గురక ఇక దూరం!

Publish Date:Aug 6, 2019

Advertisement

ఇంట్లో ఎవరైనా గురక పెట్టేవారుంటే వాళ్లు సుఖంగా నిద్రపోతారేమో కానీ, మిగతావారికి మాత్రం జాగారం తప్పదు. ఎందుకంటే గురక సమస్య మనకంటే మన తోటివారినే ఎక్కువగా విసిగిస్తుంది. ఇక కొత్త చోట గురక పెడితే అది అవతలివారికి మన మీద దురభిప్రాయాన్ని కలిగించే ప్రమాదమూ లేకపోలేదు. చుట్టుపక్కల వారు చూసీ చూడనట్లు ‘మీకు బాగా గురకపెట్టే అలవాటు ఉన్నట్లుందే!’ అని బయటపడినా కూడా ‘అబ్బే అలాంటిదేమీ లేదు!’ అంటూ దాటవేస్తూ ఉంటారు చాలామంది. అలా నామోషీపడి మన గురక అలవాటుని లేదన్నట్లుగా భ్రమిస్తే చివరికి నష్టపోయేది మనమేనంటున్నారు నిపుణులు.

 

ఇవీ కారణాలు!
ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించే గాలికి కొండనాలికకి అడ్డుపడుతూ ఉండటం వల్ల గురక శబ్దం వస్తుంది. ఇలా జరగడానికి కారణాలు చాలానే ఉన్నాయి.
 

- కొండనాలిక చుట్టూ కొవ్వు పేరుకునిపోయి, శ్వాస వెళ్లే ద్వారం సన్నబడిపోవడం.
- ఆస్తమా, సైనస్ వంటి శ్వాసకోశ సంబంధ వ్యాధులు.
- జలుబు, కఫంతో కూడిన దగ్గు వంటి తాత్కాలిక సమస్యలు.
- ఊబకాయం వల్ల నోటి ద్వారా గాలిని పీల్చుకోవలసి రావడం.
- ధూమపానం వల్ల శ్వాసనాళాలు మూసుకుపోవడం.
- మద్యపానం కలిగించే మత్తులో గొంతులోని కండరాలు అదుపుతప్పడం.
- ఆలస్యంగా అందులోనూ భారీగా ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల మీద ఒత్తిడి ఏర్పడటం.

 

ఇవీ సూచనలు!
గురక కేవలం ఒక అనారోగ్యం కాదు. మన శరీర వ్యవస్థలో ఏదో లోపం ఏర్పడిందని చెప్పే సూచన!
 

- గుండె జబ్బులు ఉన్నవారిలో గురక అలవాటు అధికంగా ఉంటుంది. గురక అలవాటు ఉన్నవారిలో గుండెపోటు రావడానికి   30 శాతానికి పైగా అవకాశం ఉందంటున్నారు నిపుణులు.
- పక్షవాతానికీ గురకకీ మధ్య కూడా చాలా తీవ్రమైన సంబంధం ఉందంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఐరోపా ప్రజలను         పరిశీలించినప్పుడు వారిలో గురకకీ, పక్షవాతానికీ మధ్య ఏకంగా 67 శాతం సంబంధం ఉన్నట్లు తేలిందట.
- లోలోపల మానసిక సమస్యలతో కుంగిపోతూ సరిగా నిద్రపట్టనివారిలో గురక పెట్టే అలవాటు ఎక్కువగా    ఉంటుందంటున్నారు వైద్యులు.
- అధిక రక్తపోటు, కండరాల సమస్యలు వంటివి కూడా గురకకు దారితీయవచ్చు.

 

ఇవీ మార్గాలు!
గురకను తగ్గించేందుకు అన్నిరకాల వైద్యవిధానాలలోనూ మందులు లభిస్తున్నాయి. ఇవి కాకుండా కొన్ని పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. తప్పనిసరి పరిస్థితులలో శస్త్రచికిత్స ద్వారా దీనిని నివారించుకునే అవకాశం ఉంది. కానీ చిన్నపాటి జాగ్రత్తలను కనుక పాటిస్తే చాలామందిలో గురక సమస్యను నివారించవచ్చు. అవేమిటంటే...

- రాత్రివేళల్లో మితమైన, అది కూడా త్వరగా అరిగిపోయే ఆహారాన్ని తీసుకోవాలి. ఆ ఆహారం కూడా నిద్రపోయే వేళకి  అరిగిపోయేట్లుగా ఉండాలి.
- ప్రాణాయామం వంటి పద్ధతుల ద్వారా శ్వాసకోశంలో ఉన్న సమస్యలను, తద్వారా గురకనూ నివారించవచ్చు.
- పడుకునే ముందు కాస్త ఆవిరి పడితే ముక్కు, గొంతులో ఉన్న అడ్డంకులు తొలిగిపోతాయి.
- వెల్లకిలా పడుకున్నప్పుడే గురక పెట్టే సమస్య అధికంగా ఉంటుంది. అందుకని పక్కకి తిరిగి పడుకుంటే ఈ సమస్య    తాత్కాలికంగా అయినా తగ్గుతుంది. అందుకు తగినన్ని దిళ్లని మెడ కింద పేర్చుకోవాలి.
- ఇక వెల్లకిలా పడుకున్నప్పుడు, తల కింది ఎక్కువ ఎత్తు ఉండటం వల్ల కూడా శ్వాసకి అడ్డంకులు ఏర్పడి, గురకకి  దారితీస్తాయి. కాబట్టి తల కింద వీలైనంత తక్కువ ఎత్తుతో పడుకోవడం మంచింది.
- ధూమపానం, మద్యపానం వంటి అనారోగ్యకర అలవాట్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.
- అన్ని అనర్థాలకూ మూలకారణం ఊబకాయం. శరీర బరువును, ఆకారాన్నీ నియంత్రించుకుంటే గురకే కాదు... దాంతో  పాటుగా సవాలక్ష సమస్యలు మాయమైపోతాయి.

చాలామంది గురక వల్ల కేవలం అవతలివారికే ఇబ్బంది అనుకుంటారు. నిజానికి గురక పెడుతున్నవారు కూడా హాయిగా నిద్రపోతున్నారని చెప్పడానికి లేదు. పైగా గురుక శబ్దం వల్ల వారిలోని గుండె కండరాలు నాశనమైపోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గురకని నివారించుకునే ప్రయత్నాలు చేయడానికి ఈ హెచ్చరిక చాలేమో!

- నిర్జర.
 

By
en-us Political News

  
నేటి కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, పని ఒత్తిడి మరియు జీవనశైలి కారణంగా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మలబద్ధకం..
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనల్ని నిరంతరం వేధించే ప్రధాన శత్రువులు ఒత్తిడి మరియు ఆందోళన. వీటితో పాటు థైరాయిడ్..
బ్రేక్ ఫాస్ట్ లేదా అల్పాహారం నేటికాలపు జీవనశైలికి చాలా ముఖ్యంగా మారింది.  ఉదయాన్నే అల్పాహారం తప్పకుండా తినాలని వైద్యుల నుండి ఆహార నిపుణుల వరకు ప్రతి ఒక్కరూ చెబుతారు.  అయితే చాలామంది అల్పాహారంలో..
కాలంతో పాటు అన్ని అలవాట్లు అప్డేట్ అవుతూ ఉన్నాయి.  మొదట వేప పుల్లలతో పళ్లు తోమేవారు,  తర్వాత పేస్ట్ లు వచ్చాయి.  ఆ తరువాత పేస్ట్ లలో ఉప్పు, బొగ్గు, లవంగం వంటివి చేరాయి.  అవి కూడా అయ్యాక మౌత్ వాష్ లు వచ్చాయి....
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.