కబ్జా లీడర్ మనకెందుకు! బీజేపీలో ఈటల చిచ్చు..

Publish Date:May 27, 2021

Advertisement

కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన సీనియర్ నేత ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ వచ్చేస్తోంది. సొంత పార్టీ పెడుతారని ప్రచారం సాగినా... ఇప్పుడు మాత్రం సీన్ మారింది. ఈటల రాజేందర్ కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలో చేరడం దాదాపుగా ఖరారైందని తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేతలతో పాటు తెలంగాణ నాయకులతో ఈటల చర్చలు ఫలవంతం అయ్యాయని చెబుతున్నారు. బీజేపీ  హైకమాండ్ టైం ఇచ్చిన వెంటనే ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లి కాషాయ కండువా కప్పుకుంటారని పక్కాగా తెలుస్తోంది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా ఇదే సంకేతమిచ్చారు. 

కాంగ్రెస్ నేతలు ఆహ్వానిస్తున్నా అటు వెళ్లనీయకుండా... కొత్త పార్టీ పెట్టాలని భావించిన ఈటలను తమ పార్టీలో చేర్చుకోవడంలో సక్సెస్ అయ్యామనే సంతోషంలో ఉన్న తెలంగాణ బీజేపీకి.. ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. ఈటల రాజేందర్ చేరిక బీజేపీలో సెగలు రేపుతోంది. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కమలం నేతలు అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జిల్లాకు చెందిన తమకు సంప్రదించకుండానే ఈటలను ఎలా చేర్చుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇంత కాలం రాజేందర్ తో పోరాటం చేస్తున్న తమను పట్టించుకోకుండా హైదరాబాద్ లో కూర్చుని రాష్ట్ర నేతలు నిర్ణయం తీసుకోవడం ఏంటని మండిపడుతున్నారు.

ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గం హుజురాబాద్. ఆ నియోజకవర్గానికే చెందిన మాజీ మంత్రి పెద్ది రెడ్డి... ఇప్పుడు బీజేపీలో కీలక నేతగా ఉన్నారు. టీడీపీలో కీలక నేతగా వ్యవహరించిన పెద్దిరెడ్డి... హుజురాబాద్ నుంచి పలుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఏడాది క్రితం పెద్దిరెడ్డి బీజేపీలో చేరారు. కమలం పార్టీలో యాక్టివ్ గా ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక.. ఇటీవలే జరిగిన గ్రేటర్ వరంగల్ సహా మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు మోశారు. ఎన్నికల తర్వాత కోవిడ్ సోకడంతో తీవ్ర ఇబ్బందులు కూడా పడ్డారు. హుజురాబాగ్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత అయిన పెద్దిరెడ్డిని కూడా ఈటల విషయంలో పార్టీ పెద్దలు సంప్రందించలేదట. ఇదే ఇప్పుడు బీజేపీలో సెగలు రేపుతోంది.

సీనియర్ నేత పెద్దిరెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈటల కోసం తమ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని కామెంట్ చేశారు. అంతేకాదు తాను కబ్జాలు చేయలేదని, ఆలయ భూముల్లో గౌడౌన్లు కట్టలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు ఈటల టార్గెట్ గానే చెప్పినట్లు భావిస్తున్నారు. ఈటల రాజేందర్ పై భూకబ్జా ఆరోపణలతో మంత్రివర్గం నుంచి తొలగించారు కేసీఆర్. ఇప్పుడు బీజేపీ నేత పెద్దిరెడ్డి కూడా ఆ ఆరోపణలే చేయడం కమలనాధుల్లో కలవరం రేపుతోంది. ఈటలకు మాత్రం ఆత్మ గౌరవం ఉంటుందా.. మాకు ఉండదా అంటూ రాష్ట్ర బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నారు పెద్దిరెడ్డి. పార్టీ నేతల తీరు మారకపోతే తాము కూడా సీరియస్ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. పెద్దిరెడ్డే కాదు హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ నేతలంతా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. 

సీనియర్ నేత పెద్దిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీలో కలవరం  రేపుతున్నాయని అంటున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను.. అవి తేలకముందే పార్టీలో చేర్చుకోవడం సరికాదనే వాదన మరికొందరు నేతల నుంచి కూడా వస్తుందట. ముఖ్యంగా దేవరయాంజల్ ఆలయ భూములు కబ్జా చేశారనే ఆరోపణలు రాజేందర్ పై ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన భూముల పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన బీజేపీ నేతలు.. కబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతను పార్టీలో చేరుకుంచే జనంలోకి రాంగ్ మెసెజ్ వెళ్లే అవకాశం ఉందని కూడా కొందరు బీజేపీ నేతలు చెబుతున్నారట. మొత్తానికి ఈటల రాజేందర్ ఎపిసోడ్ తో తెలంగాణ బీజేపీలో ముసలం ముదురుతుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.