అవినీతి కూపంలో యుపీయే ప్రభుత్వం

Publish Date:Apr 30, 2013

Advertisement

 

దేశంలో ఒకరు ఇనుప గనులు మేసేవారయితే మరొకరు బొగ్గు గనులు మేసేవారున్నారు. బొగ్గు గనుల కేటాయింపులలో జరిగిన అక్రమాలపై సీబీఐ తయారుచేసిన రిపోర్టును సుప్రీం కోర్టుకు సమర్పించే ముందుగా వేరెవరికీ కూడా చూపించలేదని గట్టిగా నొక్కి చెప్పిన అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్, సీబీఐ డైరెక్టర్ రంజిత్ సింగ్ స్వయంగా తమ రిపోర్టును న్యాయశాఖ మంత్రి అశ్విని కుమార్, బొగ్గు శాఖ మరియు ప్రధాని కార్యాలయానికి చెందిన మరో ఇద్దరికి ఆ రిపోర్ట్ చూపించడమే కాకుండా, వారి సూచనల ప్రకారం ఆ నివేదికలో చాలా మార్పులు కూడా చేశామని చెప్పడంతో సుప్రీం కోర్టు ఆగ్రహానికి గురయి రాజీనామా చేయవలసి వచ్చింది.

 

ఇక, రంజిత్ సింగ్ కోర్టులో మరో భయంకర నిజాన్ని కూడా బయటపెట్టారు. సీబీఐ స్వతంత్ర సంస్థ అయినప్పటికీ, అది కూడా ప్రభుత్వంలో భాగమే గనుక 'దాని విచారణలపై ప్రభుత్వ ప్రభావం అనివార్యమని' స్పష్టం చేయడంతో ప్రభుత్వం కూడా ఇబ్బందికర పరిస్థితుల్లో పడింది. తానూ ఈ నెల 6వ తేదీన కోర్టుకు సమర్పించే అఫిడవిట్ లో సీబీఐ తయారుచేసిన ‘అసలు నివేదిక’, ‘మార్పులు చేయబడిన నివేదిక’లను సమర్పిస్తానని ఆయన కోర్టుకి తెలియజేసారు. ఆ విధంగా మార్పులు చేసిన వారి పేర్లను కూడా తన అఫిడవిట్ లో తెలియజేస్తానని ఆయన తెలిపారు.

 

ఇంత కాలం పార్లమెంటులో ప్రతిపక్షాలు న్యాయశాఖా మంత్రి అశ్విని కుమార్ మరియు ప్రధాని డా. మన్మోహన్ సింగ్ రాజీనామాలకు ఎంతగా పట్టుబట్టినా కూడా లొంగని ప్రభుత్వానికి, ఇప్పుడు సుప్రీం కోర్టులో చివాట్లు, హరేన్ రావల్ రాజీనామా మరియు సీబీఐ డైరెక్టర్ తాజా వివరణ పెద్ద ఇరకాటంలో పడేశాయి. ఇక తప్పనిసరి పరిస్థితి వస్తే న్యాయశాఖా మంత్రి ఆశ్విని కుమార్ ను పదవి నుండి తప్పించడంద్వారా, యుపీయే ప్రభుత్వం ఈ గండం నుండి బయటపడే ప్రయత్నం చేయవచ్చును.

 

ఇదంతా యాదృచికంగా కర్ణాటక ఎన్నికల సమయంలోనే జరగడంతో కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందికరంగా మారింది. కర్ణాటక రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ప్రభుత్వం హయంలో అవినీతి పెరిగిపోయిందని, రాష్ట్రాన్ని గాలి సోదరులు కొల్లగొట్టారని, అందువల్ల తమ పార్టీకి ఓటువేస్తే స్వచ్చమయిన ప్రభుత్వం, పాలన అందిస్తామని ప్రచారం చేసుకొంటున్న కాంగ్రెస్ అధినేతలు, ఇప్పుడు స్వయంగా బొగ్గు కుంభకోణంలో చిక్కుకోవడమే కాకుండా, దాని నుండి బయట పడే ప్రయత్నంలో ఏ ప్రభుత్వము సాహసించని విధంగా సీబీఐ నివేదికలను కూడా తమకు ఇబ్బందిలేని విధంగా మార్పులు చేసుకొని మరో పెద్ద తప్పు చేస్తూ సాక్షాత్ సుప్రీం కోర్టుకే దొరికిపోయారు. అయినాకూడా  చేసిన తప్పుకి సిగ్గుపడకపోగా, ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తూ తప్పును కప్పిపుచ్చుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

 

ఈ సమస్య నుండి బయటపడేందుకు యుపీయే ప్రభుత్వం ముందుగా సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్ ను పదవి నుండి తప్పించి ఉండవచ్చును. తరువాత మరీ తప్పనిసరయితే న్యాయశాఖా మంత్రిని కూడా పదవి నుండి తప్పించవచ్చును. కానీ, అవి చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తం అవుతుంది తప్ప శిక్ష మాత్రం కాదు. ఇదివరకు బయటపడిన 2జి స్పెక్ట్రం కుంభకోణంలో, దోషిగా నిలబడిన మాజీ టెలికాం మంత్రి ఎయస్. రాజా బెయిలు మీద బయటపడి తను నోల్లుకొన్న సొమ్ముతో హాయిగా బ్రతుకుతున్నాడు. తనను వేలెత్తి చూపనంత కాలం నిశబ్దంగా ఊరుకొన్నఆయన, పార్లమెంటరీ కమిటీ తనను వేలెత్తి చూపగానే, "నేను ప్రధాని డా. మన్మోహన్ సింగ్ కి, ఆర్ధిక మంత్రి చిదంబరానికి కూడా అన్ని సవివరంగా చెప్పి వారి అనుమతి పొందిన తరువాతనే ‘ఈ తప్పు’ చేశాను. గనుక, నేను దోషినయితే వారు కూడా దోషులేనని" ఆయన గట్టిగా బదులీయడమే కాకుండా, అవసరమయితే తన ఆరోపణలను స్వయంగా కోర్టులో కూడా నిరూపించగలనని సవాలు విసిరారు. కానీ, జేపీసీ తప్పు పట్టిన ఆయనకు శిక్ష పడలేదు. ఆయన తప్పు పడుతున్న ప్రధానికి, ఆర్ధిక మంత్రికి కూడా శిక్ష పడలేదు. అవినీతి జరిగిన విషయం అందరికీ తెలుసు. అదే ఈ లక్షల కోట్ల కుంభ కోణంలో సాదించిన ప్రగతి. ఎవరికీ శిక్షలు లేవు. జరిగిన నష్టానికి పరిహారము వసూలు అవ(లే)దు.

 

ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే అనుకొంటే దానికి మరో కొనసాగింపుగా ఇప్పుడు ఈ బొగ్గు కుంభకోణం బయట పడింది. కానీ అంతా షరా మామూలుగానే మొదలయి మామూలుగానే ఇదికూడా ముగుసిపోతుంది.

 

ఈ విధంగా వరుసపెట్టి బయటపడుతున్నకుంభకోణాలలో దేశంలో అత్యున్నత పదవులలో ఉన్నవారే దోషులుగా నిలబడుతుంటే అటువంటి వారినుండి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి వ్యవస్థ ఉండాలి? ఎవరు ఏర్పాటు చేస్తారు?

By
en-us Political News

  
కేంద్రకేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. దీనికి ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ఏకైక డిమాండ్‌తోనే ఈ కాక్రోచ్ ఉద్యమకారులు ముందుకు వెళ్తున్నారన్న డోలేంద్ర ప్రసాద్.. అయితే దీనికి నిర్దిష్టమైన ఆర్గనైజ్డ్ పద్ధతి లేకపోవడం వల్ల ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతోందన్నారు.
జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ హడావిడి వెనుక సాయికృష్ణ కుటుంబంపై ప్రేమ ఎంతమాత్రం లేదని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ స్పష్టం చేశారు. జగన్ అసలు టార్గెట్ సీఐ నాగరాజు కాదనీ.. ఆయన ప్రధాన లక్ష్యం విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు అని విశ్లేషించారు.
అధికార కూటమికి చెందిన నాయకులు, చివరికి హోం మంత్రి సైతం క్షేత్రస్థాయికి వెళ్లి బాధితులను పరామర్శించకపోవడం, సరైన క్లారిటీ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చేలా ప్రవర్తిస్తున్న అధికారుల తీరుపై ఆయన మండిపడ్డారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ బాస్ ను ఆదేశించారు.
ఒక బలమైన ప్రజాధారణ కలిగిన సరికొత్త వేదిక ఏర్పడితే ప్రజలు ఆదరించేందుకు సిద్ధంగా ఉన్నారా? అన్న చర్చ జోరుగా సాగుతోంది.
లకమైన రాజ్యాంగ సవరణ బిల్లులను ప్రతిపక్షాల మద్దతుతో సంబంధం లేకుండా.. స్వతంత్రంగా ఆమోదింప చేసుకోవడమే ఈ వ్యూహం వెనుక ఉన్న అసలు రహస్యం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో కలిపి ఇప్పటికే దాదాపు 20 లక్షల మందికి పైగా సభ్యులు జనసేనలో చేరారనీ.. ఈ బలంతో తెలంగాణ రాజకీయాల్లో తమ ఉనికిని గట్టిగా చాటుతామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలతో పాటు, 2028లో జరగబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పోటీకి దిగుతుందని పవన్ ప్రకటించడం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.
ఏపీ రాజకీయాలలో కాపు సామాజికవర్గం ఓటు బ్యాంకుకు ఎన్నికల ఫలితాలను తారుమారు చేయగలిగే సత్తా ఉంది. అటువంటి కాపు సామాజికవర్గం విషయంలో జగన్ అనుసరిస్తున్న వ్యూహం మొదటికే మోసం తెచ్చేలా ఉందన్న ఆందోళన వైసీపీ వర్గాలలో వ్యక్తం అవుతున్నది.
శివసేన ఏక్ నాథ్ షిండే, శివసేన ఉద్ధవ్ థాక్రే వర్గాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. పార్టీ వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాకరే అసలైన వారసులం తామేనంటూ మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే వర్గం, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని యూబీటీ వర్గం పోటాపోటీగా భారీ బహిరంగ సభలను నిర్వహించడంతో ముంబైలో ఉద్రిక్తతలు పీక్స్ కు వెళ్లాయి.
విజయవాడ కృష్ణలంక ప్రాంతానికి చెందిన సాయికృష్ణ అదృశ్యం కేసు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. 2024 ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీకి సాయికృష్ణ అదృశ్యం ఘటనను అందివచ్చిన అవకాశంగా భావించి.. పొలిటికల్ మైలేజీ గెయిన్ చేయడానికి శతధా ప్రయత్నించింది. అయితే చంద్రబాబు తన చాణక్యంతో ఆ ప్రయత్నాలకు చెక్ పెట్టారు.
తెలంగాణ రాజకీయాల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం మరోసారి తీవ్ర ఉత్కంఠకు వేదికగా మారింది.
వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో కొడాలి నాని అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లపై తీవ్రస్థాయిలో వ్యక్తిగత దూషణలు, అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యాఖ్యలు రాజ్యాంగ నిబంధనలకు, చట్టానికి వ్యతిరేకంగా ఉన్నాయంటూ దాఖలైన ఫిర్యాదులపై సుదీర్ఘంగా సమీక్షించిన ప్రభుత్వం.. తాజాగా ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం గమనార్హం. దీనితో ఆయన అరెస్టయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు.
కేసుకు కులాన్ని ఆపాదిస్తూ వైసీపీ నాయకులు అంబటి రాంబాబు, కొరసాల కన్నబాబు, తోట త్రిమూర్తులు వంటి పెద్దలు కాపు కుల మీటింగ్‌లు పెట్టాలని చూడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సాయికృష్ణపై గతంలో దాదాపు 22 క్రిమినల్ కేసులు, పోక్సో చట్టం కింద కేసులు ఉన్నాయని, సమాజానికి హానికరమైన ఒక నేరచరిత్ర ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి కాపు యువకుడిగా ముద్ర వేయడం ద్వారా మొత్తం కులానికి అప్రతిష్ట తెస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా సాగుతున్న కులాల వ్యూహాలను విశ్లేషించారు. దేశంలో రాజ్యాంగం కల్పించిన రక్షణలు, సామాజిక మార్పుల వల్ల నేడు పల్లెల్లో సైతం కుల వివక్ష దాదాపు అంతరించిపోయిందన్నారు. కానీ.. ఒక వ్యూహం ప్రకారం కొన్ని రాజకీయ పార్టీలు నిర్దిష్ట సామాజిక వర్గాలను టార్గెట్ చేస్తూ, మిగిలిన వర్గాల్లో వారిపై ద్వేషం పెంచేలా వాటిని బూచి గా చూపిస్తూ రాజకీయ పబ్బం గుడుపుకోవాలని చూస్తున్నాయన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.