సంక్షోభంలో చిన్నతరహా పరిశ్రమలు

Publish Date:Mar 5, 2012

Advertisement

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రాని ఔత్సాహికులు
తెలుగువన్.కామ్ ప్రత్యేక కథనం

హైదరాబాద్: రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమలు ఎన్నడూ లేని విధంగా సంక్షోభంలో  చిక్కుకున్నాయి. ముడివనరుల కొరత, మార్కెటింగ్ అవకాశాలు లేకపోవడం, పలురకాల పన్నులు, అధికారులు ప్రభుత్వ ఉద్యోగుల అవినీతితో ఇప్పటికే కుదేలయిన ఈ పరిశ్రమకు మరో విఘాతం కలిగింది. విద్యుత్ కోత కారణంగా ఈ పరిశ్రమలు మూతపడుతున్నాయి. సాధారణంగా వేసవికాలంలో విద్యుత్ హాలిడే విధించేవారు. కానీ ఇంకా వేసవి సమీపించకుండానే వారంలో రెండురోజులపాటు విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుండటంతో చిన్నతరహా పరిశ్రమల యజమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఈ అడ్డగోలు కోతలతోపాటు సాంకేతిక అంతరాయాల పేరుతో రోజుకు సగటున రెండు గంటల విద్యుత్ ను నిలిపివేస్తున్నారు. చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటుచేస్తే విద్యుత్ సబ్సిడి ఇస్తామని ప్రభుత్వం ఊరించింది. అసలు విద్యుత్తే లేకపోవడంతో సబ్సిడి ఇచ్చి ఉపయోగం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చిన్న పరిశ్రమలు రన్నింగ్ లో ఉండగా విద్యుత్ నిలిచిపోతే పూర్తిస్థాయిలో సరుకును తయారు చేయలేరు. దీనికి తోడు విద్యుత్ వచ్చిన వెంటనే చాలా పరిశ్రమల్లో వెంటనే ఉత్పత్తి జరగదు. దీనివల్ల ఈ పరిశ్రమల్లో ఉత్పత్తి గణనీయంగా పడిపోతుంది. ఒకవైపు విద్యుత్ కొరతతో చిన్న తరహా పరిశ్రమలు అల్లాడుతుంటే విద్యుత్ రాయితీలిస్తాం, పరిశ్రమలు నెలకొల్పండంటూ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను పరిశ్రమలశాఖ ఊరిస్తోంది. అయితే పరిస్థితులను గమనిస్తున్న వారు రాష్ట్రంలో చిన్నతరహా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుచేసి చాలా తప్పు చేశామన్న భావనను కొంతమంది పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేస్తున్నారు. బ్యాంకు రుణాలుపొంది పరిశ్రమలు ఏర్పాటుచేస్తే ఉత్పత్తి లేక వాణిజ్య బ్యాంకుల నోటీసులు అందుకుని వడ్డీలు, పెనాల్టీలు రూపంలో లక్షలాది  రూపాయలు చెల్లించాల్సి వస్తున్నదని పారిశ్రామికవేత్తలు గొల్లుమంటున్నారు.                         

By
en-us Political News

  
టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటించిన తాజా సంచలన చిత్రం ఇరుముడి చట్టపరమైన చిక్కుల్లో పడింది.
60 తులాల బంగారం, రూ.10 లక్షల నగదు అపహరణ.!
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అవసరానికి ఆదుకుంటుందనే నమ్మకంతో ఓ వ్యక్తి ర్యాపిడో పార్సిల్ సేవలను ఆశ్రయించాడు.
బిగ్ బ్రదర్ ఆఫీసులో రియల్టర్‌కు ప్రత్యేక ఛాంబర్.. ఒక్క బిల్డర్ కోసం వేలాది కుటుంబాలను రోడ్డున పడేస్తారా?
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న అమాయక యువతులను లక్ష్యంగా చేసుకుని గుట్టు చప్పుడు కాకుండా నడుపుతున్న మరో అక్రమ ఫెర్టిలిటీ రాకెట్‌ను పోలీసులు రట్టు చేశారు.  
.గరల్స్ హాస్టల్ ముసుగులో నిర్వహిస్తున్న అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ బాగోతం వెలుగులోకి వచ్చింది. పక్కాగా అందిన సమాచారంతో హైదరాబాద్ ప్రకాశ్ నగర్ లో అమినీత గరల్స్ హాస్టల్ పై దాడి చేయడంలో అక్రమ ఫెర్టిలిటీ సెంటర్ గుట్టు రట్లైంది.
పలు ప్రాంతాలలో ఇప్పటికే  రోజూవారీ సరఫరా  నిలిపివేశారు. రోజు విడిచి రోజు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. ముందు ముందు ఇది రెండు రోజులు, మూడు రోజులు. వారం రోజులకు కూడా పెరిగే అవకాశం ఉందని జలమండలి అధికారులే ఆఫ్ ది రికార్డ్ చెడుతున్నారు.
ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న జాతీయ స్థాయి నిరసన ర్యాలీకి తెలంగాణ నుంచి పార్టీ శ్రేణులను తరలించేందుకు ప్రత్యేక రైళ్లు కేటాయించకపోవడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో ప్రయాణికురాలు తోసివేయడంతో గాయపడిన టీజీఎస్‌ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు ప్రభుత్వం అండగా ఉంటుందని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భరోసా ఇచ్చారు.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోసం ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు. ఈ నిర్ణయం రాష్ట్ర పాలనా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  తదుపరి సీఎస్ రేసులో  ఉన్న జయేష్ రంజన్ వీఆర్ఎస్ కు దరఖాస్తు చేసుకోవడం సంచలనంగా మారింది. 
మరీ ముఖ్యంగా హైదరాబాద్ పై చలిపులి పంచా విసిరింది.  ఉదయం పూట ఎండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటున్నా, రాత్రి వేళల్లో,  తెల్లవారుజామున చలి తీవ్రత భారీగా ఉంటోంది.  
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బొమ్మకల్ సల్ఫీ నగర్‌లో చోటుచేసుకున్న ఒక అంతులేని విషాద ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.