీనికోసం తాము టోల్‌ఫ్రీ నెంబర్  1148 ఏర్పాటుచేసి, ప్రతి 15 రోజులకోసారి లబ్థిదారుల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటున్నామని శుక్లా వివరించారు. పోషకాహారంగా అందిస్తున్న గుడ్ల కోసం 423.43 కోట్లు వార్షిక బడ్టెట్‌గా వాడుతున్నామని చెప్పారు. అందులో భాగంగా 92.40 కోట్ల గుడ్లు..  30.50 లక్షల మంది లబ్ధిదారులకు చేరుతున్నాయని వెల్లడించారు. కానీ సోము మాత్రం ఇటీవలి రాజమండ్రి విలేకరుల సమావేశంలో..  ఇందులో 700 కోట్ల అవినీతి జరిగిందని, ఆరోపించడం ప్రస్తావనార్హం.  

 

అంటే.. కృతికా శుక్లా వివరణ ప్రకారం.. బీజేపీ దళపతి సోము,  కోడిగుడ్లపై గత కొంతకాలం నుంచి చేస్తున్న ఆరోపణల్లో పసలేదని స్పష్టం చేసినట్లయింది. ఆయన తన పదవీ ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా,  కోడిగడ్ల అవివీతిని ప్రస్తావించడం విశేషం. పైగా స్వయంగా కేంద్ర మానవ వనురుల శాఖ మంత్రి,  పోషణాభియాన్ సర్వేలో కూడా కోడిగుడ్ల సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణపై రాష్ట్ర పనితీరును ప్రశంచారని, శుక్లా గుర్తు చేయడం మరో విశేషం. అంటే.. సోము వీర్రాజు వాదన ప్రకారం..  కేంద్రమంత్రికి గానీ, పోషణాభియాన్‌పై సర్వే చేసిన సంస్థలకు గానీ ఏమీ తెలియదని చెప్పకనే చెప్పినట్టయింది.

 

ఇప్పటిదాకా ఒక్కరు కూడా, కోడిగుడ్ల నాణ్యతపై ఫిర్యాదు చేయలేదన్న శుక్లా వివరణ కూడా, సోము వీర్రాజు ఆరోపణలను గాలి తీసినట్టయింది. మరి సోము ఏ లక్ష్యంతో,  ఈ ఆరోపణలు చేస్తున్నారో అర్ధం కావడం లేదని బీజేపీ సీనియర్ నేత ఒకరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి ప్రశంసించిన పథకంలో కూడా..  రాష్ట్ర అధ్యక్షుడు రంధ్రాన్వేషణ చేయడమే వింతగా ఉందని, దీనివల్ల కేంద్రమంత్రికి ఏమీ తెలియదన్న భావన ఏర్పడే ప్రమాదం ఉందంటున్నారు. 

-మార్తి సుబ్రహ్మణ్యం

By
en-us Political News

  
తెలుగు వన్ న్యూస్ నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ డీఎన్ ప్రసాద్ అడిగిన ప్రశ్నలకు టీపీసీసీ చీఫ్ పలు కీలక అంశాలపై సమాధానాలిచ్చారు.
జగన్ ఆలయ సంరక్షకుడిగా ఎప్పుడు మారారు అంటూ నెటిజనులు సెటైర్లు గుప్పిస్తున్నారు.  జగన్ హయాంలో ఆత్రేయపురం రథం దగ్ధం సహా పలు ఆలయాలలో జరిగిన అరాచకాలను గుర్తు చేస్తూ నిలదీస్తున్నారు. 
నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లు వంటి కీలక అంశాలు తెరమీదకు వచ్చిన నేపథ్యంలో శరద్ పవార్ పొలిటికల్ యాక్టివిటీస్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తమ రాజకీయ భవిష్యత్తుపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే ఆందోళన ఇప్పటికే పలువురు నేతలలో కనిపిస్తోంది.
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తనదైన శైలిలో చేసిన సంచలన వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపారు.
దక్షిణాది సినిమా రంగంలో సినీ తారలు రాజకీయాల్లోకి రావడం, అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలు చేపట్టడం   కొత్తేమీ కాదు. ముఖ్యంగా తమిళనాడు రాజకీయాల్లో సినీ నేపథ్యం, ప్రజాకర్షణ కలిగిన వ్యక్తుల చుట్టూ చర్చలు ఎప్పుడూ ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఈ నేపథ్యంలో త్రిష అభిమానుల బృందం చేపట్టిన ఈ అడుగు సర్వత్రా ఆసక్తిని చూరగొంది.
కరీంనగర్ గడ్డపై బీజేపీ కాషాయ దళం కదం తొక్కింది.
ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 
రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత   ప్రతి జిల్లాలోనూ పెట్టుబడులు, పరిశ్రమలు వస్తున్నాయని ఆయన సవివరంగా పేర్కొన్నారు. ఈ విషయంలో ఎక్కడైనా, ఎప్పుడైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు.
పంచాయతీ ఎన్నికలకు పొత్త ధర్మం వర్తించదని ఆ ప్రకటన పేర్కొంది.   గ్రామాభివృద్ధి, స్వేచ్ఛాయుత పాలన, మహాత్మాగాంధీ ఆశయాల సాకారం గ్రామీణ స్థాయి నుంచే సాధ్యమవుతాయని పేర్కొంది.   
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయడం వల్లే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి రాగలిగిందని బి.ఎం. సందీప్ కుమార్ పేర్కొన్నారు.
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.