తెలంగాణలో ఒంటరి పోరే.. పోత్తులుండవు.. కుండబద్దలు కొట్టిన అమిత్ షా!
Publish Date:Jun 10, 2026
Advertisement
వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఢిల్లీలోని భారత మండపంలో మంగళవారం (జూన్ 9)న మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన అమిత్ షా.. తెలంగాణలో ఎటువంటి పొత్తులూ ఉండవన్నారు. ఒక్క తెలంగాణ అని కాదు, ఏ రాష్ట్రంలోనైనా ఒంటరిగానే బరిలోకి దిగుతామని చెప్పారు. ఆ దిశగా ముందు.. తెలంగాణ, పంజాబ్ రాష్ట్రాల్లో వచ్చే ఎన్నికలలో ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నట్లు చెప్పారు. బీజేపీని దక్షిణ భారతదేశంలో బలోపేతం చేయడంపై పక్కా వ్యూహంతో ఉన్నట్లు అమిత్ షా చెప్పారు. ప్రస్తుతం తాము దక్షిణాది రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లు చెప్పిన ఆయన కొంత మంది ఇది అసాధ్యంగా భావిస్తున్నారనీ, అయితే.. గతంలో కూడా ఇలాంటి ఎన్నో అసాధ్యాలను సుసాధ్యం చేసిన చరిత్ర బీజేపీదని చెప్పుకొచ్చారు. పశ్చిమ బెంగాల్ లో కఠినమైన పరిస్థితుల మధ్య తాము మంచి ఫలితాలను రాబట్టామని చెప్పారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో యూనిఫాం సివిల్ కోడ్ అమలు చేస్తామని ఆయన చెప్పారు.
http://www.teluguone.com/news/content/solo-fight-in-telangana-39-222412.html





