వారెవ్వా ఏమి ట్యాబ్లెట్

Publish Date:Jan 7, 2015

Advertisement

 

ట్యాబ్లెట్ ఎంత తేలిగ్గా వుంటే దాన్ని ఉపయోగించే వాళ్ళకి అంత సౌకర్యంగా వుంటుంది. ఈ విషయాన్ని గ్రహించిన అనేక కంపెనీలు తాము ఉత్పత్తి చేసే ట్యాబ్లెట్ల బరువును క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నాయి. ఇలాంటి విషయాల్లో ముందుండే డెల్ సంస్థ తాజాగా అత్యంత పల్చగా వుండే ట్యాబ్లెట్‌ని తయారు చేసింది. వెన్యూ 8 పేరుతో రూపొందించిన ఈ టాబ్లెట్ ఈమధ్యే మార్కెట్లోకి కూడా విడుదలైంది. ప్రస్తుతం అమెరికాలో దొరుకుతోంది. తెలిసినవారి చేత తెప్పించుకోవాలంటే దాదాపు పాతికవేల రూపాయల ధరకు లభిస్తుంది. ఇంటెల్ సహకారంతో నిర్మించిన ఈ గాడ్జెట్‌లో ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు. డెస్క్‌టాప్ పీసీ సామర్థ్యానికి సమీపంలో ఇది ఉంటుంది. దీంతోపాటు పవర్ వీఆర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, రెండు గిగాబైట్ల ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులువు అవుతుంది. గ్రాఫిక్స్ మోతాదు ఎక్కువగా ఉండే గేమ్స్‌ను ఈ ట్యాబ్లెట్లో హాయిగా అడుకోవచ్చు. ఇక కెమెరా విషయానికి వస్తే ఎనిమిది మెగాపిక్సెళ్ల కెమెరా నిక్షిప్తమై వుంది. డెల్ వెన్యూ 8లో 16 జీబీల బిల్ట్ ఇన్ స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్‌డీకార్డు ద్వారా దీన్ని మనకు కావలసినంత స్థాయికి పెంచుకోవచ్చు కూడా. స్క్రీన్‌సైజు 8.4 అంగుళాలు కాగా, రెజల్యూషన్ 2560 / 1480 వరకూ ఉంటుంది. దీనిలో లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు. ఇంకేం.. అమెరికాలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా.. వెంటనే తెప్పించుకోండి.. ఇండియాకి ఇది ఎప్పటికి వస్తుందో ఇంకా స్పష్టంగా తెలియదుమరి.

By
en-us Political News

  
ఫిలిప్స్ బారిస్టినా కాఫీ మెషిన్ ఇప్పుడు 26% భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఫ్రెష్ బీన్-టు-కప్ ఎస్ప్రెస్సో, ఆటోమేటిక్ ఫీచర్లు మరియు ఇతర కాఫీ మెషిన్ల డిస్కౌంట్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
TP Link కంపెనీ IFA 2026 వేదికగా ప్రపంచంలోనే మొట్టమొదటి Wi-Fi 8 Archer 9 Ultra రూటర్ మరియు Deco 8 Ultra మెష్ సిస్టమ్‌ను లాంచ్ చేసింది. 22Gbps గరిష్ట వేగం, 9,800 చదరపు అడుగుల కవరేజ్ మరియు StabilityEngine టెక్నాలజీతో వచ్చిన ఈ విప్లవాత్మక డివైజెస్ పూర్తి వివరాలు తెలుసుకోండి.
నేపాల్, టిబెట్ సరిహద్దుల్లో సంభవించిన వినాశకర జలప్రళయం వెనుక ఉన్న అసలు కారణాలు, గ్లేసియర్ ప్రమాదాలు మరియు భారత్ లోని హిమాలయ ప్రాంతాలకు పొంచి ఉన్న వాతావరణ ముప్పు గురించి పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
15 ఏళ్ల ప్రస్థానం తర్వాత యాపిల్ సీఈఓ పీఠం నుంచి టిమ్ కుక్ తప్పుకుంటున్నారు. సెప్టెంబర్ 1 నుంచి జాన్ టెర్నస్ నూతన సీఈఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. $5 ట్రిలియన్ల వృద్ధి, కొత్త సీఈఓ ఎదుర్కొనే సవాళ్ల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
బ్రిటన్‌లో నిర్వహించిన యుగోవ్ సర్వే ప్రకారం 80 శాతం మంది ఉపాధ్యాయులు AI ని ఉపయోగిస్తున్నప్పటికీ, వారి పనిభారం తగ్గడం లేదని వెల్లడైంది. లెసన్ ప్లాన్లు, ఈమెయిళ్ల తయారీకి AI ఎంతగా ఉపయోగపడుతోంది, విద్యార్థుల అభ్యాసంపై ఎలాంటి ప్రభావం చూపుతోంది అనే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
యాంకర్ సౌండ్కోర్ నెబ్యులా P1 ప్రాజెక్టర్ పూర్తి రివ్యూ. 1080p రెసల్యూషన్, 650 లుమెన్స్ బ్రైట్‌నెస్, డిటాచబుల్ వైర్‌లెస్ స్పీకర్లు మరియు అవుట్‌డోర్ ఫీచర్ల వివరాలను తెలుసుకోండి.
ఏజెంటిక్ ఏఐ వర్క్‌లోడ్స్ కోసం ఇంటెల్ పరిచయం చేసిన డైమండ్ రాపిడ్స్, క్రెసెంట్ ఐలాండ్, వైల్డ్‌క్యాట్ లేక్ ఆర్కిటెక్చర్ల సమగ్ర వివరాలు మరియు టెక్నికల్ స్పెసిఫికేషన్లు ఇక్కడ తెలుసుకోండి.
బెంట్లీ కంపెనీ నుంచి వస్తున్న తొలి ఆల్ఎ లక్ట్రిక్ ఎస్‌యూవీ బెంట్లీ టోర్కల్ విశేషాలు. V8 ఇంజిన్ రిథమిక్ సౌండ్, 113 kWh బ్యాటరీ, 390 kW ఫాస్ట్ ఛార్జింగ్‌తో 16 నిమిషాల్లో 80% ఛార్జింగ్ అయ్యే ఈ లగ్జరీ ఈవీ ప్రత్యేకతలు ఇవే!
గార్మిన్ ఫెనిక్స్ 9 మరియు ఫెనిక్స్ 9 ప్రో స్మార్ట్‌వాచ్‌లు భారీ ధరలతో విడుదలై షాక్ ఇచ్చాయి. $1,099 ప్రాథమిక ధర కలిగిన ఈ వాచ్‌కు ప్రత్యామ్నాయంగా లభించే గార్మిన్ వేనూ 4, వీవోయాక్టివ్ 6 మోడళ్ల ఫీచర్లు మరియు వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
డార్క్ వెబ్‌లో కంపెనీ లాగిన్ వివరాలను అమ్ముకుంటున్న సొంత ఉద్యోగులు. ఫ్లాష్‌పాయింట్ తాజా పరిశోధనలో వెల్లడైన సంచలన గణాంకాలు మరియు ఇన్సైడర్ థ్రెట్స్ వివరాలు ఇక్కడ చదవండి.
డయాబెటిస్ నియంత్రణలో విప్లవాత్మక మార్పు! గ్లూకోజ్ మరియు కీటోన్ స్థాయిలను ఒకే సమయంలో ట్రాక్ చేసే ప్రపంచంలోనే మొదటి డ్యూయల్ సెన్సార్ లిబ్రే డుయో 10 డే కి ఎఫ్‌డిఎ ఆమోదం తెలిపింది. దీని పూర్తి వివరాలు మరియు ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి.
అమెరికాలోని ఐవెడా సంస్థ 150 నిమిషాల సుదీర్ఘ ఫ్లైట్ టైమ్‌తో గ్యాసోలిన్‌తో నడిచే ఐవెడాఎయిర్ GX10 F100 హెలికాప్టర్ డ్రోన్‌ను ఆవిష్కరించింది. సాధారణ బ్యాటరీ డ్రోన్ల కంటే 5 రెట్లు ఎక్కువ సమయం ఎగిరే ఈ కొత్త మిలటరీ డ్రోన్ పూర్తి విశేషాలు ఇవే!
జపాన్‌లో ఎలుగుబంట్ల దాడులు తీవ్రరూపం దాల్చాయి. గత ఏడాది 13 మంది మరణించగా, 230 మందికి పైగా గాయపడ్డారు. జనాభాను కాపాడుకోవడానికి ప్రభుత్వం 14,000 ఎలుగుబంట్లను ఏరివేసింది. ఈ విపత్తు వెనుక వాతావరణ మార్పులు మరియు ఆహార కొరత కారణాలను పూర్తి వివరాలతో తెలుసుకోండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.