కాపుల ఐక్యతను చెడగొడుతున్న సోము

Publish Date:May 17, 2023

Advertisement

కర్నాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు అటు కేంద్ర రాజకీయనేతలకు, ఇటు కర్నాటక రాష్ట్ర నేతలకు కొత్త పాఠాలు నేర్పించాయి. పనిలో పనిగా తెలుగు రాష్ట్రాల రాజకీయ నాయకులు కూడా పాఠాలు నేర్చుకోక తప్పలేదు. 

రెండు తెలుగు రాస్ట్రాలలోని రాజకీయ నాయకులు తమ పార్టీలను గెలిపించుకునేందుకు గత నెల రోజులుగా కర్నాటకలోనే మకాం వేశారు. అందునా అప్పుడు అధికారంలో ఉన్న బీజేపీ తెలుగువారు అధికంగా ఉన్న  నియోజకవర్గాలలో తెలుగు నాయకుల చేత ప్రచారం చేయించింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, హస్యనటుడు బ్రహ్మానందం అక్కడక్కడా ప్రచారం చేశారు. దాదాపు అన్ని చోట్లా బీజేపీ దుకాణం బంద్ అయ్యింది.  

ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుల వారిని ప్రత్యేకంగా చెప్పుకోవాలి.  కర్నాటకలో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతాలలో  ప్రచారానికి చేసి అక్కడ పార్టీని గెలిపిస్తానని మీసాలు తిప్పి రంగంలోకి దిగిన సోము వీర్రాజు తీరా ఫలితాలు వచ్చాక ఎవరికీ కనబడకుండా ముఖం చాటేశారు. కర్నాటకలో బలిజసామాజిక వర్గానికి నచ్చచెప్పడంతో పాటు తెలుగువారు, అందులో తన స్వంత సామాజిక వర్గానికి చెుందిన ఓటర్లను ఆకర్షించడంలో సోమువీర్రాజు అట్టర్ ప్లాప్ అయ్యారు. సోము వీర్రాజు ప్రచారం చేసిన సిద్దగట్లలో జేడీఎస్ అభ్యర్థి రవికుమార్ విజయం సాధించగా చింతామణి, చిక్ బల్లాపూర్, కోలార్, మలూరు, బంగారు పేటలల్లో కాంగ్రెస్ విజయ దుందుభి మ్రోగించింది. కాపులు అధికంగా ఉండే గౌరిబిదనూర్ లో కూడా సోము వీర్రాజును ఎవరూ నమ్మలేదు. అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థి పుట్ట స్వామిగౌడ్ గెలుపొందగా, బీజేపీ ఐదవ స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. 

కాపు సామాజిక వర్గానికి నాయకులం అని చెప్పుకున్న సోము వీర్రాజు వంటి వారి మాటలను కర్నాటక కాపులు నమ్మలేదు. కర్నాటకలో కన్నడ మాట్లాడే వారు 66శాతం మంది ఉండగా, 11శాతం మంది ఉర్దూ మాట్లాడతారు. మూడవ స్థానంలో తెలుగువారు 7శాతం మంది ఉన్నారు. మరాఠీలు మూడు శాతం, హింది 2.5 శాతం, కొంకణి 1.5శాతం మంది ఉన్నారు. ఇంకా మళయాళం, కొండవ భాషలు మాట్లాడే వారు కూడా ఉన్నారు. 7శాతం తెలుగు వారు ఉన్న కర్నాటకలో దాదాపు 30 అసెంబ్లీ సీట్లలో గెలుపును ప్రభావితం చేసే సత్తా ఉంది. అలాంటి ప్రాంతాలలో కూడా సోెము వీర్రాజు ఏమీ చేయలేకపోయారు.  కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేసే నాయకత్వం లేదన్న కొందరు పరిశీలకుల మాటలు ఇక్కడ గుర్తుకు రాక మానవు. బీజేపీ వంటి జాతీయ పార్టీకి రాష్ట్ర నాయకుడిగా వ్యవహరిస్తున్న సోము వీర్రాజు తన స్వంత సామాజిక వర్గాన్ని ప్రభావితం చేయలేకపోవడం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో 20 శాతం ఉన్న కాపులను సోము వీర్రాజు ఇసుమంతైనా ప్రభావితం చేయలేరనీ, రాష్ట్రంలో .99 శాతం ఉన్న బీజేపీ ఓటింగ్ ను కనీసం ఒక శాతానికైనా తీసుకురాగరా అని పరిశీలకులు అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర రాజకీయాల్లో గుణాత్మక పాత్ర పోషిస్తానని చెబుతున్న జనసేన ఈ అనుభవాలను పరిగణనలోనికి తీసుకోవాలని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎంతో మంది నేతలు ఉన్ని కర్నాటక ప్రచారానికి  వారందరూ దురంగా ఉండడాన్ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

By
en-us Political News

  
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
వికారాబాద్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన అనంతగిరి హిల్స్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.