Publish Date:Jan 16, 2025
కొత్త పరిశ్రమల ఏర్పాటు మాట అటుంచి రాష్ట్రం నుంచి ఉన్న పరిశ్రమలే తరలిపోయిన పరిస్థితి గత ఐదేళ్లలో జగన్ హయాంలో చూసిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పుడు పరిశ్రమలు క్యూకడు తున్నా యి.ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు అత్యంత భద్రమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుం టున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికత, ఆయన ప్రభుత్వ పారిశ్రామిక విధానం కారణంగా రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నాయి. అదే విధంగా కేంద్రం నుంచి రావలసిన ప్రాజెక్టులు కూడా ఒకదాని వెంట ఒకటి అన్నట్లుగా రాష్ట్రానికి తరలి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రాజెక్టులు, ఒప్పందాలు, శంకుస్థాపనలతో రాష్ట్ర పారిశ్రామిక రంగం కొత్త ఉత్సాహంతో పరుగులు తీస్తున్నది. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు మరో కీలక ప్రాజెక్టు రానుంది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద సౌర ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధమైంది.
10 వేల కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో ఆసియాలోనే అతి పెద్ద సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ ముందుకు వచ్చింది. ఈ ప్రాజెక్టును కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న రిలయన్స్ ఎన్ యూ సన్ టెక్ ఇందు కోసం భూముల పరిశీలన చేస్తున్నది. ఈ ప్రాజెక్టు కోసం రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ రూ.10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. 930 మెగావాట్ల సోలార్ విద్యుత్తు ప్లాంట్‌తో పాటు 465 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే వేయి మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. పరోక్షంగా మరో ఐదు వేల మందికి ఉపాధి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
సెకితో కలిసి రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా పాతికేళ్ల కాలానికి విద్యుత్ కొనుగోలు చేసేలా సెకి ఒప్పందం చేసుకోనుంది. రిలయన్స్ ఎన్‌యూ సన్‌టెక్ కర్నూలులో ఏర్పాటు చేసే ప్రాజెక్టు ద్వారా ఉత్పత్తి అయిన సోలార్ విద్యుత్‌ను దేశంలోని వివిధ విద్యుత్ పంపిణీ సంస్థలకు సరఫరా చేయనున్నారు. బిల్డ్ ఓన్ ఆపరేట్ -బీఓటీ విధానంలో ఈ సోలార్ విద్యుత్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/solar-power-plant-in-ap-25-191346.html
రాష్ట్రంలో బీఆర్ఎస్ రెండుసార్లు, కాంగ్రెస్ ఒకసారి అధికారంలోకి వచ్చాయనీ, ఆ రెండు ప్రభుత్వాల వైఫల్యాలనూ గమనించిన తెలంగాణ ప్రజలు వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అధికారం కట్టబెట్టాలని ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చేశారన్నారు.
జాతీయ పార్టీలకే ప్రయోజనం చేకూరుతుందనీ, రాష్ట్రాల సమస్యలపై పట్టింపే లేని పరిస్థితి ఉత్పన్నమౌతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఖర్చు తగ్గుతుందన్న నెపంతో కేంద్రం జమిలి ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపడమంటే.. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే ఔతుందని పేర్కొన్నారు.
జగన్ హయాంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలిందన్న షర్మిల, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేయడంతో పాటు రాష్ట్ర ఆదాయాన్ని కూడా కొల్లగొట్టారన్నారు. జగన్ హయాంలో కంటైనర్ల కొద్దీ మాదకద్రవ్యాలు రాష్ట్రంలోకి వచ్చాయని ఆరోపించారు.
రాజంపేటలో కూటమి నాయకుల రాజకీయం రాజుకుంది.
వ్యవస్థను కాపాడాల్సిన వారే విద్రోహానికి పాల్పడుతున్నారా? అనే అంశాలపై ప్రముఖ విశ్లేషకుడు అప్పసాని రాజేష్ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో కూలంకషంగా వివరించారు.
గ్లోబల్ ప్రపంచంలో ఒక చోట రేగే చిచ్చు, ఖండాలు దాటి మన వంటింటి గ్యాస్ ధరను, మన పిల్లల సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలను కూడా ప్రభావితం చేస్తుంది.
టీవల బొత్సకు బ్రెయిన్ స్ట్రోక్ తగిలి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోలుకుని ఆయన మండలికి వచ్చారు. అప్పుడు ఆయనకు లోకేష్ సాదరంగా ఆహ్వానించిన తీరు పట్ల లోకేష్ పై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. అదే గతంలో చంద్రబాబు పై జగన్ చేసిన వ్యాఖ్యలపై పార్టీలకు అతీతంగా అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓడలు బండ్లు అవుతాయి. బండ్లే ఓడలవుతాయి అన్న సామెతకు నేటి జగన్ పరిస్థితి అచ్చుగుద్దినట్లు సరిపోతుందంటున్నారు పరిశీలకులు. ఒక్కోసారి అవసరం తీరిపోయిన తర్వాత విసిరేసిన తెడ్డే.. చివరికి పడవ బోల్తా పడ్డప్పుడు దిక్కవుతుంది. అన్నదానికి జగన్ అపరిపక్వంతో కూడుకున్న రాజకీయ విధానాలే ఉదాహరణంటున్నారు.
కూటమి ఐక్యత ప్రాధాన్యతను జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అసెంబ్లీ వేదికగా వివరించడం కిరణ్ రాయల్ వంటి నేతలకు చెంపపెట్టుగానే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి ఐక్యత వల్ల ఎంత మేలు జరుగుతుందో పవన్ కల్యాణ్ విడమరచి చెప్పారు.
రెండు స్థానాలు ఖాళీ అయి.. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫకేషన్ జారీ చేయగానే.. బీఆర్ ఎస్ మైనారిటీ నాయకుడు, మాజీ హోం మంత్రి మహమూద్ అలీని రంగంలోకి దింపుతామన్న సంకేతాలు ఇచ్చింది. అలాగే రేవంత్ రెడ్డి వేంనరేందర్ రెడ్డి అభ్యర్థిత్వం కోసం పట్టుబడుతుండటంతో.. బీఆర్ఎస్ బీసీ నాయకుడిని రంగంలోకి దింపడం ద్వారా, రేవంత్ బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకోవడాన్ని నిలదీసి ఇరుకున పెట్టాలని కూడా భావించినట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు ఆయన గురువారం విచారణకు హాజరయ్యారు. ఈ నెల 9 వరకూ ప్రతిరోజూ విచారణకు హాజరవ్వాల్సిందే. ఈ నేపథ్యంలోనే సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాసరావు తెలుగువన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కేసు పూర్వాపరాలు, పర్యవశానాలపై విశ్లేషించారు.
రేవంత్ ని అంచెలంచెలుగా ఎదిగేలా చేసి ఎంపీగా, ఆ తర్వాత సీఎంగా అవ్వడానికి దారి తీసింది. ఎవరిని ఎమ్మెల్సీ చేయాలని ఆనాడు రేవంత్ భావించారో, అదే వేం నరేందర్ రెడ్డి.. నేడు ఆయన రాజకీయ సలహాదారుగా క్యాబినేట్ ర్యాంకులో ఉంటూనే.. ఇప్పుడు పెద్దల సభలోకి సగర్వంగా అడుగు పెడుతున్నారు.
సీట్ల సర్దుబాటుపై డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఫోనులో మాట్లాడినట్టు తెలిసింది. తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా, డీఎంకేతో కూటిమిలో భాగంగా 30 సీట్లకు తగ్గేది లేదని కాంగ్రెస్ ఇంత వరకూ పట్టుబడుతూ వచ్చింది. దీంతో సీట్ల పంపకాలపై పరిష్కారానికి డీఎంకేతో సంప్రదింపులు జరిపే బాధ్యతను కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి పార్టీ అధిష్ఠానం అప్పగించింది.