Publish Date:Dec 13, 2022
క్రికెట్ అనగానే ప్రపంచంలో ఆ క్రీడను అభిమానించే అందరికీ ఠక్కున గుర్తొచ్చే పేరు విరాట్ కోహ్లీ. కింగ్ కోహ్లీని అభిమానించే క్రికెట్ ప్రేమికులు ప్రపంచంలో క్రికెట్ ఆడే దేశాలన్నిటిలో ఉన్నారు. ముఖ్యంగా ఛేజింగ్ లో కోహ్లీలోని బెస్ట్ క్రికెటర్ బయటకు వస్తాడు.
అంటే ప్రత్యర్థులు నిర్దేశించే విజయ లక్ష్యాన్ని ఛేదించే విషయంలో కోహ్లీ బ్యాటింగ్ విశ్వరూపాన్ని చూపుతాడు. ముఖ్యంగా పొట్టి క్రికెట్ లో కోహ్లీ ఘనత గురించి ఎంత చెప్పినా తక్కువే. టి 20లలో అత్యధిక పరుగులు, హయ్యస్ట్ నంబర్ ఆప్ హాఫ్ సెంచరీలు, అత్యుత్తమ సగటు ఇలా దాదాపు రికార్డులన్నీ కోహ్లీ పేరునే ఉన్నాయి.
అయితే అలాంటి ఘనత సాధించిన ఇండియన్ బ్యాటర్ మరొకరు ఉన్నారు. ఔను నిజమే టి20లో కోహ్లీతో సాటి రాగల క్రికెటర్ మరొకరున్నారు. అయితే పురుషుల క్రికెట్ లో కాదు. మహిళల క్రికెట్ లో ఆమె పేరు స్మృతి మందాన.
మహిళల పొట్టి క్రికెట్ లో రికార్డులన్నీ స్మృతి మదాన పేరునే ఉన్నాయి. ముఖ్యంగా ఛేజింగ్ లో ఆమె బ్యాటింగ్ లెవెలే వేరు. విశేషమేమిటంటే కోహ్లీ జెర్సీ నంబర్ 18 అయితే స్మృతి జెర్సీ నంబర్ కూడా 18. ఇద్దరికీ బ్యాటింగ్ స్టైల్ నుంచి జెర్సీ నంబర్ వరకూ ఎన్నో సారూప్యతలు ఉన్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/smriti-mandana-resemblence-kohli-in-t20s-25-148458.html
ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరద ఉద్ధృతి తీవ్ర రూపం దాల్చడంతో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
ఇంట్లో మొదలైన చిన్నపాటి కుటుంబ కలహాలు.. చివరకు రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాయి.
అంబులెన్స్‌లో మృతదేహం.. న్యాయం కోసం రోడ్డెక్కిన బంధువులు.!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్ ఏ. చక్రపాణి తుదిశ్వాస విడిచారు.
గ్రేటర్ హైదరాబాద్ నగరంలో తీవ్ర రూపం దాల్చుతున్న తాగునీటి ఎద్దడి విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి సవాల్ విసిరారు. సోషల్ మీడియాలో సవాళ్లు విసరడం మానేసి, EVMలు మరియు SIR అంశాలపై పార్లమెంట్లో చర్చకు రావాలని ఆమె డిమాండ్ చేశారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఆంధ్రప్రదేశ్ పురపాలక ఎన్నికల ఫలితాల్లో కడప జిల్లాలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి
విశాఖపట్నం మేయర్ పీఠాన్ని తెలుగుదేశం పార్టీ దక్కించుకుంది
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్న గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన సత్తా చాటింది.