Publish Date:May 31, 2023
ఇకపై ఓటీటీలో ప్రసారమయ్యే వాటికి పొగాకు వ్యతిరేక హెచ్చరికలను కంపల్సరీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఇలా చేయడం వల్ల పొగాకు వ్యతిరేక ప్రచారం ప్రజల్లోకి వెళుతుంది కానీ అమలు చేయించడంలో మాత్రం పాలకులు చిత్తశుద్ది ప్రదర్శించాల్సి ఉంది. పొగ త్రాగుట ఆరోగ్యానికి హానికరం సినిమా థియేటర్ స్లైడ్స్ లో ప్రచారం చేస్తుంది. తాజాగా పాలకులు ఇటువంటి ప్రచారాలను ఒటీటీ ప్రసారాల్లో కూడా చేస్తున్నారు. ఇలా ప్రచారం చేయడంలో తప్పు లేదు. కానీ పాలకులు గతంలో చేసిన ఉత్తర్వులను అమలు చేయిస్తున్నారా? లేదా అనేది శేష ప్రశ్నగానే మిగులుతుంది. థియేటర్ స్లైడ్స్ లో పొగతాగడం ఆరోగ్యానికి హానికరం అని సిగరెట్ పెట్టెలపై ఉన్న మాదిరిగానే ఒటీటీ ప్రసారాల్లో ఉంటుంది తప్పితే అమలు చేయించే బాధ్యత పాలకులపై ఉండటం లేదు. అదే థియేటర్ ప్రాంగణంలోనే ఇంటర్వెల్ లో పొగలు కక్కే సిగరెట్లను ఊదేసేవారు ఎక్కువగా ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో పొగత్రాగుట నిషేధం అని మన చట్టాల్లో ఉన్నప్పటికీ వాటిని అమలు చేయించే బాధ్యత పోలీసు అధికారులపై ఉంది. జైలు శిక్ష విధించే అధికారం చట్టాల్లో ఉన్నప్పటికీ ఆచరణలో మాత్రం చిత్తశుద్ది లోపించినట్లయ్యింది. ఇవ్వాల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని తద్దినం మాదిరిగా జరుపుకునే వారే సమాజంలో ఎక్కువయ్యారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/smokers-not-punisheble-25-156144.html
Publish Date:Oct 10, 2026
కన్నవారిని చూడాలని.. స్వస్థలానికి చేరుకోవాలని ఎన్నో ఆశలతో రైలు ఎక్కిన ఓ యువతి ప్రయాణం విషాదాంతమైంది.
దేశ రాజధాని దిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తలపెట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
భారతీయ రాజకీయ రంగంలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
దసరా పండుగ సెలవులు ప్రారంభం కావడంతో భాగ్యనగరంలో ప్రయాణికుల రద్దీ తారాస్థాయికి చేరింది.
దేశ రాజధాని న్యూఢిల్లీలో రాజకీయ వేడి తారాస్థాయికి చేరింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం లైంగిక వేధింపుల ఉదంతంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్‌లోని నందిగ్రామ్ అసెంబ్లీ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి హసిరాణి రథ్ భారీ విజయం సాధించారు.
ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఏవియేషన్ రంగానికి సంబంధించి అత్యంత కీలకమైన చారిత్రాత్మక పరిణామం చోటుచేసుకుంది.
ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి ప్రకటన అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన గాదె సాయి కృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక ఛార్జిషీట్‌ను కోర్టుకు సమర్పించింది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే అత్యున్నత పురస్కారాలలో ఒకటైన 2026 సంవత్సరపు నోబెల్ శాంతి బహుమతిని భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయకోవిదురాలు నవనీతం నవి పిళ్లై గెలుచుకున్నారు.
అర్ధరాత్రి వేళ రోడ్లపై పుట్టినరోజు వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ నగరవాసులకు విజ్ఞప్తి చేశారు.